






Best Web Hosting Provider In India 2024

Womens Day 2025: పురుషుల కంటే మహిళలు ఎన్ని విషయాల్లో శక్తిమంతులో తెలుసా.. ఈ అంశాల్లో స్త్రీల ముందు మగవారు తేలిపోతారు
Womens Day 2025: పురుషులు, స్త్రీలు వీళ్ళిద్దరిలో ఎవరు పనులు చక్కగా చేయడంవచో ఒక అంతర్జాతీయ పరిశోధన జరిగింది. అందులో పురుషులతో పోలిస్తే మహిళలు ఎన్నో అంశాల్లో మెరుగ్గా ఉన్నట్టు తేలింది.

మహిళలు మగవారితో పోలిస్తే ఎందులోనూ తక్కువ కాదు. కానీ ప్రాచీన కాలం నుండి వారికి ఇంటిని, వంటింటిని బాధ్యతలుగా అప్పచెప్పారు. ఆధునిక కాలంలో ఇప్పుడిప్పుడే మహిళలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని రంగాల్లో అడుగుపెడుతున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు ఎన్నో అంశాల్లో మెరుగ్గా ఉంటారని అధ్యయనాలు చెప్పాయి. పురుషులకన్నా మహిళలు ఎంత శక్తివంతులో తెలుసుకోండి.
జ్ఞాపకశక్తి
ఏ వ్యక్తికైనా మంచి జ్ఞాపకశక్తి ఉండడం చాలా ముఖ్యం. జ్ఞాపకశక్తి విషయానికి వస్తే పురుషుడి కంటే స్త్రీ చాలా ఉత్తమం. ఆమెకు ఏదైనా గుర్తుంచుకోగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో విషయాలను వారు ఎక్కువ కాలం పాటు గుర్తించుకుంటారు.
భావోద్వేగాలు
ఒక మనిషికి భావోద్వేగాలు ఎంతో ముఖ్యం. ఒక మనిషిపై ప్రేమ, దయ, కరుణ వంటివి కలగడం కూడా భావోద్వేగాలే. పురుషులతో పోలిస్తే స్త్రీలకే ఇలాంటి భావోద్వేగాలు అధికంగా వస్తాయి. వారు అందరినీ ప్రేమగా చూడగలుగుతారు. ఎక్కువ మందిపై దయ చూపగలుగుతారు. ఇతరులతో కఠినంగా వ్యవహరించలేరు.
ఆహారం
ఎక్కువమంది భావన ఏంటంటే స్త్రీలు చాలా తక్కువగా తింటారని. నిజానికి పురుషులతో పోలిస్తే స్త్రీలకే ఆకలి ఎక్కువ. వారే ఎక్కువ ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. వారి శరీరాకృతి సన్నగా ఉన్నా కూడా వారు ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే స్త్రీలు రోజంతా పనిచేస్తారు. కాబట్టి వారికి ఎక్కువ క్యాలరీలు అవసరం పడతాయి. స్త్రీలు పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా తింటారనడంలో ఏమాత్రం తప్పులేదు. ఎక్కువ కష్టపడే వ్యక్తి ఎక్కువ ఆహారాన్ని తినాల్సిన అవసరం ఉంది.
తెలివితేటలు
పురుషులతో పోలిస్తే మహిళల్లోనే తెలివితేటలు ఎక్కువ. ఏ సమస్యనైనా వారు సులువుగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. కానీ తమ తెలివితేటలతో స్త్రీలు ఎవరినీ మోసం చేయలేరు. పురుషులు స్త్రీలను బలహీనులని అనుకుంటారు. శారీరక బలం మాత్రమే పురుషులకు ఎక్కువ. మానసిక బలం మహిళలకే ఎక్కువ. స్త్రీలు పురుషుల కంటే మానసికంగా ఆరు రెట్లు బలంగా ఉంటారు.
ఒత్తిడి
పురుషులు ఒత్తిడిని తట్టుకోలేరు. కానీ మహిళలు తమ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటారు. వారు ఏ సమస్య వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగలరు. మహిళల జీవితంలో ఒత్తిడి అనేది సాధారణ భాగం అయిపోయింది. ఇంటిని, ఇంట్లోని వారిని చూసుకోవడం వల్ల వారికి ఒత్తిడి అనేది అలవాటయిపోయింది.
బలమైన రోగనిరోధక శక్తి
పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. వారిలో ఉండే ఈస్ట్రోజన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పురుషుల కంటే స్త్రీలలో రోగనిరోధక కణాలు అధికంగా ఉంటాయి. అవి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి.
మల్టీటాస్కింగ్
పురుషులు ఒకసారి ఒక పని మాత్రమే చేయగలరు. కానీ స్త్రీలు మల్టీ టాస్కింగ్ లో నిపుణులు. అంటే ఒకే సమయంలో వారు ఎక్కువ పనులను చేయగలరు. స్త్రీల మెదడులోని ఎడమ, కుడి భాగాల మధ్య ఎక్కువ అనుబంధం ఉంటుంది. అందుకే మెదడు రెండు మూడు పనులు చేసేందుకు స్త్రీలను అనుమతిస్తుంది. మెదడులోని ఎడమ భాగం తర్కం, విశ్లేషణకు బాధ్యత వహిస్తే… కుడిభాగం సృజనాత్మకత, అంతర్దృష్టికి బాధ్యత వహిస్తుంది. ఈ రెండు కలిసి పని చేయడం వల్ల స్త్రీలు మరింత మెరుగ్గా పనిచేస్తారు.
ఉత్తమ నాయకులు
పని ప్రదేశం విషయానికి వస్తే పురుషుల కన్నా స్త్రీలే ఉత్తమంగా పనిచేయగలరు. ఎక్కువ ఉత్పాదకత వీరి నుంచే ఉంటుంది. ఉద్యోగులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో వీరు ముందుంటారు. మెరుగైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటారు. అందరినీ కలుపుకుపోయే తత్వం కూడా ఎక్కువ.
సంబంధిత కథనం