TG Govt Subsidy Loans : 100 శాతం సబ్సిడీ రుణాలు – కేవలం వారికి మాత్రమే…! దరఖాస్తు విధానం ఇలా

Best Web Hosting Provider In India 2024

TG Govt Subsidy Loans : 100 శాతం సబ్సిడీ రుణాలు – కేవలం వారికి మాత్రమే…! దరఖాస్తు విధానం ఇలా

Maheshwaram Mahendra HT Telugu Feb 02, 2025 08:10 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 02, 2025 08:10 AM IST

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఉపాధి సబ్సిడీ రుణాలను అందించనుంది. ఎంపికైన వారికి వంద శాతం సబ్సిడీ వస్తుంది. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం ఫిబ్రవరి 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు
దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వయం ఉపాధి కోసం ప్రవేశ పెట్టిన సబ్సిడీ రుణాల నిధులను మంజూరు చేసింది. అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేసి వందశాతం సబ్సిడీతో ఈ రుణాలను అందించనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ అర్హులను గుర్తించనున్నారు.

yearly horoscope entry point

ఈ రుణాల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హులైన వారు ఈలోపే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హతలు – రుణం వివరాలు:

  • దరఖాస్తుదారుడు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
  • 40 శాతానికి పైగా డిజబులిటీ ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఉండాలి.
  • వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2.5 లక్షలుగా, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్ష ఆదాయం ఉన్నవారే ఈ రుణాలకు అర్హులు అవుతారు.
  • ఎంపికైనా వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రుణం ఇస్తారు.
  • వంద శాతం సబ్సిడీ ఉంటుంది. ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.

దరఖాస్తు విధానం ఎలా..?

  1. ఈ రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని కనిపించే Aids & Appliances Registered Beneficiary (Disabled Welfare) లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ కొత్త విండ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ వివరాలను నమోదు చేయాలి.
  4. చివరల్లో Self Confirmation ఇచ్చి సబ్మిట్ చేస్తే ప్రాసెస్ పూర్తి అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

కావాల్సిన పత్రాలు:

  • రేషన్ కార్డు
  • సదరం సర్టిఫికెట్ (handicapped certificate)
  • ఫొటో
  • ఆదాయపు , కుల ధ్రవీకరణపత్రాలు
  • బ్యాంక్ వివరాలు
  • స్టడీ సర్టిఫికెట్లు

ఎంపిక ఎలా…?

ఆన్ లైన్ ద్వారా స్వీకరించే దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ తర్వాత మండల స్థాయిలో ఎంపీడీవోలు చెక్ చేస్తారు. 1:3 నిష్పత్తిలో దరఖాస్తులను ఎంపిక చేసి జిల్లా అధికారులకు జాబితా పంపుతారు. అడిషనల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఫైనల్ లిస్ట్ ను రూపొందిస్తారు. ఈ జాబితానే ఆన్ లైన్ లో ఉంచుతారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Cm Revanth ReddyTelangana NewsGovernment Of TelanganaPersonal Loan Tips
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024