





Best Web Hosting Provider In India 2024

OTT Horror Thriller: కిడ్నాపర్లనే ఉతికేసి రక్తం తాగే పిల్ల.. భయపెట్టే హారర్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Horror Thriller: డబ్బు కోసం కిడ్నాప్ చేసిన వారినే బంధించి ఓ పాప చితక్కొట్టే స్టోరీతో ఓ హారర్ మూవీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా హిట్ అయింది. ఆ చిత్రమేదో.. ఏ ఓటీటీలో చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.

హాలీవుడ్లో హారర్ చిత్రాలో బోలెడు వచ్చాయి. డిఫరెంట్ స్టోరీలతో భయపట్టేలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హారర్ జానర్ హాలీవుడ్లో బాగా వర్కౌట్ అవుతూనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగానూ కొన్ని హారర్ చిత్రాలు క్రేజ్ ఉంటుంది. గతేడాది వచ్చిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘అబిగైల్’ కూడా ట్విస్టులతో భయపెడుతూ మెప్పించింది. ఈ మూవీ ఓటీటీలో ఏడు భాషల్లో అందుబాటులో ఉంది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
‘అబిగైల్’ మూవీ జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. ఇలా ఏడు భాషల్లో హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
అబిగైల్ చిత్రంలో మెలీసా బెరేరా, డాన్ స్టీవెన్స్, ఆలిషా వెయిర్ ప్రధాన పాత్రలు పోషించారు. విల్ క్యాట్లెట్, క్యాథరిన్ న్యూటన్, అంగస్ క్లౌజ్, ఎస్పోసిటో కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి మ్యాట్ బెటినెలి ఓల్పిన్, టైలర్ జిలెట్ దర్శత్వం వహించారు. హారర్ ఎలిమెంట్లు, సస్పెన్స్, కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ 19న ఈ చిత్రం విడుదలైంది.
అబిగైల్ సినిమా స్టోరీలైన్
12 సంవత్సరాల వయసు ఉండే అబిగైల్ అనే పాపను ఆరుగురు క్రిమినల్స్ కిడ్నాప్ చేస్తారు. అండర్వరల్డ్ డాన్ కూతురు అని తెలుసుకొని ఆ పిల్లను బంధించి 50 మిలియన్ డాలర్లు ఇవ్వాలని కుటుంబాన్ని డిమాండ్ చేస్తారు. అక్కడే ట్విస్ట్ ఎదురవుతుంది. ఎందుకంటే అబిగైల్ సాధారమైన పాప కాదు. శతాబ్దాల నుంచి ఉన్న రక్తం తాగే ఓ వాంపైర్. తనను కిడ్నాప్ చేసిన వారిని ఆ భవనంలో ట్రాప్ చేసి చితకొట్టేస్తుంది అబిగైల్. తన అతీత శక్తులతో కిడ్నాపర్లను ఆడుకుంటుంది. రక్తం తాగేస్తుంది. అంతకీ అబిగైల్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి.. వాంపైర్ ఎలా అయింది.. ఆ కిడ్నాపర్ల పరిస్థితి ఏమైంది.. అనే అంశాలు అబిగైల్ మూవీలో ప్రధానంగా ఉంటాయి. హారర్ ఎలిమెంట్లతో భయపెట్టేలా ఈ మూవీ ఉంటుంది.
అబిగైల్ కలెక్షన్లు
అబిగైల్ సినిమా 28 మిలియన్ డాలర్ల ఖర్చుతో రూపొందింది. ఈ మూవీ మొత్తంగా దాదాపు 42.8 మిలియన్ డాలర్ల కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఈ మూవీని ప్రాజెక్ట్ ఎక్స్ ఎంటర్టైన్మెంట్, విన్సన్ ఫిల్మ్స్, రేడియో సైన్స్ ప్రొడక్షన్స్ పతాకాలు నిర్మించాయి.
హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి అబిగైల్ చిత్రం బాగా నచ్చుతుంది. హారర్ ఎలిమింట్లు, ట్విస్టులతో పాటు కొన్ని సీన్లు సరదాగానూ ఉంటాయి. ఈ చిత్రాన్ని జియోహాట్స్టార్ ఓటీటీలో చూసేయవచ్చు.
సంబంధిత కథనం