





Best Web Hosting Provider In India 2024

TV Show Time Change: ఈటీవీ టాప్ టీఆర్పీ రేటింగ్ షో టైమ్ మారిపోయింది.. ఇక నుంచి ఆదివారం
TV Show Time Change: ఈటీవీలో వచ్చే టాప్ షోలలో ఒకటైన సుమ అడ్డా టైమ్ మారిపోనుంది. ఈ మారిన టైమ్ మార్చి 16 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆ ఛానెల్ ఓ కొత్త ప్రోమోను రిలీజ్ చేసింది.

TV Show Time Change: తెలుగు టీవీ షోలలో ఈటీవీలో వచ్చే వాటికి టాప్ టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతూ ఉంటాయి. అందులోనూ సుమా యాంకర్ గా చేసే సుమ అడ్డాకు ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఈ షో టైమ్ ఇప్పుడు మూడోసారి మారబోతోంది. మారిన టైమ్ మార్చి 16 నుంచి అమల్లోకి రాబోతోంది.
సుమ అడ్డా షో కొత్త టైమ్ ఇదే
ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ చేసే సెలబ్రిటీ గేమ్ షో సుమ అడ్డా. చాలా రోజులుగా ఈటీవీలో టెలికాస్ట్ అవుతోంది. మొదట ఈ షో క్యాష్ 2.0 స్థానంలో ప్రతి శనివారం రాత్రి 9.30 గంటలకు వచ్చేది. 74 ఎపిసోడ్ల తర్వాత ఈ షో టైమ్ ను మంగళవారం రాత్రి 9.30 గంటలకు మార్చేశారు.
ఇప్పుడు మరోసారి సుమ అడ్డా షో సమయాన్ని మార్చినట్లు ఈటీవీ వెల్లడించింది. మార్చి 16 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు సుమ అడ్డా షో టెలికాస్ట్ కానుంది.
ఫన్నీగా టైమ్ ఛేంజ్ అనౌన్స్‌మెంట్ వీడియో
సుమ అడ్డా షో టైమ్ మారినట్లుగా చెప్పడానికి ఈటీవీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో యాంకర్ సుమ కనిపించింది. ఈ వీడియో మొదట్లో ఆమె మేకప్ చేసుకుంటూ కనిపిస్తుంది. ఓ వ్యక్తి వచ్చి సార్ ఫోన్ చేశాడని ఆమెకు ఇస్తాడు. హా.. రాజీవ్.. నువ్వు నన్ను షాపింగ్ కు తీసెళ్తావా.. ఎప్పుడు.. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకా అస్సలు కుదరదు అని ఫోన్ పెట్టేస్తుంది.
ఆ తర్వాత బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఫోన్ చేస్తాడు. ప్రీరిలీజ్ ఈవెంటా.. ఎప్పుడు.. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకా.. కుదరదు అంటుంది. ఆ తర్వాత ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటూ మరో కాల్ వస్తుంది. ఆదివారం సాయంత్రమైతే అస్సలు కుదరదు అని ఆమె చెప్పేస్తుంది.
ఎందుకు మేడమ్ అని అసిస్టెంట్ అడిగితే.. ఇక నుంచి సుమ అడ్డా ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు వస్తుందని సుమా చెబుతుంది.
సరికొత్త సెలబ్రిటీలతో..
ఈటీవీలో సుమ యాంకరింగ్ తో వచ్చే షోలన్నీ హిట్టే. స్టార్ మహిళ, క్యాష్ లాంటి ప్రోగ్రామ్స్ ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత వచ్చిన ఈ సుమ అడ్డాకు ఆ స్థాయి ఆదరణ దక్కకపోయినా.. రేటింగ్స్ లో ఫర్వాలేదనిపిస్తోంది.
ఇప్పుడు ఆదివారం సాయంత్రానికి టైమ్ మారడంతో ఈ రేటింగ్స్ మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు. సరికొత్త టైమ్ లో సరికొత్త సెలబ్రిటీలతో ఈ షో రాబోతోంది. మ్యాడ్ స్క్వేర్ మూవీ టీమ్ ఈ షోకి వచ్చినట్లుగా ప్రోమోలో చూపించారు. దీంతో ఆ ఎపిసోడ్ మొత్తం నవ్వుల పండుగే అని స్పష్టమవుతోంది.
సంబంధిత కథనం