Gunde Ninda Gudi Gantalu Serial: అత్త‌కు ఎదురుతిరిగిన మీనా – ప్ర‌భావ‌తి క‌న్నింగ్ ప్లాన్‌ – మ‌నోజ్ జాబ్ రిజెక్ట్‌

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: అత్త‌కు ఎదురుతిరిగిన మీనా – ప్ర‌భావ‌తి క‌న్నింగ్ ప్లాన్‌ – మ‌నోజ్ జాబ్ రిజెక్ట్‌

Nelki Naresh HT Telugu
Published Mar 08, 2025 08:10 AM IST

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు ప్రోమోలో ప్ర‌భావ‌తి, రోహిణి, శృతి ఒక్క‌ట‌వుతారు. మీనాను టార్గెట్ చేస్తారు.బాలు ఇంట్లో లేని టైమ్ చూసి అత‌డిని త‌క్కువ చేసి మాట్లాడ‌టంతో మీనా స‌హించ‌లేక‌పోతుంది. ధ‌మ్ము, ధైర్యం ఉంటే బాలు ఉన్న‌ప్పుడు మాట్లాడ‌మ‌ని ఛాలెంజ్ చేస్తుంది.

గుండె నిండా గుడి గంట‌లు ప్రోమో
గుండె నిండా గుడి గంట‌లు ప్రోమో

మ‌నోజ్ ఇంట‌ర్వ్యూకు వెళ‌తాడు. భ‌ర్త కోసం రోహిణి కంగారుగా ఎదురుచూస్తుంటుంది. రోహిణి టెన్ష‌న్ చూసి ఏమైంద‌ని ర‌వి అడుగుతాడు. మ‌నోజ్ ఇంట‌ర్వ్యూకు వెళ్లిన సంగ‌తి చెబుతుంది. రెండు మూడు ఇంట‌ర్వ్యూలు ఉన్నాయ‌ని అన్నాడ‌ని, ఏదో ఒక జాబ్ క‌న్ఫామ్ అవుతుంద‌ని అనుకున్న‌ట్లు రోహిణి చెబుతుంది. ఒక్క రోజులో జాబ్ ఎలా దొరుకుతుంద‌ని శృతి అంటుంది.

శృతి మాట‌ల‌తో రోహిణి నొచ్చుకుంటుంది. తాను వేరేలా అడ‌గ‌లేద‌ని, బాలు మాదిరిగా అస్స‌లు అడ‌గ‌లేద‌ని అంటుంది.మీనా ఉండ‌టం చూసి మ‌నోజ్‌కు జాబ్ రాక‌పోతే మ‌మ్మ‌ల్ని బ‌త‌క‌నిచ్చేలా లేర‌ని కావాల‌నే రెచ్చ‌గొడుతుంది రోహిణి.

అత్త‌గారిలా….

రోహిణి మాట‌ల‌తో మీనా కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. మ‌నిషి ఇంట్లో లేన‌ప్పుడు అత్త‌గారిలా మాట్లాడ‌టం ఎందుకు…ద‌మ్ముంటే…ధైర్యం ఉంటే బాలు ఉన్న‌ప్పుడే మాట్లాడ‌మ‌ని రోహిణితో ఛాలెంజ్ చేస్తుంది మీనా. బాలు ఏ త‌ప్పు చేయ‌లేద‌ని మీనా అంటుంది. భార్య‌ను, తండ్రిని మోసం చేయ‌లేద‌ని, అబ‌ద్దాలు చెప్పుకుంటూ బ‌త‌క‌డం లేద‌ని దులిపేస్తుంది.

మీనా మాట‌ల‌ను స‌హించ‌లేక‌పోతుంది ప్ర‌భావ‌తి. ఇక్క‌డ అంద‌రూ చ‌దువుకున్న‌వాళ్లే ఉన్నార‌ని, కాస్త సంస్కారంతో మాట్లాడ‌మ‌ని అవ‌మానిస్తుంది.

