Garlic Pulusu: ఇంట్లో కూరగాయలు లేకపోతే వెల్లుల్లి పులుసును ఇలా చేసేయండి, ఎంతో రుచి ఎంతో ఆరోగ్యం

Best Web Hosting Provider In India 2024

Garlic Pulusu: ఇంట్లో కూరగాయలు లేకపోతే వెల్లుల్లి పులుసును ఇలా చేసేయండి, ఎంతో రుచి ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
Feb 03, 2025 11:33 AM IST

Garlic Pulusu: వెల్లుల్లి పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వెల్లుల్లి పులుసు ఒకసారి ప్రయత్నించండి. ఇది అన్నంతోనూ, ఇడ్లీతోనూ అదిరిపోతుంది.

వెల్లుల్లి పులుసు
వెల్లుల్లి పులుసు (Mana Chef/Youtube)

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిని ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాల వారిని పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. మేము ఇక్కడ వెల్లుల్లి పులుసు ఇచ్చాము. గుప్పెడు వెల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి పులుసును టేస్టీగా వండుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా నోరు చప్పగా అనిపించినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ వెల్లుల్లి పులుసును తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది నాలుకకు మంచి రుచిని అందిస్తుంది. ఒకసారి దీన్ని చేసుకొని చూడండి. వేడివేడి అన్నంలో ఇది అద్భుతంగా ఉంటుంది. దోశతో, ఇడ్లీతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఇక వెల్లుల్లి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

yearly horoscope entry point

వెల్లుల్లి పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు

వెల్లుల్లి రెబ్బలు – 20

నూనె – రెండు స్పూన్లు

ఆవాలు – ఒక స్పూను

పచ్చిశనగపప్పు – అర స్పూను

మినప్పప్పు – అర స్పూను

జీలకర్ర – అర స్పూను

కరివేపాకులు – గుప్పెడు

పసుపు – పావు స్పూను

ఉల్లిపాయ – ఒకటి

టమోటో – ఒకటి

మెంతులు – చిటికెడు

చింతపండు పులుసు – పావు కప్పు

కారం – అర స్పూను

పచ్చిమిర్చి – రెండు

ధనియాల పొడి – ఒక స్పూను

నీళ్లు – ఒక గ్లాసు

కొత్తిమీర తరుగు – ఒక స్పూను

ఉప్పు – రుచికి సరిపడా

వెల్లుల్లి పులుసు రెసిపీ

1. వెల్లుల్లి పులుసు చేసేందుకు ముందు వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

4. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసి బాగా వేయించాలి.

5. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకులు గుప్పెడు వేసి వేయించాలి.

6. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఇది రంగు మారు వరకు వేయించాలి.

7. తర్వాత టమోటా తరుగును వేసి, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా మగ్గించాలి.

8. టమోటాలు మెత్తగా మగ్గాక కరివేపాకులను వేయాలి.

9. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

11. గ్లాసు నీళ్లు వేసి పైన మూత పెట్టి ఇది పులుసులా అయ్యే వరకు ముగించుకోవాలి.

12. ఆ తర్వాత పైన కొత్తిమీర తరుగున చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.

13. అంతే టేస్టీ వెల్లుల్లి పులుసు రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తిని చూడండి. అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ప్రతిరోజూ వెల్లుల్లి రెబ్బలు తినాల్సిన అవసరం ఉంది. వెల్లుల్లిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. గుండెను, రక్తనాళాలను కాపాడడంలో వెల్లుల్లిలోని శోధి నిరోధక లక్షణాలు ముందుంటాయి. కాబట్టి వెల్లుల్లి తరచుగా తినేందుకు ప్రయత్నించాలి. ప్రతిరోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే మన శరీరానికి కావాల్సిన తర్వాత నిరోధక శక్తి అందుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా వెల్లుల్లి పులుసును చేసుకొని తినడం వల్ల కూడా ఎన్నో పోషకాలు అందుతాయి. పైగా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఈ పులుసును ప్రయత్నించండి. లేదా జ్వరంగా ఉన్నప్పుడు నోరు చప్పగానే పెంచినప్పుడు కూడా ఈ వెల్లుల్లి పులుసు టేస్టీగా అనిపిస్తుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024