
ఎన్టీఆర్ జిల్లా /నందిగామ (తక్కెళ్ళపాడు) ..
ది.22-8-2022(ఆదివారం) ..
జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకున్న నిర్మల గారి నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదల సొంతింటి కల సాకారం ..
ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు ..
నందిగామ మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో జగనన్న కాలనీలో ప్రభుత్వ సహకారంతో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు వేల్పుల నిర్మల-పుల్లయ్య దంపతుల నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు వారికి శుభాకాంక్షలు తెలిపారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేయడమే కాకుండా ఆ జగనన్న కాలనీలలో సొంత ఇల్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందజేస్తూ పేదవారి సొంత ఇంటి కలలు సహకారం చేస్తున్నారని తెలిపారు , అనంతరం తక్కెళ్ళపాడు గ్రామంలో సొంత ఇల్లు నిర్మించుకున్న వేల్పుల నిర్మల గారు మాట్లాడుతూ సొంత ఇల్లు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి సహకారంతో తాము సొంత ఇల్లు నిర్మించుకోని సంతోషంగా ఉన్నామని తెలిపారు , కొన్ని లక్షల కుటుంబాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో సొంత ఇంట్లో ఉంటున్నారని తెలిపారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , హౌసింగ్ ఏఈ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..