Deva First Review దేవా ఫస్ట్ రివ్యూ- పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ టాక్ అదుర్స్, క్లైమాక్స్ అలా- బుట్టబొమ్మకు హిట్ పడినట్టే!

Best Web Hosting Provider In India 2024

Deva First Review దేవా ఫస్ట్ రివ్యూ- పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ టాక్ అదుర్స్, క్లైమాక్స్ అలా- బుట్టబొమ్మకు హిట్ పడినట్టే!

Sanjiv Kumar HT Telugu
Jan 31, 2025 08:46 AM IST

Deva Movie First Review In Telugu By Umair Sandhu: పూజా హెగ్డే చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా దేవ. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ దేవ ఇవాళ (జనవరి 31) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దేవ ఫస్ట్ రివ్యూ అంటూ ఉమైర్ సంధు ట్వీట్ వైరల్ అవుతోంది.

దేవా ఫస్ట్ రివ్యూ- పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ టాక్ అదుర్స్, క్లైమాక్స్ అలా- బుట్టబొమ్మకు హిట్ పడినట్టే!
దేవా ఫస్ట్ రివ్యూ- పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ టాక్ అదుర్స్, క్లైమాక్స్ అలా- బుట్టబొమ్మకు హిట్ పడినట్టే!

Deva Movie First Review In Telugu: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఇటు తెలుగులో, అటు బాలీవుడ్‌లో వరుసగా పరాజయాలు ఎదురైన విషయం తెలిసిందే. పలు సినిమాల్లో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయి ఆ తర్వాత తొలగించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇదంతా 2024 సంవత్సరం వరకు. ఇప్పుడు 2025లో వరుస సినిమాలతో పూజా హెగ్డే సత్తా చాటనుంది.

yearly horoscope entry point

2025లో పూజా హెగ్డే తొలి సినిమా

ఈ క్రమంలో 2025లో పూజా హెగ్డే నుంచి వస్తున్న తొలి చిత్రం దేవా. బాలీవుడ్ స్టార్, కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి రీమేక్) ఫేమ్ షాహిద్ కపూర్ హీరోగా నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవా. హిందీ చిత్రం దేవా ట్రైలర్, టీజర్, పోస్టర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దేవాపై అంచనాలు బాలీవుడ్‌లో బాగానే ఉన్నాయి.

దేవా మూవీ బడ్జెట్

రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన దేవా సినిమాలో షాహిద్ కపూర్, పూజా హెగ్డే జోడీగా జత కడితే.. పావైల్ గులాటి, కుబ్రా సైట్, ప్రవేశ్ రాణా ఇతర కీలక పాత్రల్లో నటించారు. బాబీ-సంజయ్ కథ అందించిన దేవా సినిమాను జీ స్టూడియోస్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాయ్ కపూర్, షారిక్ పటేల్, ఉమేష్ బన్సాల్ రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

దేవా ఫస్ట్ రివ్యూ

ఇవాళ (జనవరి 31) థియేటర్లలో దేవా మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దేవా ఫస్ట్ రివ్యూ అంటూ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ మెంబర్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు ట్వీట్ వైరల్ అవుతోంది. ఓవర్సీస్ సెన్సార్‌లో వీక్షించిన ఉమైర్ సంధు దేవాపై రివ్యూ ఇచ్చాడు. అలాగే, పలు చోట్ల స్పెషల్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు దేవా మూవీపై ట్విట్టర్ రివ్యూ ఇచ్చారు.

3 స్టార్ రేటింగ్

“ఓవర్సీస్ సెన్సార్ నుంచి దేవా ఫస్ట్ రివ్యూ. దేవా పైసా వసూల్ మాస్ ఎంటర్‌టైనర్ సినిమా. షాహిద్ కపూర్ సినిమా మొత్తం ఆకర్షించాడు. షాహిద్ నటనతో అదరగొట్టాడు. క్లైమాక్స్ మీ మైండ్‌ను బ్లాక్ చేస్తుంది. మంచి ఓపెనింగ్స్ రావాలంటే ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగా చేయాలి. ఎంగేజింగ్ థ్రిల్లర్‌ను కచ్చితంగా చూడొచ్చు” అని రాసుకొచ్చిన ఉమైర్ సంధు దేవాకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.

పూజా హెగ్డేకు హిట్

ప్రస్తుతం ఉమైర్ సంధు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఉమైర్ సంధు రివ్యూలు కొన్నిసార్లు కరెక్ట్‌గా నిజమై పేలితే.. మరికొన్నిసార్లు పూర్తిగా రివర్స్ అయ్యాయి. కానీ, ఇటీవల పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం ఉమైర్ సంధు రివ్యూలు దాదాపుగా కరెక్ట్ అయ్యాయి. దీంతో పూజా హెగ్డేకు ఈ ఇయర్ హిట్ పడినట్లే అని తెలుస్తోంది.

ఎక్స్‌ప్లోజివ్ కాప్ డ్రామా

“ఈ ఇయర్‌లోనే అతిపెద్ద ఎక్స్‌ప్లోజివ్ కాప్ డ్రామా అవుతుంది. రెండున్నర గంటలపాటు ప్యూర్ ఇంటెన్సిటీ, స్టైల్, రా ఎమోషన్స్‌తో షాహిద్ కపూర్ దేవా సినిమా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. విజనరీ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన దేవ రోలర్ కోస్టర్‌ మూవీని చూడటం మిస్ అవకండి” అని రాసుకొచ్చిన ఓ యూజర్ రెండుకు వన్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు.

“పవర్‌ఫుల్. దేవా మూవీ జస్ట్ యావరేజ్. కానీ, సూపర్బ్ డైరెక్షన్, షాహిద్ కపూర్ పర్ఫామెన్స్ పిచ్చిలేపుతుంది” అని తెలిపిన మరొకరు 5కి 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

“దేవా మూవీ ఫ్లాప్ అవుతుంది. సినిమా బాగుంది. కానీ, సరైన బిజినెస్ చేయకపోవచ్చు. షాహిద్ కపూర్ మెంటల్ యాక్షన్‌తో ఇరగదీశాడు. పూజా హెగ్డే పాత్ర ఓకే ఓకేగా ఉంది” అని మరొకరు చెప్పారు.

“దేవ సినిమాను అస్సలు భరించలేం. ఎలాంటి లాజిక్ ఉండదు. లంచం తీసుకున్నాడని పోలీస్‌ను మరో పోలీస్ చంపేసే సీన్స్ ఉన్నాయి. కబీర్ సింగ్ సినిమాలోని నటననే షాహిద్ కపూర్ కాపీ కొట్టాడు. ప్రీజ్ ఆపేయ్. పూజా హెగ్డే నటన బాగుంది. సాంగ్స్ బాగోలేవు. ఈ సినిమాను చూడకండి” అని మరొకరు నెగెటివ్‌గా రాసుకొస్తూ 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

ఉమైర్ సంధు రివ్యూ ప్రకారం

అయితే, పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ దేవాకు ట్విటర్‌ రివ్యూలో మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కానీ, పూజా హెగ్డే యాక్టింగ్ బాగుందని చెబుతున్నారు. ఇక, ఉమైర్ సంధు రివ్యూ ప్రకారం దేవా టాక్ అదిరిపోయిందని, పైసా వసూల్ ఎంటర్‌టైనర్ మూవీ అని తెలుస్తోంది. కాబట్టి, థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత దేవాకు ఎలాంటి టాక్ వస్తోందో చూడాలి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024