చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి  

Best Web Hosting Provider In India 2024

పార్లమెంట్ స‌మావేశాల్లో పోలవరం, మార్గదర్శి కుంభకోణంపై చర్చిస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభాపక్షనేత ఎంపీ మిథున్‌ రెడ్డి
 

ఢిల్లీ:  రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని, చంద్ర‌బాబు పెట్టే కేసుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభాపక్షనేత ఎంపీ మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు.  కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.  పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.
చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్:
‘ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. పుంగనూరులో మేము కొనుగోలు చేసిన భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి పేరును ఆయన రోజూ తలుచుకుంటున్నారు. ఏదో ఒక రకంగా కక్ష సాధించాలని చూస్తున్నారు. 2001లోనే మేము భూములను కొనుగోలు చేశాం. 75 ఎకరాల భూమి విలువ మూడు కోట్లు మాత్రమే. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. రాజకీయ కక్షతోనే మాపైన కేసులు పెడుతున్నారు.  మాపై ఇప్పటి వరకు చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలి. కూటమి కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధం` అని మిథున్‌రెడ్డి చెప్పారు.  

మార్గదర్శి చిట్ ఫండ్స్ భారీ కుంభ‌కోణం:
మార్గదర్శి చిట్ ఫండ్స్ కుంభకోణం సహారా స్కామ్‌ను మించింది. మార్గదర్శి  నిబంధనలను ఉల్లంఘించిందని సుప్రీంకోర్టుకు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.  వేలాది మంది డిపాజిటర్లు మార్గదర్శి వల్ల  నష్టపోయారు. నేను పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని లేఖలు రాస్తాను. న్యాయస్థానంలో కూడా కేసులు వేస్తాను అని పేర్కొన్నారు. పోలవరం ఎత్తుపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలి. పోలవరం ఎత్తు తగ్గిస్తారన్న అంశంపై మంత్రి నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

Best Web Hosting Provider In India 2024