




Best Web Hosting Provider In India 2024

OTT: ఓటీటీ రిలీజ్ రోజునే ట్రెండింగ్‌లోకి వచ్చిన ప్లాప్ మూవీ- కానీ, 9 నుంచి పడిపోయిన రేటింగ్- ట్విస్టులు మాత్రం సూపర్!
OTT Trending Movie: ఓటీటీలో రిలీజ్ అయిన రోజునే ట్రెండింగ్‌లోకి వచ్చింది ఓ ప్లాప్ మూవీ. అయితే, బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ కలెక్షన్స్‌తో ప్లాప్‌గా నిలిచిన ఈ సినిమా ప్రశంసలు మాత్రం అందుకుంది. కానీ, 9 ఉన్న ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ ఒక్కసారిగా విధంగా పడిపోయింది. ట్విస్టులతో అదిరిపోయే ఓటీటీ మూవీ చూద్దాం.
OTT Trending Movie: ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులు అభిరుచులు మారిపోయాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాకుండా కథ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే, థ్రిల్లింగ్ సీన్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలుస్తున్నాయి.

టాప్ 1 ట్రెండింగ్‌లోకి
కానీ, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. రెగ్యులర్ ఆడియెన్స్ మెచ్చకపోయినప్పటికీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవారికి ఇలాంటి సినిమాలు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అలాంటి ఓ ప్లాప్ మూవీనే తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అంతేకాకుండా ఓటీటీ రిలీజ్ రోజునే టాప్ 1 ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
ఇండియా టాప్ 10లో వన్‌గా
ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇండియాలోని టాప్ 10 సినిమాల్లో నెంబర్ వన్ స్థానంలో ప్లేస్ సంపాదించుకుంది. థియేటర్లలో మెచ్చని ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం రెస్పాన్స్ అదిరిపోతుంది. అంతేకాకుండా ఊహించని ట్విస్టులు, మలుపులతో అదిరిపోయే ఈ సినిమాకు రేటింగ్ ఒక్కసారిగా పడిపోవడం మరోక ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
పడిపోయిన ఐఎండీబీ రేటింగ్
థియేటర్ రిలీజ్‌కు అనంతరం ఆ సినిమాకు ఐఎండీబీ నుంచి 9 రేటింగ్ వచ్చింది. ఓటీటీ రిలీజ్ డే వరకు కూడా 9 ఐఎండీబీ రేటింగ్‌తో సత్తా చాటింది ఆ ప్లాప్ మూవీ. కానీ, ఓటీటీ రిలీజ్ అనంతరం ట్రెండింగ్‌లోకి వచ్చిన ఆ సినిమా రేటింగ్ కూడా పడిపోయింది. 9 ఐఎండీబీ రేటింగ్ నుంచి 8.6 వరకు తగ్గిపోయింది.
త్రిష ఐడెంటిటీ సినిమా
అంటే, ఓటీటీ ఆడియెన్స్ సినిమాను చూసిన తర్వాత వారు ఇచ్చిన రేటింగ్ తగ్గినట్లుగా తెలుస్తోంది. కానీ, మర్డర్ మిస్టరీ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ మలయాళ సినిమా సూపర్ ట్విస్టులు, థ్రిల్లింగ్స్ సీన్స్, స్టైలిష్ యాక్షన్‌తో ఎంతో బాగా ఆకట్టుకుంటుంది. ఆ సినిమా మరేదో కాదు త్రిష నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ.
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
త్రిష, టొవినో థామస్, వినయ్ రాయ్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మర్డర్ మిస్టరీ అండ్ యాక్షన్ ఫిల్మ్ ఐడెంటిటీ జీ5 ఓటీటీలో రిలీజ్ అయింది. జనవరి 31 నుంచి తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఐడెంటిటీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మర్డర్, ముగ్గురు డిఫరెంట్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు, ఒకరిపై మరొకరికి అనుమానం వచ్చేలా ఇన్వెస్టిగేషన్, ఆ మర్డర్‌కు ఉన్న లింక్స్ వంటి ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది.
62 శాతం మందికి
అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఐడెంటిటీ సినిమాను 62 శాతం గూగుల్ యూజర్స్ లైక్ చేశారు. మరి అడుగడుగునా వచ్చే ట్విస్టులు, థ్రిల్లింగ్ సీన్స్‌తో కట్టిపడేసే ఐడెంటిటీ మూవీని జీ5 ఓటీటీలో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
సంబంధిత కథనం