




Best Web Hosting Provider In India 2024

SI Suicide : తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై సూసైడ్
SI Suicide in Tanuku Rural Police Station : పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన తణుకు పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఇటీవల సస్పెండ్ అయిన కారణంగానే ఎస్ఐ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్ఐ ఏజీఎస్ మూర్తి
తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. సర్వీస్ రివ్వాలర్ కాల్చుకోవచంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐ ఏజీఎస్ మూర్తి సస్పెన్షన్ కు గురయ్యారు.

ప్రస్తుతం వీఆర్ లో ఉన్న ఎస్సై ఏజీఎస్ మూర్తి… ఇవాళ ఉదయం పెనుగొండలో ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తణుకు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ క్రమంలోనే వాష్ రూమ్ లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఎస్సై సూసైడ్ పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
టాపిక్
Ap Crime NewsAp PoliceWest Godavari
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.