రోహిణి, శృతి, ప్ర‌భావ‌తి ఒక్క‌టైపోతారు. మీనాను టార్గెట్ చేస్తారు. ప్ర‌భావ‌తి మాట‌ల‌తో మీనా మ‌న‌సు గాయ‌ప‌డుతుంది.

మ‌నోజ్ డ్రామా…

అంత‌కుముందు మ‌నోజ్ ఇంట‌ర్వ్యూకు వెళ‌తాడు. ఇది వ‌ర‌కే ఆ కంపెనీలో వారం రోజుల పాటు జాబ్ చేస్తాడు. కానీ లేడీ ఎండీ ఉన్న చోట వ‌ర్క్ చేయ‌న‌ని పొగ‌రుగా ఉద్యోగం వ‌దిలేస్తాడు. మ‌ళ్లీఇంట‌ర్వ్యూకు రావ‌డంతో అత‌డికి క్లాస్ ఇస్తుంది ఎండీ. మీరు ఎక్కువ రోజులు ఎక్క‌డ ప‌నిచేయ‌లేర‌ని, మీ మైండ్‌సెట్ అలా ఉంద‌ని అంటుంది. లాస్ట్ టైమ్ పొర‌పాటుగా అలా మాట్లాడాన‌ని, ఈ సారి బాగా ప‌నిచేస్తాన‌ని మ‌నోజ్ బ‌తిమిలాడుతాడు.

లేడీస్ కింద ప‌నిచేయ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని అంటాడు. ఈ జాబ్ ఇప్పుడు నాకు చాలా అవ‌వ‌స‌రం అని త‌న ప‌రిస్థితి వివ‌రిస్తాడు మ‌నోజ్‌. తాను పూర్తిగా మారిపోయాన‌ని ఎండీని న‌మ్మించ‌బోతాడు.

ప్లాన్ రివ‌ర్స్‌…

కానీ మ‌నోజ్ ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. మీరు మారారు అంటే న‌మ్మ‌న‌ని అంటుంది. ఎక్క‌డ జాబ్ దొర‌క్క‌పోవ‌డంతో మీరు డ్రామాలు ఆడుతున్నార‌ని ఎండీ అంటుంది..నీకు జాబ్‌ ఇవ్వ‌లేన‌ని చెప్పి వెళ్ల‌గొడుతుంది.

మీనాకు వార్నింగ్‌…

బాలును మీనానే రెచ్చ‌గొడుతుంద‌ని ప్ర‌భావ‌తి, రోహిణి అనుకుంటారు. మీనాకు వార్నింగ్ ఇవ్వాల‌ని అనుకుంటారు. కానీ సీన్ రివ‌ర్స్ అవుతుంది. ప్ర‌భావ‌తి మాట‌ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా స‌మాధానాలు ఇస్తుంది మీనా. మాట‌కు మాట అంటుంది. నా భ‌ర్త‌ను మాత్రం త‌క్కువ చేసి మాట్లాడితే ఊరుకోన‌ని వార్నింగ్ ఇస్తుంది. బాలు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని, వాడిని కంట్రోల్‌పెట్టుకోమ‌ని మీనాతో అంటుంది ప్ర‌భావ‌తి.

మీ కొడుకును మీరే కంట్రోల్‌లో పెట్టాలి. కాదంటే అప్పుడు న‌న్నుఅడ‌గండి అని కౌంట‌ర్ వేస్తుంది మీనా. మీనా తిర‌గ‌బ‌డ‌టం చూసి ప్ర‌భావ‌తి, మీనా స‌హించ‌లేక‌పోతారు. మీనాకు రోజు రోజుకు పొగ‌రు పెరుగుతుంద‌ని ప్ర‌భావ‌తి అనుకుంటుంది. ఆ పొగ‌రు దించుతాన‌ని మ‌న‌సులో శ‌ప‌థం చేస్తుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది సోమ‌వారం నాటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌లో చూడాల్సిందే.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024