





Best Web Hosting Provider In India 2024

ఏపీ ఓపెన్ స్కూల్స్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. పదిలో 37.93శాతం, ఇంటర్‌లో 53.12శాతం ఉత్తీర్ణత
ఏపీ సార్వత్రిక విద్యా పీఠం నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ పదో తరగతి పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్స్, ఇంటర్ పరీక్షలతో పాటు ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జరిగిన పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 2025లో ఈ పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించారు. మార్చి 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలతో పాటు ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి.
ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు.
https://apopenschool.ap.gov.in/
ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పలితాలు కూడా రెగ్యులర్ ఫలితాలతో పాటు విడుదల చేశారు. పరీక్షలు మార్చి 3 నుంచి 15వరకు జరిగాయి. పదో తరగతి జవాబు పత్రాలను తొమ్మిది కేంద్రాల్లో, ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ పదిహేడు కేంద్రాల్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఏపీ ఓపెన్ స్కూల్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఏపీ ఓపెన్ స్కూల్స్ పదో తరగతిలో రాష్ట్ర వ్యాప్తంగా 26,679మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 10,119మంది ఉత్తీర్ణులయ్యారు. 37.93శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌లో 63,688మంది పరీక్షలకు హాజరవగా 33,819మంది ఉత్తీర్ణులు అయ్యారు. 53.12శాతం ఉత్తీర్ణత సాధించారు. పదోతరగతిలో బాలురు 36.01శాతం, బాలికలు 40.10శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌లో బాలురు 50.26శాతం, బాలికలు 57.26శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఏపీ ఓపెన్ స్కూల్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 24వవ తేదీ వరకు జరుగుతాయి. ఏపీ ఓపెన్ స్కూల్స్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రెగ్యులర్ పరీక్షలతో పాటు నిర్వహిస్తున్నట్టు సర్వాత్రిక విద్యా పీఠం డైరెక్టర్ నరసింహరావు తెలిపారు. రెగ్యులర్ ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాల్లోనే ఓపెన్ స్కూల్ పరీక్షలను కూడా నిర్వహిస్తారు. ఓపెన్ స్కూల్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను మే 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 26 నుంచి మే 5వ తేదీ వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చు. ఏపీ ఆన్‌లైన్, పేమెంట్ గేట్‌వేల ద్వాారా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు.
https://apopenschool.ap.gov.in/
ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. https://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మార్కుల జాబితాలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ మనమిత్రలో కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్కుల జాబితాలను స్టడీ సెంటర్ల ద్వారా ఫలితాలు విడుదలైన వారం రోజుల్లో విడుదల చేస్తారు.
రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏపీ ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 26 నుంచి మే 5వ తేదీ వరకు ప్రతి సబ్జెక్టుకు రూ.200చొప్పున ఫీజుచెల్లించాల్సి ఉంటుంది. రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్