మీ జీవితంలో ఒక్కసారయినా సందర్శించాల్సిన ప్రాంతాలు ఇవే, మన దేశంలోనే ఉన్నాయి

Best Web Hosting Provider In India 2024

మీ జీవితంలో ఒక్కసారయినా సందర్శించాల్సిన ప్రాంతాలు ఇవే, మన దేశంలోనే ఉన్నాయి

 

మనదేశంలో సందర్శించడానికి ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే మనం జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాల గురించి ఇక్కడ ఇచ్చాము.

 
ఇండియాలో చూడాల్సిన ప్రాంతాలు
ఇండియాలో చూడాల్సిన ప్రాంతాలు

 

మనదేశం ఎంతో అందమైనది. మీకు ప్రయాణాలు చేయడం ఇష్టమైతే విదేశాలు వెళ్లాల్సిన అవసరం లేదు. మనదేశంలోనే సందర్శించాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. జీవితంలో కనీసం ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశాలు గురించి ఇక్కడ ఇచ్చాము.

 

ఇవన్నీ కూడా మనదేశంలోనే ఉన్న అద్భుతమైన ప్రాంతాలు ఇవి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో గుర్తింపును కూడా పొందాయి. కాబట్టి మీరు వేసవి సెలవుల్లో వెళ్లాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన ప్రదేశాలలో ఏదో ఒకదానికి వెళ్ళండి. కచ్చితంగా మీరు రిఫ్రెష్ అయ్యి వస్తారు. ఉత్సాహంతో కొత్తదనంతో ఉరకలేస్తారు.

లెహ్

సాహస ప్రియులకు కచ్చితంగా నచ్చే ప్రాంతం లెహ్. ఇది లద్దాఖ్ లో ఉంది. ఇక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలు, ఎత్తైన ఎడారులు ఉంటాయి. అలాగే పాత బౌద్ధ ఆరామాలు కూడా కొలువుదీరి ఉంటాయి. బైకింగ్, ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి లెహ్ రోడ్లపై డ్రైవింగ్ చేయడం చాలా బాగుంటుంది. అలాగే అక్కడ ఉన్న కొండలపై ట్రెక్కింగ్ చేయడానికి కూడా చక్కగా ఉంటుంది. ఎప్పుడైనా వీలైతే వెళ్లి చూడండి.

హంపి

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలలో కర్ణాటకలోని హంపి నగరం కూడా ఒకటి. ఈ నగరాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. పురాతన దేవాలయాలు, స్మారక చిహ్నాలు ఎన్నో ఉంటాయి. అందంగా పారుతున్న నది, ఆ నదులపై తెలియాడుతున్న చిన్న పడవలు చూసేందుకు కంటికింపుగా ఉంటాయి. చుట్టూ ఆనాటి సాంస్కృతిక వైభవాన్ని చాటే ఆలయాలతో నిండి ఉంటాయి. ఒక్కసారి హంపి వెళ్లి చూడండి. మీరు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తులను మనసులో నింపుకొని వస్తారు.

 

డార్జిలింగ్

డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్ లో ఉంటుంది. డార్జిలింగ్ సందర్శించడం ఎంతో ముఖ్యం. అందులోనూ ప్రకృతిని ఇష్టపడేవారు డార్జిలింగ్ జీవితంలో ఒక్కసారి అయినా చూడాలి. ఇది ఒక అందమైన హిల్ స్టేషన్. దీనిలో టీ తోటలు అధికంగా ఉంటాయి. కాంచన్ జంగ్ అని పిలిచే పర్వత శ్రేణులు ప్రకృతి రమణీయంతో నిండిపోయి ఉంటాయి. అద్భుతమైన దృశ్యాలకు డార్జిలింగ్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవాలి. పచ్చని ప్రకృతి ఆ పక్కనే మంచు కొండలు చూసేందుకు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది.

సిమ్లా

హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది సిమ్లా. కొండలతో నిండిన సిమ్లాలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడ ప్రకృతి దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతారు. ఇక్కడ ఉండే మాల్ రోడ్డు, జఖు ఆలయం, మంచి పర్వతాలు, పొడవాటి దేవదారు చెట్లు ఎంత చూస్తున్నా తనివి తీరవు.

ఖజురహో

మధ్యప్రదేశ్‌లోని ఖజురహో గొప్ప సాంస్కృతిక వారసత్వానికి పునాది. ఇక్కడ ఉన్న అద్భుతమైన దేవాలయాలు, ఆ దేవాలయాలపై ఉన్న కుడ్య చిత్రాలు చూస్తున్న కొద్ది ఇంకా చూడాలనిపించేలా ఉంటాయి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఇక్కడకు వెళ్తే ప్రతి క్షణం పర్యాటకులు ఫోటోలు దిగుతూనే ఉంటారు. ఏ ఆలయం గోడలను చూసినా అందమైన రాతి శిల్పాలు కొలువుదీరి ఉంటాయి. దీని గురించి ఎంత వర్ణించి చెప్పినా తక్కువే… కళ్ళతోనే చూస్తే తెలుస్తుంది వీటి అందం.

 

రాన్ ఆఫ్ కచ్

గుజరాత్ లో ఉన్న ఒక అందమైన ప్రాంతం రాన్ ఆఫ్ కచ్. ఈ ప్రదేశం తెల్లని ఉప్పుతో నిండినట్టు కనిపిస్తుంది. దీని ఉప్పు ఎడారి అని కూడా పిలుచుకుంటారు. ఇక్కడ సాంప్రదాయాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. సంగీతం, నృత్యం, చేతి పనులతో జరిగే సాంస్కృతిక ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఉంటాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ కచ్ ప్రాంతాన్ని చూడండి. కచ్చితంగా మీరు అందమైన జ్ఞాపకాలను మూట కట్టుకుంటారు.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024