




Best Web Hosting Provider In India 2024

మీల్ మేకర్ శెనగపిండితో చేసిన దోస, ప్రొటీన్ తీసుకుంటూనే బరువు తగ్గాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇది!
ప్రొటీన్ ప్యాక్‌డ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తుంటే ఇది మీ కోసమే. హెల్తీ అండ్ టేస్టీ వంటకాన్ని మీరూ ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ ఫాలో అయిపోండి. సింపుల్ అండ్ సూపర్ ఫుడ్ ఇది.
ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వెదికేవారికి కోడిగుడ్డు ఒకటే ఆప్షన్ కాదు. సోయా ఉత్పత్తుల్లో ఒకటైన మీల్ మేకర్, శెనగపిండిని కూడా వాడుకోవచ్చు. అదనంగా కార్బొహైడ్రేట్స్ చేరకపోవడం వల్ల దీనిని వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారు తీసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్ గా బెస్ట్ ఆప్షన్ ఈ మీల్ మేకర్ దోస. మరింకెందుకు లేటు.. ఓసారి రెసిపీ చూసేద్దామా!
సోయా శెనగపిండితో దోస చేయడానికి కావల్సిన పదార్థాలు
- 1 కప్పు మీల్ మేకర్
- ½ కప్పు శెనగ పిండి
- 1/3 కప్పు పెరుగు
- 1/3 కప్పు నీరు లేదా సరిపడినంత
- ½ టీ స్పూన్ పసుపు
- 1 టీ స్పూన్ కారం పొడి
- 1 టీ స్పూన్ ధనియాల పొడి
- 1 టీ స్పూన్ జీలకర్ర పొడి
- 1 టీ స్పూన్ చాట్ మసాలా
- ¼ కప్పు తరిగిన క్యారెట్
- ¼ కప్పు తరిగిన క్యాబేజ్
- ¼ కప్పు తరిగిన క్యాప్సికమ్
- 1 తరిగిన ఉల్లిపాయ
- 2 పచ్చిమిర్చి
- ¼ కప్పు తరిగిన కొత్తిమీర
- ఉప్పు రుచికి తగినంత
తయారుచేసే విధానం–
- ముందుగా మీల్ మేకర్ తీసుకుని ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టండి.
- ఆ తర్వాత అందులో అదనంగా ఉన్న నీటిని పారబోయండి.
- ఇప్పుడు అందులో శెనగపిండి, పెరుగు, నీరు వేసి బాగా కలపండి.
- ఆ మిశ్రమాన్ని తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేయండి.
- ఆ పిండిలో క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేయండి.
- దానిని బాగా కలుపుకున్న తర్వాత అందులో మసాలాలు అయిన ధనియాలు, జీలకర్ర, చాట్ మసాలా, కొత్తిమీర వేయండి.
- రుచికి తగినంత ఉప్పు వేసుకుని పిండిని దోసేందుకు సరిపడ జోరుగా తయారుచేసుకోండి.
- ఇప్పుడు ఆ పిండిని ప్యాన్ మీద వేసుకుని దోసెలు లాగా పోయండి.
- దానిపై కొన్ని నువ్వుల గింజలు, ఎండిమిరప గింజలు చల్లుకుంటే రుచికి బాగుంటుంది.
- ఇప్పుడు కొద్దిగా నూనె రాసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతలా వేయించండి.
- అలా తయారైన దోసను గ్రీన్ చట్నీ లేదా టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
ఈ దోస తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుందామా:
1. మీల్ మేకర్ అనేవి ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్లలో అత్యుత్తమమైనవి. ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీర బలం పెరుగుతుంది. శెనగపిండి (బెసన్) కూడా మంచి ప్రోటీన్ సోర్స్, ఇది ముఖ్యంగా శాకాహారులకు బాగా ఉపయోగపడుతుంది.
2. క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు వంటి కూరగాయలు ఎక్కువగా డైటరీ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి మలబద్దకం తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరిచే విషయంలో చాలా ఉపయోగపడతాయి.
3. శెనగపిండిలో కొలెస్ట్రాల్ లేకుండా ఉండే మంచి కొవ్వులు ఉంటాయి. అలాగే, సోయా ప్రొటీన్ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి వంటి మసాలాలు జీర్ణక్రియకు సహకరిస్తాయి.
4. బరువు తగ్గించుకోవాలనుకునేవారికి తక్కువ కేలరీతో హై న్యూట్రిషన్ స్నాక్
5. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వంటి పదార్థాలు యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్లను బయటకు తోడగడంలో సహాయపడతాయి.
సంబంధిత కథనం