రాప్తాడు నియోజకవర్గంలో 50 వేల ఓట్ల తొలగింపునకు పరిటాల సునీత కుట్ర..!

Best Web Hosting Provider In India 2024

అనంత‌పురం:  రాప్తాడు నియోజకవర్గంలో 50 వేల ఓట్ల తొలగింపునకు టీడీపీ నాయ‌కురాలు పరిటాల సునీత కుట్ర ప‌న్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి ఆమె ఈరోజు బిఎల్‌ఒలను బెదిరించుకుంటూ, వారిపై ఒత్తిడి తెస్తూ 27 వేల దరఖాస్తులను తొలగించేందుకు బిఎల్‌ఓల నుంచి స్క్రూటినీ లేకుండా ఎన్నికల అధికారులకు పంపారు. ఇంకా 23 దరఖాస్తులు సిద్దంగా ఉన్నాయని ఆమె ప్రకటన చేసింది. అంటే ఈ నియోజకవర్గంలో మొత్తం 50 వేల ఓట్లను తొలగించాలని పరిటాల సునీత కుట్ర పన్నుతోంది. దీనిపై కలెక్టర్‌ దృష్టికి, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బోయ గిరిజమ్మతో కలిసి కనగానపల్లి మండలం భానుకోట సమీపంలోని పంపనూరు తండా వద్ద 110.55 కోట్లు వ్యయంతో నిర్మించిన  220/132 కె.వి. విద్యుత్‌ ఉప కేంద్రం మరియు సంబంధిత లైన్‌లను ప్రారంభించారు.

ఈ సందర్భందగా ఎమ్మెల్యే   మాట్లాడేతూ… మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన పరిటాల సునీత దొంగ ఓట్ల గురించి మాట్లాడుతుండడం చూస్తుంటే దొంగలే…దొంగ దొంగ అన్న చందంగా ఉంది.

రిగ్గింగ్‌ చేసిన చరిత్ర పరిటాల రవీది…దొంగ ఓట్లు ఎక్కించుకుని గెలిచిన చరిత్ర పరిటాల సునీతది. 2009 ఎన్నికల్లో ఆమె 1700 ఓట్ల మెజార్టీతో రాప్తాడులో నాపై గెలిచింది. దాదాపు 2 వేల ఓట్లు పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రం పావగడకు చెందిన దొంగ ఓట్లు ఎక్కించుకుని గెలిచింది.

దీనిపై పారదర్శకంగా విచారణ జరగాలి. 27 వేలమంది ఓటర్లు తమంతకు తామే రాప్తాడు నియోజకవర్గంలో ఉండమని తమ ఓట్లు తొలగించమని అడిగారా?. ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతాందా?.

ఓటమి తర్వాత నాలుగేళ్లపాటు హైదరాబాద్‌లో దాక్కొని మాకు రాప్తాడు వద్దు ధర్మవరం కావాలి, పెనుకొండ కావాలని అడిగి అక్కడ వారు ఛీ కొడితే మళ్లీ ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో మీరు ఎక్కడికైనా తిరిగే స్వేచ్చను కల్పించాం. రక్షణ కల్పిస్తున్నాం. ఓటు అడగండి. మీరు ఏదైనా మంచి చేసి ఉంటే చెప్పుకోండి. రానున్న రోజుల్లో ఏదైనా చేస్తామంటే అది చెప్పండి. అంతేకాని ఓట్లు తొలిగించమని

రాప్తాడు నియోజకవర్గంలోని ఓటరు మహాశయులారా… తస్మాత్‌ జాగ్రత్త!. మీ ఓట్లను పరిటాల సునీత తొలిగిస్తాందో…లేదో ఒకసారి చెక్‌ చేసుకోండి. మీమీ సచివాలయాల్లో చెక్‌ చేసుకోండి. వలంటీర్ల ద్వారా చెక్‌ చేసుకోండి. బిఎల్‌ఎల ద్వారా చెక్‌ చేసుకోండి. మీపై పరిటాల సునీత ఎందుకు కక్ష కట్టిందో ఒకసారి ఆలోచించండి. జగనన్న సంక్షేమ  పథకాలు పొందుతున్న వారే. జగన్‌మోహన్‌రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్న వారు.

ఓట్ల తొలిగింపునకు రాప్తాడులో పరిటాల సునీత నాయకత్వంలో దొంగలు పడ్డారు. ఎన్నికల సంఘం అధికారులు వెంటనే అప్రపత్తం కావాలి. బిఎల్‌ఓల స్థాయిలో స్క్రూటినీ కావాల్సిన దరఖాస్తులు పై అధికారుల వద్దకు వెళ్తున్నాయంటూ క్షేత్రస్థాయిలో వారిపై ఎంత ఒత్తిడి ఉందో అధికారులు ఆలోచించాలి.

రాప్తాడు నియోజకవర్గంలోని బిఎల్‌ఓలతో రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలు సమావేశం ఏర్పాటు చేయండి. బిఎల్‌ఓలను ఎవరు బెదిరిస్తున్నారో విచారణ చేయండి. అర్హత ఉన్నవారు ఎవరైనా ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లు ఎక్కించుకోవచ్చు. ఈ విషయంలో అన్ని పార్టీల బీఎల్‌ఏలు చురుగ్గా పని చేస్తున్నారు. మేము వారందరికి స్వేచ్చ ఇస్తే…పరిటాల సునీత మాత్రం ఉన్న ఓట్లును తొలగింపునకు కుట్ర పడుతోంది. ఇంకోవైపు కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును హరించే ప్రయత్నం చేస్తోంది మీరుకాదా?. స్వేచ్చగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామని వారికి అర్థమైంది. గతంలో చేసిన రౌడీయిజం, గూండాయిజం చేయాలనుకుంటే పొరబాటే. మళ్లీ నేనే ఎమ్మెల్యే అవుతున్నా. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సీఎం అవుతారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లు,  మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *