Arjun S/o Vyjayanthi Collections: కల్యాణ్ రామ్ చిత్రానికి కాస్త డ్రాప్ అయిన కలెక్షన్లు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..

Best Web Hosting Provider In India 2024

Arjun S/o Vyjayanthi Collections: కల్యాణ్ రామ్ చిత్రానికి కాస్త డ్రాప్ అయిన కలెక్షన్లు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..

Arjun S/o Vyjayanthi Collections: అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు రెండో రోజు కలెక్షన్లలో కాస్త డ్రాప్ కనిపించింది. మోస్తరు వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమాకు రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంతంటే..

Arjun S/o Vyjayanthi Collections: కల్యాణ్ రామ్ చిత్రానికి కాస్త డ్రాప్ అయిన కలెక్షన్లు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. మంచి హైప్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ సినిమాలో సీరియర్ నటి విజయశాంతి ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం రెండో రోజు వసూళ్లలో తగ్గుదల కనిపించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

రెండు రోజుల కలెక్షన్లు ఇవే

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.8.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ కలెక్షన్ల లెక్కతో ఓ పోస్టర్‌ను నేడు (ఏప్రిల్ 20) సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వసూళ్లలో డ్రాప్

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు తొలి రోజు రూ.5.15 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు మూవీ టీమ్ తెలిపింది. శనివారమైన రెండో రోజు ఈ చిత్రానికి సుమారు రూ.3.4 కోట్ల వసూళ్లు వచ్చాయి. వీకెండ్ అయినా రెండో వారం కలెక్షన్లలో బాగానే డ్రాప్ కనిపించింది. మొత్తంగా రెండు రోజుల్లో ఎనిమిదిన్నర కోట్ల గ్రాస్ కలెక్షన్లను ఈ చిత్రం సాధించింది. మరి మూడో రోజైన ఆదివారం కలెక్షన్లలో జోరు పెరుగుతుందేమో చూడాలి. అయితే, సోమవారం ఈ మూవీకి అసలైన టెస్ట్ ఎదురుకానుంది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రంలో విజయశాంతి, కల్యాణ్ రామ్ తల్లీకొడుకుల పాత్రలు పోషించారు. యాక్షన్‍తో పాటు మదర్ సెంటిమెంట్‍తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఈ మూవీలో కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్‍గా నటించారు. సోహైల్ ఖాన్, శ్రీకాంత్, బబ్లూ పృథ్విరాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అజ్నిష్ లోకనాథ్ మ్యూజిక్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక ఫిల్మ్స్ బ్యానర్లపై సునీల్ బలుసు, అశోక్ వర్దన్ ఈ మూవీని నిర్మించారు. సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రూపొందిందని అంచనా.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగింది. సినిమాపై కావాలనే నెగెటివిటీని వ్యాప్తి చేస్తున్న వారికి విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలంటూ సీరియస్‍గా మాట్లాడారు. బాగున్న సినిమాను బాగోలేదంటూ ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని చెప్పారు. ఏ సినిమాకైనా నెగెటివిటీ వ్యాప్తి చేయడం వల్ల నటీనటులు, దర్శకనిర్మాతలపై చాలా ప్రభావం పడుతుందని అన్నారు. చీప్ పనులు మానుకోవాలంటూ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసే వాళ్లకు హెచ్చరిక చేశారు విజయశాంతి.

తమ చిత్రానికి అనుకున్న రేంజ్‍లో బాగానే కలెక్షన్లు వస్తున్నాయని హీరో కల్యాణ్ రామ్ చెప్పారు. బుధవారంలోగా బ్రేక్ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారని అన్నారు. ఈ మూవీలో క్లైమాక్స్ గురించి అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. కొత్త తరహా క్లైమాక్స్ చేశామని అన్నారు. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నమ్మకం కలిగించారంటూ మాట్లాడారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024