




Best Web Hosting Provider In India 2024

Nani Presents Court Trailer: నాని మళ్లీ టచ్ చేశాడు.. సెన్సిటివ్ టాపిక్.. బలమైన ఎమోషన్స్.. కోర్టు సినిమా ట్రైలర్
Nani Presents Court Trailer: హీరో నాని బ్యానర్ పై వస్తున్న కోర్టు సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే సెన్సిటివ్ టాపిక్ తో, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సినిమా రూపొందించారని అర్థమవుతోంది. బలమైన ఫ్యామిలీ, కోర్టు డ్రామా ఉండబోతోందని తెలుస్తోంది.

వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న నాని ప్రోడ్యూసర్ గానూ మెప్పిస్తున్నాడు. తన వాల్ పోస్టర్స్ బ్యానర్ పై విభిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాలను అందిస్తున్నాడు. తాజాగా కోర్ట్ మూవీతో మరోసారి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది క్యాప్షన్. ప్రియదర్శి మెయిన్ లీడ్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (మార్చి 7) రిలీజైంది.
కేసులు పెట్టి
టీనేజీ లవ్ తో మొదలై కోర్టు చూట్టూ ఈ సినిమా తిరిగేలా కనిపిస్తోంది. ఇద్దరు టీనేజర్లు ప్రేమించుకుంటే.. ఆ అమ్మాయి తండ్రి అబ్బాయిపై రకరకాల సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయిస్తాడు. తప్పు చేకపోయినా అక్రమంగా ఇరికించినట్లు కోర్ట్ సినిమా ట్రైలర్ లో కనిపిస్తోంది. చివరకు అత్యంత సెన్సిటివ్ అయిన పోక్సో కేసు కూడా పెట్టినట్లు చూపించారు.
లాయర్ ప్రియదర్శి
కోర్టు సినిమాలో ప్రియదర్శి లాయర్ గా కీ రోల్ ప్లే చేస్తున్నారు. అక్రమ కేసుల కారణంగా జైల్లో రిమాండ్ లో ఉన్న కుర్రాడి తరపున వాదించే లాయర్ పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు. ఆ కేసు వాదించేందుకు చాలా మంది వెనుకడుగు వేసినా ప్రియదర్శి మాత్రం ముందుకు వస్తాడు. ఈ అక్రమ కేసుల నుంచి ఆ కుర్రాడిని లాయర్ ఎలా తప్పించాడు? అసలు ఏం జరిగిందనే కథతో సినిమా సాగేలా కనిపిస్తోంది.
ఎమోషన్స్
కోర్టు సినిమాలో బలమైన ఎమోషన్స్ ఉండబోతున్నాయని ట్రైలర్ ను బట్టి స్పష్టమైంది. ఆ కుర్రాడి తల్లిదండ్రుల బాధ కనిపించింది. టీనేజీ లవర్ల పెయిన్ కనిపించింది. కుర్రాడిని పోలీసులు హింసించడం కూడా దీనికి యాడ్ అయింది. ఈ సినిమాలో ప్రియదర్శితో పాటు హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ముఖ్యంగా అమ్మాయి తండ్రిగా శివాజీ నటన మరో లెవల్ లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ట్రైలర్ లో అతని కోపం మరో స్థాయిలో ఉంది. ఇక ఈ సినిమా ఈ నెెల (మార్చి) 14న రిలీజ్ కానుంది.
కొత్త దర్శకుడు
కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ ఈ కోర్టు సినిమాను చాలా గ్రిప్పింగ్ గా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. మంచి ఎమోషన్స్ తో, కోర్టు డ్రామాతో, సెన్సిటివ్ టాపిక్ ను టచ్ చేస్తూ అన్ని వర్గాలు చూసేలా మూవీ రెడీ చేశారనే చెప్పొచ్చు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని సమర్ఫణలో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంతి తిపిర్నేని నిర్మాత.
సంబంధిత కథనం