తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు.. సాధారణ భక్తులకు అందుబాటులో అదనపు సమయం

Best Web Hosting Provider In India 2024

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు.. సాధారణ భక్తులకు అందుబాటులో అదనపు సమయం

 

తిరుమలలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేసేలా వీఐపీ బ్రేక్ దర్శనాల్లో కీలక మార్పులు చేశారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుండటంతో బ్రేక్‌ దర్శనం వేళల్లో మార్పులు చేశారు.

 
తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం వేళల్లో మార్పు
 

తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల మార్పు అమల్లోకి వచ్చింది. గురువారం నుంచి బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు అమల్లోకి వస్తుంది. గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉదయం 5.30కు మొదలై ఉదయం 11 గంటల వరకు కొనసాగేవి. దీంతో ఆ సమయంలో మిగిలిన భక్తులకు ఎదురు చూపులు తప్పేవి కాదు. వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చింది.

 

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో చేసిన మార్పు గురువారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉదయం 5.30 గంటలకు మొదలై ఉదయం 11 గంటలకు ముగిసేవి.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి పాలక మండలి వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చారు. ఆ తర్వాత కూడా జనరల్‌ బ్రేక్‌ దర్శన భక్తులకు మాత్రం ఉదయం 8 నుంచి 10 గంటల్లోపు.. ఆ తర్వాత ప్రొటోకాల్‌, రెఫరల్‌, శ్రీవాణి, ఉద్యోగులకు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బ్రేక్‌ దర్శనాలు కల్పిస్తున్నారు.

కూటమి ప్రభుత్వంలో దర్శనాల తీరుపై సమీక్షించారు. సాధారణ భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లలో ఉండిపోతున్నారని గుర్తించారు. దీంతో బ్రేక్‌ దర్శనాల్లో మే ఒకటి నుంచి పూర్వపు విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

ప్రొటోకాల్‌, రిఫరల్‌, జనరల్‌ బ్రేక్‌ దర్శనాలను 7.30లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ కొత్త షెడ్యూల్స్‌ ఖరారు చేసింది.

వేసవి రద్దీ నేపథ్యంలో సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్‌ దర్శనాలను మే1 నుంచి రద్దు చేశారు. దీంతో వీఐపీల తాకిడికి అడ్డు కట్ట పడనుంది. దీంతో ఉదయం ఒక గంట, మధ్యాహ్నం గంటన్నర సమయం అదనంగా సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలు కుదురుతుందని అంచనా వేస్తున్నారు.

 

టీటీడీ దర్శనాలకు మారిన సమయాలు..

ఉదయం 5.45 : ప్రొటోకాల్‌ దర్శనం

6.30 : రిఫరెల్‌ ప్రొటోకాల్‌

6.45 : జనరల్‌ బ్రేక్‌ దర్శనం

10.15 : శ్రీవాణి(ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌)

10.30 : దాతలు

11.00 : టీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగులు, ఇకపై గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు బ్రేక్‌ దర్శనాలు ప్రారంభిస్తారు.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024