OTT Telugu: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ- కిల్లర్‌ను కమెడియన్ అనుకుంటే- ఎక్కడ చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024

OTT Telugu: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ- కిల్లర్‌ను కమెడియన్ అనుకుంటే- ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Feb 01, 2025 06:03 AM IST

Coffee With A Killer OTT Streaming: ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కాఫీ విత్ ఏ కిల్లర్. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ ఆర్‌పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్నటి (జనవరి 31) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..!

డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ- కిల్లర్‌ను కమెడియన్ అనుకుంటే- ఎక్కడ చూడాలంటే?
డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ- కిల్లర్‌ను కమెడియన్ అనుకుంటే- ఎక్కడ చూడాలంటే?

Coffee With A Killer OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు వస్తుంటాయి. వాటిలో తెలుగులో వచ్చేవి కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఇక క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్‌కు కాస్తా కామెడీ యాడ్ చేసే సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. అలా తెలుగులో తాజాగా తెరకెక్కిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే కాఫీ విత్ ఏ కిల్లర్.

yearly horoscope entry point

కాఫీ విత్ ఏ కిల్లర్ నటీనటులు

టాలీవుడ్ కమెడియన్ శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, డైరెక్టర్ రవిబాబు, అంబటి శ్రీను, నేక్‌డ్ ఫేమ్ శ్రీరాప, జెమిని సురేష్, టెంపర్ శీను తదితరులు కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పీ పట్నాయక్ కథ రచనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

కాఫీ షాప్‌లో నడిచే కథ

ఒక కాఫీ షాప్‌లో వివిధ వ్యక్తులు తమ జీవితాలకు సంబంధించిన విషయాలను మాట్లాడుకునేందుకు వస్తారు. అక్కడికి ఓ కిల్లర్ కూడా ఒకరిని చంపేందుకు వస్తాడు. ఆ హంతకుడిని పట్టుకునేందుకు ఓ పోలీస్ కూడా ఎంట్రీ ఇస్తాడు. మరోవైపు ఫ్యామిలీ డిస్కషన్స్, నిర్మాతకు స్టోరీ నెరేషన్, ల్యాండ్ డీలింగ్స్ ఇలా ఎన్నో రకాల మనుషుల జీవితాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఆ కాఫీ షాప్‌లో జరుగుతుంటాయి.

హత్యతో ఎలాంటి మలుపు

ఆ షాప్‌లో కిల్లర్‌ను కమెడియన్ అనుకుని డైరెక్టర్ పొరపాటు పడి నిర్మాతతో చెబుతాడు. దానికి అతను కమెడియన్‌కు బదులు కిల్లర్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని ట్రైలర్‌లో చెప్పడం బాగుంది. ఆ తర్వాత కిల్లర్ చేసే హత్యతో వాళ్ల జీవితాల్లో ఎలాంటి మలుపు తిరిగిందనేదే ఏ కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీ కథ. తెలుగులో కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. శుక్రవారం (జనవరి 31) నుంచి ఆహాలో కాఫీ విత్ ఏ కిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

కాఫీ విత్ ఏ కిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇక కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీకి అనుష్ గోరక్ డీఓపీ, ఎడిటర్, డిఐగా వ్యవహరించగా తిరుమల డైలాగులు రాశారు. నిన్నటి నుంచి ఆహాలో కాఫీ విత్ ఏ కిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మీడియా సమావేశం చేశారు.

మంచి కాఫీ తాగే ఫీల్

ఈ సందర్భంగా నటుడు అంబటి శ్రీను మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మంచి కాఫీ తాగే ఫీల్ కలిగిస్తుంది. ఈ చిత్రంలో నాకు మంచి పాత్రను ఇచ్చిన ఆర్‌పీ పట్నాయక్ గారికి నా కృతజ్ఞతలు. ఆయన అంటే నాకు ఎంతో అభిమానం. నేను ఆయన పాటలకు వీరాభిమానిని” అని తెలిపారు.

యూత్‌ఫుల్ లవ్ స్టోరీ

“ఆర్‌పీ పట్నాయక్ గారి అభిమానులు ఆయన నుంచి ఒక యూత్‌ఫుల్ లవ్ స్టోరీ రావాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం నిర్మాత సతీష్ గారికి, గౌతం పట్నాయక్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎవరికీ కూడా ఈ చిత్ర కథ ఏంటీ అనేది తెలీదు. కాబట్టి చిత్రాన్ని అందరూ తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి” అని నటుడు అంబటి శ్రీను చెప్పుకొచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024