Tuk Tuk: స్కూటర్ కమ్ మ్యాజికల్ పవర్స్ ఆటో.. వెహికల్‌తో ప్రేమలో పడతారు.. డైరెక్టర్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Tuk Tuk: స్కూటర్ కమ్ మ్యాజికల్ పవర్స్ ఆటో.. వెహికల్‌తో ప్రేమలో పడతారు.. డైరెక్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Feb 27, 2025 09:48 AM IST

Director Supreeth Krishna About Tuk Tuk Vehicle And Movie: తెలుగులో వస్తోన్న సరికొత్త సినిమా టుక్ టుక్. మార్చి 21న విడుదల కానున్న టుక్ టుక్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సుప్రీత్ కృష్ణ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

స్కూటర్ కమ్ మ్యాజికల్ పవర్స్ ఆటో.. వెహికల్‌తో ప్రేమలో పడతారు.. డైరెక్టర్ కామెంట్స్
స్కూటర్ కమ్ మ్యాజికల్ పవర్స్ ఆటో.. వెహికల్‌తో ప్రేమలో పడతారు.. డైరెక్టర్ కామెంట్స్

Director Supreeth Krishna About Tuk Tuk Movie: వైవిధ్యమైన సినిమాలకు, న్యూ కాన్సెప్ట్‌లకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రాలకు తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి చిత్రాలను చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అఖండ విజయాన్ని అందిస్తుంటారు మన తెలుగు ప్రేక్షకులు.

వైవిధ్యమైన కాన్సెప్ట్

ఇప్పుడు ఈ కోవలోనే ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్‌ టుక్‌’. ఈ సినిమాలో హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా నటిస్తున్నారు. టుక్ టుక్ సినిమాకు సి. సుప్రీత్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. అలాగే, చిత్రవాహిని, ఆర్‌వైజీ సినిమాస్‌ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు టుక్ టుక్ సినిమాను నిర్మిస్తున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ టుక్ టుక్ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. అయితే, టుక్ టుక్ మూవీని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్‌. దీనికి సంబంధించిన టుక్ టుక్ రిలీజ్ పోస్టర్‌ను ఫిబ్రవరి 26న మహా శివరాత్రి కానుకగా విడుదల చేశారు మేకర్స్‌. అధికారికంగా విడుదల తేదిని ప్రకటించారు.

మంచి రహస్యం కూడా ఉంటుంది

ఈ సందర్భంగా దర్శకుడు సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ.. ”న్యూ ఏజ్‌ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే స్కూటర్‌ కమ్‌ ఆటో ఎన్నో మ్యాజికల్‌ పవర్స్‌ను కలిగి ఉంటుంది. అందరూ ఆ వెహికల్‌తో ప్రేమలో పడిపోతారు. దానికి ఓ మంచి రహస్యం కూడా ఉంటుంది” అని అన్నారు.

ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే భావోద్వేగాలు

”టుక్ టుక్ సినిమా ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా పంచుతుంది. యువతరానికి నచ్చే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే భావోద్వేగాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే విశ్వాసం ఉంది” అని టుక్ టుక్ డైరెక్టర్ సుప్రీత్ కృష్ణ తెలిపారు.

ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతి

అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ.. ”సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన టుక్ టుక్ ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంటుంది. అసలు కథలో ఆ స్కూటర్‌ కమ్‌ ఆటో పాత్ర ఏంటి అనేది సినిమాలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో కొనసాగుతుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుంది. ఈ వేసవికి ప్రేక్షకులకు మంచి వినోదం అందించండానికి మార్చి 21న మా టుక్‌ టుక్‌ రెడీ అవుతోంది” అని పేర్కొన్నారు.

సంతు ఓంకార్ సంగీతం

ఇదిలా ఉంటే, టుక్ టుక్ సినిమాకు సంతు ఓంకార్ సంగీతం అందించారు. అలాగే, ఈ చిత్రానికి హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతలా ఆదరిస్తుందో వేచి చూడాలి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024