ఎన్నికల వేళ కూటమి నేతల అరాచకం.. 

Best Web Hosting Provider In India 2024

తిరుప‌తిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లను నిర్భందించిన కూటమి నేతలు

అన్నమయ్య జిల్లాలో టీడీపీ మూకలు జెడ్పీటీసీ ఇంటిపై దాడి

తిరుపతి: తిరుపతిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరులో భాస్కర హోటల్‌లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు నిర్బంధించారు. హోటల్ బయట కార్లు అడ్డంగా పెట్టి బయటకు వెళ్లకుండా ప్లాన్‌ చేశారు.

తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు రాకుండా కూటమి నేతలు హోటల్‌లో నిర్బంధించారు. కార్పొరేటర్లు బయటకు రాకుండా కూటమి నేతలు కార్లను అడ్డంగా పెట్టారు. రౌడీయిజం చేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లను విడిపించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని కూడా కూటమి నేతలు నిర్బంధించారు.

హోటల్‌ వద్దకు అభినయ్‌ రెడ్డి వెళ్లడంతో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్, టీడీపీకి సంబంధించి జేబీ శ్రీనివాసులు, మాజీ టౌన్ చైర్మన్ పులిగోరు మురళీ, క్రిష్ణా యాదవ్ తదితరులు రౌడీలతో ముట్టడించారు. అనంతరం, పోలీసులు అక్కడికి రావడంతో కూటమి వెనక్కి తగ్గారు. దీంతో, భాస్కర హోటల్ నుంచి తిరుపతికు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, నాయకులు బయలుదేరారు.

వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లను నిర్భందించిన కూటమి నేతలు

ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైయ‌స్ఆర్‌సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్‌ బలమే ఉన్న టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 
జెడ్పీటీసీ ఇంటిపై టీడీపీ మూకలు దాడి 

 అన్నమయ్య జిల్లాలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వైయ‌స్ఆర్‌సీపీ జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై టీడీపీ మూకలు కత్తులతో దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి సామాగ్రిని ధ్వంసం చేశారు. గర్భవతి అని కూడా చూడకుండా జెడ్పీటీసీ రమాదేవి కోడలిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంట్లో ఆవరణలో ఉన్న బైక్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమ ఇంటిపై దాడి చేయించాడని ఆరోపించారు. దాడి జరగక ముందే జెడ్పీటీసీ భర్తను చంపేస్తామని మంత్రి ఫోన్ చేసి బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. టీడీపీ మూకలు మంకీ క్యాప్‌లు ధరించి కత్తులతో ఇంటిపై దాడికి తెగబడినట్లు తెలిపారు. దీంతో, అర్ధరాత్రి గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. 

Best Web Hosting Provider In India 2024