Special Trains: విజయవాడ మీదుగా చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-నర్సాపూర్‌ వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌

Best Web Hosting Provider In India 2024

Special Trains: విజయవాడ మీదుగా చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-నర్సాపూర్‌ వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌

HT Telugu Desk HT Telugu Feb 27, 2025 11:14 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Feb 27, 2025 11:14 AM IST

Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వీకెండ్‌లో ప్రయాణికుల రద్దీని నివారించడానికి దక్షిణ మధ్య రైల్వే నాలుగు స్పెష‌ల్ వీక్లీ రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడ మీదుగా చర్లపల్లి నుంచి కాకినాడ, చర్లపల్లి- నర్సాపూర్‌ మధ్య ఇవి నడుస్తాయి.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లు (twitter)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Special Trains: ప్ర‌యాణికులు ర‌ద్దీని త‌గ్గించేందుకు విజ‌య‌వాడ మీదుగా చ‌ర్ల‌పల్లి-కాకినాడ టౌన్, చ‌ర్ల‌ప‌ల్లి-న‌ర్సాపూర్ మ‌ధ్య రెండు స్పెష‌ల్ వీక్లీ రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

చ‌ర్ల‌ప‌ల్లి నుంచి కాకినాడ‌ స్పెష‌ల్ రైళ్లు

1. చ‌ర్ల‌ప‌ల్లి-కాకినాడ (07031) స్పెష‌ల్ వీక్లీ రైలు ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో (శుక్రవారం) అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో రాత్రి 7.20 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లిలో బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.

2. కాకినాడ టౌన్‌-చ‌ర్ల‌ప‌ల్లి (07032) స్పెష‌ల్ వీక్లీ రైలు మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో (ఆదివారం) అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో సాయంత్రం 6.55 గంట‌ల‌కు కాకినాడ టౌన్‌లో బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు ఉద‌యం 6.50 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లికి చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి-కాకినాడ టౌన్ మ‌ధ్య న‌ల్లొండ‌, మిర్యాల‌గూడ‌, స‌త్తెన‌ప‌ల్లి, గుంటూరు, విజ‌య‌వాడ‌, ఏలూరు, తాడేప‌ల్లి గూడెం, రాజ‌మండ్రి, సామర్ల‌కోట స్టేష‌న్ల‌ల‌లో ఆగుతాయి.

చ‌ర్ల‌ప‌ల్లి నుంచి న‌ర్సాపూర్‌ స్పెష‌ల్ రైళ్లు

3. చ‌ర్ల‌ప‌ల్లి-న‌ర్సాపూర్ (07233) స్పెష‌ల్ వీక్లీ రైలు ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో (శుక్రవారం) అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో రాత్రి 8.15 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లిలో బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు ఉద‌యం 5.50 గంట‌ల‌కు న‌ర్సాపూర్‌కి చేరుకుంటుంది.

4. న‌ర్సాపూర్‌-చ‌ర్ల‌పల్లి (07234) స్పెష‌ల్ వీక్లీ రైలు మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో (ఆదివారం) అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో రాత్రి 8 గంట‌ల‌కు న‌ర్సాపూర్‌లో బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లి చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి-న‌ర్సాపూర్ మ‌ధ్య న‌ల్లొండ‌, మిర్యాల‌గూడ‌, న‌డికుడి, పిడుగురాళ్ల‌, స‌త్తెన‌ప‌ల్లి, గుంటూరు, విజ‌య‌వాడ‌, గుడివాడ‌, కైక‌లూరు, ఆకివీడు, భీమ‌వ‌రం టౌన్‌, వీర‌వాస‌రం, పాల‌కొల్లు స్టేష‌న్ల‌ల‌లో ఆగుతాయి.

వేసవికి ఆరు స్పెష‌ల్ రైళ్లు ప్రత్యేక రైళ్లు

ప్ర‌యాణీకుల‌కు రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణీకుల అదనపు రద్దీని తగ్గించడానికి తూర్పు కోస్ట్ రైల్వే ఆరు వేస‌వి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వేస‌వి స్పెష‌ల్ రైళ్లు

1. రైలు నెంబ‌ర్ 08311 సంబల్పూర్ – ఈరోడ్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు న‌డ‌పనున్నారు. ఈ రైలు బుధవారాల్లో ఉదయం 11:35 గంటలకు సంబల్పూర్ నుండి బయలుదేరి, అదే రోజు రాత్రి 11:30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్క‌డి నుంచి రాత్రి 11.32 గంటలకు బయలుదేరి, గురువారం రాత్రి 8:30 గంటలకు ఈరోడ్ చేరుకుంటుంది. మొత్తం 8 ట్రిప్పులు ప్ర‌యాణిస్తుంది.

