Stuffed Paratha Tips: స్టఫ్డ్ పరోటాలు ఫర్ఫెక్ట్‌గా, రుచిగా రావాలంటే ఈ చిట్కాలను పాటించండి!

Best Web Hosting Provider In India 2024

Stuffed Paratha Tips: స్టఫ్డ్ పరోటాలు ఫర్ఫెక్ట్‌గా, రుచిగా రావాలంటే ఈ చిట్కాలను పాటించండి!

Ramya Sri Marka HT Telugu
Feb 02, 2025 01:00 PM IST

Stuffed Paratha Tips: స్టఫ్డ్ పరోటాలంటే చాలా మందికి ఇష్టం. కానీ వీటిని తయారు చేయడం కొంతమంది మహిళలకు చాలా కష్టం. వాటిని రోల్ చేసేటప్పు అవి విరిగిపోతాయని చాలా మంది ఫిర్యాదు చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే ఈ సారి స్టఫ్డ్ పరోటాలు ఫర్ఫెక్ట్‌గా, రుచిగా రావాలంటే ఈ చిట్కాలను పాటించండి!

స్టఫ్డ్ పరోటాలు ఫర్ఫెక్ట్‌గా, రుచిగా రావాలంటే ఈ చిట్కాలను పాటించండి!
స్టఫ్డ్ పరోటాలు ఫర్ఫెక్ట్‌గా, రుచిగా రావాలంటే ఈ చిట్కాలను పాటించండి!

ఎప్పుడూ సాదా పరోటాలు తినడం ఇష్టం లేని వారు స్టఫ్డ్ పరోటాలు తయారు చేసుకుని తినాలనుకుంటారు. ఇవి చాలా మందికి ఇష్టం కూడా. కానీ స్టఫ్డ్ పరోటాలు తయారు చేయడంలో కొంతమంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా స్టఫింగ్ చేసిన పరోటాలను చేసేటప్పుడు అవి విరిగిపోయి స్టఫ్ అంతా బయటకు వచ్చేందని చెబుతుంటారు. మీకు కూడా సరిగ్గా ఇదే సమస్య ఎదురువుతుందా. అయితే ఈ టిప్స్ మీ కోసమే. స్టఫ్డ్ పరోటాలను తయారు చేసేటప్పుడు ఈ చిట్కాలను పాటించారంటే మీ పరోటాలు పర్ఫెక్ట్ గా, రుచిగా తయారవుతాయి. ఆ చిట్కాలేంటో చూసేద్దాం రండి.

yearly horoscope entry point

స్టఫ్డ్ పరోటాలు ఫర్ఫెక్ట్‌గా, రుచిగా రావాడానికి చిట్కాలు:

పిండి కలిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • స్టఫ్డ్ పరోటాలు చేస్తున్నప్పడు చాలా మంది చేసే పొరపాటు పిండిని సరిగ్గా కలపకపోవడమే. పిండిని సరిగ్గా కలిపారంటే మీ స్టఫ్డ్ పరోటా ఎప్పుడూ పగిలిపోదు, దాంట్లో నుంచి స్టఫ్ బయటకు రాదు.
  • ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పిండిని కలిపే సమయంలో అందులో ఒక టీస్పూన్ శనగపిండి, ఒక టీస్పూన్ నెయ్యి వేసి బాలా కలపాలి.
  • ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పిండిని కలుపుతూ పిసుక్కోవాలి. పిండి మృదువుగా ఉంటే పరోటాలు పర్ఫెక్ట్ గా వస్తాయి. అలా అని బాగా వదులుగా కూడా చేయద్దని గుర్తుంచుకోండి.

పిండి కలిపిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • కొంతమంది పిండి పిండిని పిసికిన వెంటనే పరోటా తయారు చేయడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం కూడా పరోటాలు సరిగ్గా రాకపోవడానికి కారణం అవుతుంది. దీని వల్ల పరోటా కచ్చితంగా విరిగిపోతుంది.
  • పిండిని కలిపిన తర్వాత కనీసం 10 నుంచి 15 నిమిషాలైన మూత పెట్టి ఉంచిన తర్వాతే పరాటాలో చేయాలి.
  • ఇది పరోటాల పిండిలో గ్లూటెన్ను సెట్ చేస్తుంది, మృదువుగా, రుచికరంగా తయారేందుకు సహాయపడుతుంది.

పరోటాల్లోకి స్టఫ్ తయారు చేసే సమయంలో పాటించాల్సిన చిట్కాలు:

  • పరోటాల్లో ఫిల్లింగ్ కోసం స్టఫ్ తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే స్టఫింగ్ సరిగ్గా లేకపోతే కూడా పరోటాలు పగిలిపోయే అవకాశాలున్నాయి.
  • స్టషింగ్ కోసం తీసుకున్న కూరగాయల నుండి అదనపు నీటిని తొలగించండి. ఉడకబెట్టిన బంగాళాదుంపల నుండి తేమను తగ్గించడానికి, వాటిని ఫ్రిజ్లో ఉంచండి.
  • అదే సమయంలో క్యాబేజీ, ముల్లంగి, మెంతులు వంటి కూరగాయలను కూడా వాటిలో నీరు లేకుండా ఉండేందుకు పిండడం, లేదా వేయించడం వంటివి చేయండి.
  • ఫిల్లింగ్ తక్కువగా ఉంటే పరోటాలో రుచిగా ఉండవు. అదే సమయంలో స్టఫ్ అధికంగా నింపడం వల్ల కూడా పరోటాలు సరిగ్గా రావు. పరోటాలు ఫర్ఫెక్ట్‌గా, రుచిగా రావాలంటే దాంట్లో నింపే స్టఫ్ మొత్తాన్ని కూడా గుర్తుంచుకోండి.

స్టఫ్డ్ పరోటాలు తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • సాధారణ పరాఠాలతో పోలిస్తే డబుల్ లేయర్డ్ పరాఠా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చేసినా రెండు లేయర్ల పరోటాలు తయారు చేయండి.
  • ముందుగా రోటీని చుట్టి స్టఫింగ్‌ను సగానికి వేయండి, ఆ తర్వాత రోటీని మధ్య నుంచి మడతపెట్టాలి. మళ్ళీ రోటీని మరో సగానికి స్టఫింగ్ చేసి మడతపెట్టండి. పరోటాలకు త్రిభుజాకార ఆకృతిని ఇవ్వండి. ఇప్పుడు పరోటాను చుట్టి పీట మీద వేసి తాల్చండి. తరువాత కాల్చండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024