




Best Web Hosting Provider In India 2024

OTT Crime Thriller Web Series: టిఫిన్ డబ్బాల్లో డ్రగ్స్ దందా.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. టిఫిన్ డబ్బాల్లో డ్రగ్స్ దందా చేసే మహిళల చుట్టూ తిరిగే కథతో నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ సిరీస్ రానుంది. తాజాగా శుక్రవారం (జనవరి 31) టీజర్ రిలీజ్ చేశారు.
OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు కేరాఫ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లోకి డబ్బా కార్టెల్ (Dabba Cartel) అనే మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ రానుంది. నాలుగు డబ్బులు సంపాదించడానికి లంచ్ సప్లై చేసే ఐదుగురు మహిళలు అనుకోకుండా ఓ డ్రగ్స్ రాకెట్ బారిన పడితే ఎలా ఉంటుందన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. శుక్రవారం (జనవరి 31) టీజర్ రిలీజ్ కాగా.. ఫిబ్రవరి 28 నుంచి డబ్బా కార్టెల్ స్ట్రీమింగ్ కానుంది.

డబ్బా కార్టెల్ ఓటీటీ రిలీజ్ డేట్
బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ లీడ్ రోల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్. ఆమెతోపాటు మరో సీనియర్ నటి జ్యోతిక, షాలిని పాండేలాంటి వాళ్లు కూడా ఇందులో నటిస్తున్నారు.
ఈ డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండగా.. శుక్రవారం (జనవరి 31) టీజర్ రిలీజ్ చేశారు. హితేష్ భాటియా డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఐదుగురు మధ్యతరగతి మహిళల చుట్టూ తిరుగుతుంది.
డబ్బా కార్టెల్ స్టోరీ ఇలా..
ఓ టిఫిన్ సర్వీస్ నడిపించే వీళ్లు ఓ రోజు అనుకోకుండా ప్రమాదకరమైన డ్రగ్స్ అక్రమ రవాణాలో చిక్కుకుంటారు. ఓ ఫార్మాసూటికల్ కంపెనీలో పని చేసే ఉద్యోగులు కూడా ఈ డ్రగ్స్ సిండికేట్ లో ఉన్నారని తెలియడంతో ఈ కేసు మరింత ప్రమాదకరంగా మారుతుంది.
నిమిషంపైగా సాగే టీజర్లో వెబ్ సిరీస్ ఎంత ఆసక్తికరంగా ఉండనుందో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. సీనియర్ నటీమణులు షబానా అజ్మీ, జ్యోతికలాంటి వాళ్లు ఉండటం ఈ సిరీస్ పై మరింత ఆసక్తి రేపేలా చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో మరో సీనియర్ నటుడు గజ్‌రాజ్ రావ్ కూడా ఉన్నాడు.
ఎక్సెల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. విశాల్ మేనన్, భావనా ఖేర్ కథ అందించిన ఈ డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవీ
నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటికే ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వీటిలో మొదట వచ్చిన వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్. రెండు సీజన్ల పాటు సాగిన సిరీస్ ఇది. ఇదే కాకుండా జాంతారా, ఢిల్లీ క్రైమ్, స్కూప్, గన్స్ అండ్ గులాబ్స్, యే కాలీ కాలీ ఆంఖే, షి, రానా నాయుడులాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో ఉన్నాయి. తాజాగా ఈ డబ్బా కార్టెల్ కూడా రానుండటంతో మరో ఆసక్తికరమైన సిరీస్ ఈ లిస్టులో చేరనుంది.
సంబంధిత కథనం