2. రైలు నెంబ‌ర్ 08312 ఈరోడ్ – సంబల్పూర్ వీక్లీ స్పెషల్ రైలు మార్చి 14 నుంచి మే 2 వ‌ర‌కు న‌డ‌పనున్నారు. ఈ రైలు ప్ర‌తి శుక్ర‌వారాల్లో మధ్యాహ్నం 2:45 గంటలకు ఈరోడ్ నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 2:08 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డి నుంచి 1:10 గంటలకు బయలుదేరి, శనివారం రాత్రి 11:15 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. మొత్తం 8 ట్రిప్పులు ప్ర‌యాణిస్తుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు ఈరోడ్ – సంబల్పూర్ మ‌ధ్య‌ పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం జంక్షన్, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట‌, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతుంది. ఈ రెండు రైళ్లలో సెకండ్ ఏసీ-1, థ‌ర్డ్‌ ఏసీ-3, స్లీపర్ క్లాస్-09, జనరల్ సెకండ్ క్లాస్-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్‌లు-2 అందుబాటులో ఉంటాయి.

3. రైలు నెంబ‌ర్ 02811 భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు మార్చి 1 నుంచి ఏప్రిల్ 26 వ‌ర‌కు న‌డ‌ప‌నున్నారు. ఈ రైలు ప్ర‌తి శనివారాల్లో సాయంత్రం 7:15 గంటలకు భువనేశ్వర్ నుండి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 1:53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్క‌డ నుంచి తెల్ల‌వారుజామున 1:55 గంటలకు బయలుదేరి, అర్థ‌రాత్రి 12.15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. మొత్తం 9 ట్రిప్పులు ప్ర‌యాణిస్తుంది.

4. రైలు నెంబర్ 02812 యశ్వంత్‌పూర్-భువనేశ్వర్ ప్రత్యేక రైలు మార్చి 3 నుంచి ఏప్రిల్ 28 వ‌ర‌కు న‌డ‌ప‌నున్నారు. ఈ రైలు ప్ర‌తి సోమవారాల్లో తెల్లవారుజామున 4:30 గంటలకు యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్ల‌వారుజామున‌ 4:30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్క‌డి నుంచి తెల్ల‌వారుజామున 4:32 గంటలకు బ‌య‌లుదేరుతుంది. మ‌ధ్యాహ్నం 12.15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. మొత్తం 9 ట్రిప్పులు ప్ర‌యాణిస్తుంది.

ఈ రెండు రైళ్లు పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, థోన్‌, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతుంది. ఈ రెండు రైళ్లు థ‌ర్డ్‌ ఏసీ -16, జనరేటర్ మోటార్ కార్లు-2 కోచ్‌లు ఉంటాయి.

5. రైలు నెంబ‌ర్ 08508 విశాఖపట్నం- షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును మార్చి 11 నుంచి ఏప్రిల్ 29 వ‌ర‌కు న‌డ‌ప‌నున్నారు. ఈ రైలు మంగళవారాల్లో ఉద‌యం 11:20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి సింహాచలంకు ఉద‌యం 11:36 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డి నుంచి ఉద‌యం 11:38 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం మ‌ధ్యాహ్నం 12:08 గంటలకు చేరుకుని, అక్క‌డి నుంచి మ‌ధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరుతుంది. చీపురుపల్లి మ‌ధ్యాహ్నం 12:35 గంటలకు చేరుకుని, అక్క‌డి నుంచి మ‌ధ్యాహ్నం 12:37 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్ మ‌ధ్యాహ్నం 1:08 గంటలకు చేరుకుని, అక్క‌డి నుంచి మ‌ధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉద‌యం 3:00 గంటలకు (బుధవారాలు) షాలిమార్ చేరుకుంటుంది. మొత్తం 8 ట్రిప్పులు ప్ర‌యాణిస్తుంది.

6. రైలు నెంబ‌ర్ 08507 షాలిమార్ – విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు న‌డ‌ప‌నున్నారు. ఈ రైలు బుధ‌వారాల్లో ఉద‌యం 5 గంటలకు షాలిమార్ నుండి బయలుదేరుతుంది. సాయంత్రం 6:10 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుని, అక్క‌డి నుంచి సాయంత్రం 6:12 గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 6:38 గంటలకు చీపురుపల్లికి చేరుకుని, అక్క‌డి నుంచి సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం రాత్రి 7:03 గంటలకు చేరుకుని, అక్క‌డి నుంచి రాత్రి 7:05 గంటలకు బయలుదేరుతుంది. సింహాచ‌లం రాత్రి 7:35 గంట‌ల‌కు చేరుకుని, అక్క‌డి నుంచి రాత్రి 7:37 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 8:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మొత్తం 8 ట్రిప్పులు ప్ర‌యాణిస్తుంది.

ఈ రైండు రైళ్లు విశాఖ‌ప‌ట్నం-షాలిమార్ మ‌ధ్య సింహాచలం, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస త‌దిత‌ర రైల్వే స్టేష‌న్ల‌లో న‌డుస్తాయి. ఈ ప్రత్యేక రైలులో సెకండ్ ఏసీ-1, థ‌ర్డ్ ఏసీ -3, స్లీపర్ క్లాస్‌-9, జనరల్ సెకండ్ క్లాస్ -4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్‌లు-1, మోటార్ కార్-1 ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

South Central RailwaySpecial TrainsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024