Naari Movie Review: నారి మూవీ రివ్యూ – షాకింగ్ క్లైమాక్స్‌తో వ‌చ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

Naari Movie Review: నారి మూవీ రివ్యూ – షాకింగ్ క్లైమాక్స్‌తో వ‌చ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh HT Telugu
Published Mar 07, 2025 08:55 PM IST

Naari Movie Review:సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన నారి మూవీ మార్చి 7న థియేట‌ర్ల‌లో రిలీజైంది. సందేశాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

నారి మూవీ రివ్యూ
నారి మూవీ రివ్యూ

Naari Movie Review: ఆమ‌ని, వికాశ్ వ‌శిష్ట‌, మౌనిక రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ నారి. మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి సూర్య‌ వంటిపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

భారతి కథ…

మంత్రి భూప‌తి (నాగ మ‌హేష్‌) కొడుకుతో పాటు అత‌డి స్నేహితులు ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్ప‌డుతారు. భూప‌తికి భ‌య‌ప‌డి అత‌డికి వ్య‌తిరేకంగా కేసు వాదించ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు. బాధితురాలికి లాయ‌ర్ శార‌ద (ప్ర‌గ‌తి) అండ‌గా నిలుస్తుంది. ఈ కేసును వాధించ‌డంలో భారతి(ఆమని, మౌనిక రెడ్డి) జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంది శార‌ద‌.

అస‌లు భార‌తి ఎవ‌రు? త‌న కుటుంబంలో జ‌రిగిన త‌ప్పు మ‌రెవ‌రికి జ‌ర‌గ‌కూడ‌ద‌ని భార‌తి ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ది? ప్రేమ పేరుతో భార‌తిని మోసం చేసింది ఎవ‌రు? కేసులో లాయ‌ర్ శార‌ద విజ‌యం సాధించిందా? లేదా? అన్న‌దే నారి మూవీ క‌థ‌.

మహిళలపై వివక్ష…

మ‌హిళా శ‌క్తిని చాటిచెప్పే క‌థాంశాల‌తో తెలుగులో చాలా త‌క్కువ‌గా సినిమాలొచ్చాయి. నారి అలాంటి మెసేజ్‌తోనే తెర‌కెక్కిన సినిమానే. పుట్టిన‌ప్ప‌టి నుంచి ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్న ఓ మ‌హిళ ఎంతో మందికి ఆద‌ర్శ‌ప్రాయురాలిగా ఎలా నిలిచింది? మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు పాల్ప‌డుతున్న వారికి ఏ విధంగా బుద్ది చెప్పింద‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు సూర్య వంటిప‌ల్లి ఈ సినిమాను రూపొందించారు.

ఇంట్లోనే ఆడ‌పిల్ల‌లు ఎలా వివ‌క్ష‌కు గుర‌వుతారు? ప్రేమ పేరుతో నేటిత‌రం ఎలాంటి త‌ప్పులు చేస్తున్నారు… ఇలా సొసైటీలోని ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఈ సినిమాలో చ‌ర్చించారు. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతోన్న వేధింపుల‌కు సంబంధించి కేవ‌లం స‌మ‌స్య‌ను మాత్ర‌మే చ‌ర్చించి వ‌దిలిపెట్ట‌కుండా ప‌రిష్కారాన్ని చూపించారు ద‌ర్శ‌కుడు.

క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో…

నారి మూవీలో తాను చెప్పాల‌నుకున్న సందేశాన్ని సీరియ‌స్‌గా క్లాస్ ఇస్తున్న‌ట్లుగా కాకుండా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో చెప్పారు. నేటి యూత్‌కు క‌నెక్ట్ అయ్యే అంశాల‌తో సినిమాను న‌డిపించారు. వికాష్ వ‌శిష్ట‌, మౌనిక రెడ్డి ట్రాక్ ఆక‌ట్టుకుంటుంది. వినోద్ కుమార్ అందించిన పాట‌లు ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి.

ర‌మ‌ణ గోగుల పాడిన పాట‌తో పాటు ఈడు మ‌గాడేంట్రా బుజ్జి పాట‌లు బాగున్నాయి. ట్రెండీ ట్యూన్స్ పాట‌లు మెప్పిస్తాయి. దారి తప్పిన కొడుకుకు తల్లి ఏ విధంగా గుణపాఠం చెప్పింది అన్న‌ది షాకింగ్‌గా చూపించారు. అది హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్‌తో ఎండ్ చేయ‌డం ఆక‌ట్టుకుంటుంది.

ఛాలెంజింగ్ రోల్‌లో…

ఆమ‌ని న‌ట‌న ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. భార‌తిగా ఛాలెంజింగ్ రోల్‌లో మెప్పించింది. ఎమోష‌న‌ల్ రోల్‌లో ఆమ‌ని న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. నిత్య‌శ్రీ పాత్ర చిన్న‌దే అయినా ఆమె క్యారెక్ట‌ర్ నేప‌థ్యంలో వ‌చ్చే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో వికాస్ వ‌శిష్ట చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. కార్తికేయ దేవ్‌, మౌనిక రెడ్డి న‌ట‌న ఓకే అనిపిస్తుంది. ప్ర‌గ‌తి, నాగ‌మ‌హేష్‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్ యాక్ట‌ర్స్ ఈ సినిమాలో న‌టించారు.

ఇంకాస్త ఎంగేజింగ్‌గా…

నారి మూవీ కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ బాగుంది. ఇంకాస్త ఎంగేజింగ్‌గా క‌థ చెబితే బాగుండేది. క్లైమాక్స్ లాంటి బ‌ల‌మైన సీన్లు ఇంకొన్ని రాసుకోవాల్సింది.

మంచి మెసేజ్‌…

నారి మంచి మెసేజ్ ఓరియెటెంట్ మూవీ. సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని యాక్టింగ్ బాగుంది.ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కొంత వ‌ర‌కు ఈ మూవీ మెప్పిస్తుంది.

రేటింగ్‌: 2.5/5

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024