





Best Web Hosting Provider In India 2024

OTT Thriller Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోని 5 టాప్ తమిళ వెబ్ సిరీస్‍లు.. తెలుగులోనూ.. మీరెన్ని చూశారు!
OTT Tamil Thriller Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని తమిళ థ్రిల్లర్ సిరీస్‍లు బాగా పాపులర్ అయ్యాయి. మంచి వ్యూస్ సాధించాయి. వాటిలో ఐదు ముఖ్యమైన సిరీస్‍లు ఏవో చూడండి.
ఓటీటీల్లో కొన్ని తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్‍లు బాగా సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని సిరీస్‍లకు ఆదరణ బాగా దక్కింది. సుజల్ సహా మరిన్ని తమిళ థ్రిల్లర్ సిరీస్‍లు ప్రైమ్ వీడియోలో అదరగొట్టాయి. బాగా పాపులర్ అయ్యాయి. ప్రేక్షకులకు థ్రిల్ పంచాయి. వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్-5 తమిళ థ్రిల్లర్ సిరీస్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
సుడల్: ది వర్టెక్స్ సీజన్ 1,2
తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్: ది వర్టెక్స్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చాలా విజయవంతం అయింది. ఐశ్వర్య రాజేశ్, ఖాతిర్ లీడ్ రోల్స్ చేసిన ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2022లో వచ్చి సూపర్ సక్సెస్ అయింది. మర్డర్ మిస్టరీల చుట్టూ ఈ సిరీస్‍ను థ్రిల్లింగ్‍గా, గ్రిప్పింగ్‍గా తీసుకొచ్చారు క్రియేటర్లు పుష్కర్ – గాయత్రి. ఫస్ట్ సీజన్ ఎంతో హిట్ అయింది. సుడల్ వెబ్ సిరీస్‍లో రెండో సీజన్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇది కూడా సక్సెస్ సాధించింది. సుడల్ వెబ్ సిరీస్ రెండు సీజన్లు తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమ్ అవుతున్నాయి.
ఇన్‍స్పెక్టర్ రిషి
నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన తమిళ హారర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇన్‍స్పెక్టర్ రిషి 2024 మార్చిలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. అడవిలో జరిగే హత్యల చుట్టూ ఉండే రహస్యాలు, మిస్టరీలు, హారర్ ఎలిమెంట్లలో ఈ సిరీస్ గ్రిప్పింగ్, ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సిరీస్‍కు జేఎస్ నందిని దర్శకత్వం వహించారు. సునైనా, కన్న రవి కూడా కీరోల్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇన్‍స్పెక్టర్ రిషి సిరీస్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంది. ఈ సిరీస్‍కు వ్యూస్ భారీగా దక్కాయి.
వదంతి: ది ఫాబుల్ ఆఫ్ వెలోని
తమిళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘వదంతి: ది ఫాబుల్ ఆఫ్ వెలోని’ 2022 డిసెంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఈ సిరీస్‍లో ఎస్‍జే సూర్య, సంజన కృష్ణమూర్తి లీడ్ రోల్స్ చేశారు. ఓ యువతి మర్డర్, ఆ కేసు దర్యాప్తు కథాంశంతో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్‍కు ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించారు. వదంతి సిరీస్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.
స్నేక్స్ అండ్ లాడర్స్
స్నేక్స్ అండ్ లాడర్స్ వెబ్ సిరీస్ గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో వీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించగా.. అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల దర్శకత్వం వహించారు. అడవిలోకి వెళ్లిన పిల్లలకు ఓ పురాతన డాలర్ దొరకడం, దాని కోసం ఓ ముఠా ప్రయత్నించడం, పోలీసుల ఇన్వెక్టిగేషన్ ఇలా ఈ సిరీస్ స్టోరీ ఉంటుంది. స్నేక్స్ అండ్ లాడర్స్ కూడా తమిళంలో రూపొందగా.. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంది.
వెల్ల రాజా
వెల్ల రాజా వెబ్ సిరీస్ 2018లో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఈ థ్రిల్లర్ సిరీస్‍లో బాబీ సిహా, పార్వతి నాయర్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. గుహన్ సెన్నియప్పన్ ఈ సిరీస్‍కు డైరెక్షన్ చేశారు.
సంబంధిత కథనం