





Best Web Hosting Provider In India 2024

Womens Day 2025: ట్రెండ్ మారుస్తున్నారు..! వ్యాపారాల్లో వారసులుగా దూసుకెళ్తోన్న కుమార్తెలు
Womens Day 2025: వేల కోట్ల బిజినెస్ అయినా కుటుంబ వారసత్వంగా కొడుకులనే ఎంచుకునే వారు. కానీ, నేటితరం అమ్మాయిలు ట్రెండ్ మారుస్తున్నారు. తొణుకుబెణుకు లేకుండా తమ ఫ్యామిలీ బిజినెస్‌లను నడిపిస్తూ దూసుకెళ్తున్నారు. కొందరైతే, కొడుకులేడనే ఆలోచనే రాకుండా చేస్తున్నారు.

వారసత్వం అంటే కొడుకులకే అనుకునే రోజులు పోయాయి. లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంచుకుని వివిధ రంగాల్లో సత్తా చాటుతున్నారు. విభిన్న రంగాల్లో కీలకంగా ఎదుగుతూ వేగంగా వృద్ధి సాధిస్తున్నారు. ఇక వ్యాపార రంగం గురించి చెప్పుకుంటే, కొడుకులు లేని కుటుంబాల్లో తామే వారసులుగా నిలిచి అండగా నిలుస్తున్నారు. కొత్త ఒరవడి సృష్టిస్తూ మార్పు, సంప్రదాయం కలయికతో వ్యాపారాలను నడిపిస్తున్నారు. కొత్త దృష్టి, ధైర్యమైన వ్యూహాలతో క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.
కుటుంబ వ్యాపారాల బాధ్యతలు స్వీకరిస్తున్న కుమార్తెలు
గుల్షన్ గ్రూప్ డైరెక్టర్ యుక్తి నగపాల్ తన కుటుంబ వ్యాపారానికి వారసురాలిగా నిలిచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోన్న ఈమె.. HT లైఫ్‌స్టైల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట్లాడుతూ.. “గుల్షన్ గ్రూప్‌లో, నాయకత్వం అనేది వారసత్వంగా కాదు. మనమే సంపాదించుకోవాలి. నిబద్ధత, దూరదృష్టి, శ్రేష్ఠత అనే విషయాలు వారసత్వాన్ని కాపాడుతుంటాయి. నాకు, వ్యాపారంలోకి అడుగుపెట్టడం అనేది ఎప్పుడూ హక్కుగా అనిపించలేదు. నా తండ్రి నన్ను ప్రోత్సహించారు, శక్తివంతురాలిగా తీర్చిదిద్దారు. దాని కోసం ఆయన నాకెంతో సహాయం చేశారు. కానీ నాయకత్వం అనేది అనుభవం, ధైర్యం, పరిశ్రమ సంక్లిష్టతల గురించి లోతైన అవగాహన ద్వారా మాత్రమే పెంపొందించుకోవాలి”
“నేను నమ్మకాన్ని సంపాదించుకోవాలి – మీటింగుల్లో స్టేక్‌హోల్డర్లు, జట్లు, సహచరుల మధ్య ఒక సీటులో కూర్చొంటే అది రాదు. అది వ్యాపారాన్ని పెంచగల సామర్థ్యం ఉంటేనే అందుతుంది” అని చెప్తున్నారామె.
కోడలైనప్పటికీ వారసురాలిగా నిలిచిన జిందాల్
చండీగఢ్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా నిలిచిన డాక్టర్ శీతల్ జిందాల్ HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా వివరించారు. “కుటుంబ వ్యాపారంలో ఎల్లప్పుడూ కుమారుడినే వారసుడిగా ఎంచుకుంటారు. కానీ, నేను చాలా కాలంగా నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మనం చాన్నాళ్లుగా పితృస్వామ్య మనస్తత్వంలో ఇరుక్కుపోయాం. కాలాలు మారుతున్నాయి. మహిళలు సంస్థలను విజయవంతంగా నడపడంలో పురుషులతో సమానంగా తామూ సమర్థులని ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు”
“నేను జిందాల్ IVFలో నాయకత్వ పాత్రలోకి అడుగుపెట్టింది, కొడుకుగానో లేదా కూతురుగానో కాదు. ఒక కోడలిగా ప్రవేశించాను. నా అత్తమామలు నాపై అపారమైన ప్రేమ, నమ్మకం, గౌరవాన్ని ఉంచారు. నా సామర్థ్యాలు, దృష్టిని చూసి, నన్ను కుటుంబ పాత్రలకే పరిమితం చేయలేదు. వారి నమ్మకం నాకు నాయకత్వంలో లింగ వివక్షను సవాలు చేయడానికి సహకరించింది. మహిళలు, కుటుంబాలను శక్తివంతం చేసే రంగంలో కృషి చేయడానికి అనుమతించింది” అని చెప్తూ తన ఫ్యామిలీ బిజినెస్ ను ఈ స్థాయికి తేవడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
“జెనెటిక్స్ ప్రోగ్రామ్‌ను పర్యవేక్షిస్తూ, రీ ప్రొడక్షన్ హెల్త్ సేఫ్టీను మెరుగుపరిచే విధానాన్ని తెలుసుకోగలిగాను. మహిళలు తమ ప్రత్యుత్పత్తి ఆరోగ్యాన్ని కూడా పెంపొందించాను” అని ఆమె అన్నారు. జిందాల్ ఐవీఎఫ్ దృష్టిలో నాయకత్వం అనేది పేరుకో, వంశపారపర్యంగానో వచ్చేది కాదు. ఉత్సాహం, పట్టుదల ఉన్నప్పుడే ఆ నమ్మకాన్ని దక్కించుకోగలమని చెప్తున్నారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం