Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి మే 1 ఎపిసోడ్: చంద్రకళకు తెలిసిపోయిన వరదరాజు, శ్రీరాజ్ ప్లాన్- విరాట్‌ను బావ అని పిలిచిన చంద్ర- రఘురామ్ సలహా!
నిన్ను కోరి సీరియల్ మే 1 ఎపిసోడ్‌లో రెండు కుటుంబాల మధ్య గొడవలు రాకూడదు వాటి మూలంగా నువ్వు చంద్రకళ విడిపోకూడదు అని విరాట్‌కి రఘురామ్ సర్దిచెబుతాడు. చంద్రకళకి విరాట్ ఫోన్ చేసి సారీ చెబుతాడు. ఇద్దరు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. వరదరాజు, శ్రీ రాజ్ పగ చంద్రకళకు తెలిసిపోతుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాజ్‌ను చంద్ర కలవడంపై ఇంట్లో గొడవపెడతారు. కాబోయే శ్రీవారికి జ్వరం అని తెలియగానే వెల్లి పాద సేవ చేసింది అని శ్రీరాజ్ అంటాడు. సంజాయిషీలు సమర్థింపులు చాలు. ఇక మనకి వాళ్లకు సరిపడదని నా అభిప్రాయం. మనం తిరిగి ఊరేళ్లిపోవడమే దీనికి పరిష్కారం అని వరదరాజులు అంటాడు.
ఆవేశం ఒక్కటే
దాంతో చంద్రకళ షాక్ అవుతుంది. వాళ్లు తెంచుకుని వెళ్లిపోతారని ఎన్నిసార్లు అని భరిస్తాం అమ్మ అని మరోవైపు తల్లితో అంటాడు విరాట్. ఆ భయంతో వాళ్లకు అన్ని తెలిసి చేస్తున్నారేమో అనిపిస్తుందని క్రాంతి అంటాడు. దాంతో విరాట్ తల్లి వారిస్తుంది. నీకు ఉన్నది ఆవేశం ఒక్కటే. ఇదంతా శ్రీరాజ్ తన ఆవేశంతో చేశాడా వ్యాపారం దెబ్బతీయాడని చేశాడా. నువ్వేం నమ్ముతున్నావ్ చెప్పు అని తల్లి అంటుంది.
ఆరోజు వరదరాజులు మారాడని నువ్వు నమ్మావనే కదా ఇక్కడికి వచ్చింది అని తల్లి అంటుంది. ఆ నమ్మకం ఏమైంది. నన్ను నమ్మి ఇప్పుడు అడుగడుగునా అవమానిస్తే ఎలా అని వరదరాజులు అంటాడు. వాళ్లకు కావాల్సింది చంద్ర మాత్రమే మిగతదంతా నాటకమే అని శ్రీరాజ్ అంటాడు. అన్నీ భరించాలిరా అని కొడుకుకు సర్దిచెబుతుంది తల్లి.
కలిసి ఉండాలి
మరోవైపు పెదనాన్నకి చంద్రకళ సర్దిచెప్పుతుంది. ఇక చంద్రకళ మీద కోప్పడినందుకు విరాట్ ఫీల్ అవుతుంటాడు. అప్పుడే గదిలోకి వెళ్లిన తండ్రి రఘురామ్ సర్దిచెబుతాడు. చంద్రకళ వల్లే శ్రీరాజ్ బావను ఆఫీస్‌లో చేర్చుకున్నట్లు నిందించాను అని ఫీల్ అవుతాడు విరాట్. దాంతో ఎన్ని గొడవలు అయినా కలిసి ఉండాలని, రేపు నీకు చంద్రకి పెళ్లి జరగాలి, అలాగే మీ అమ్మ కోరిక మేరకు రెండు కుటుంబాలు కలవాలి అని రఘురామ్ అంటాడు.
మీ అమ్మ గురించైనా ఆలోచించి ఈ గొడవ ఇక్కడితో వదిలేసేయ్ అని విరాట్‌కు రఘురామ్ సలహా ఇస్తాడు. దాంతో విరాట్ కాంప్రమైజ్ అవుతాడు. మరోవైపు విరాట్ కోప్పడినందుకు చంద్రకళ బాధపడుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకోగలను విరాట్ సర్ అనుకుంటుంది. ఇంతలో విరాట్ కాల్ చేయడంతో తెగ సంబరపడిపోతుంది చంద్రకళ.
కాబోయే భార్యనే కదా
విరాట్ సర్ అని చంద్రకళ అనగానే సారీ చెబుతాడు విరాట్. ఆఫీస్‌లో డిస్టర్బెన్స్ కారణంగా నీ మీద అరిచాను. నీ మీద చేయెత్తాను. తప్పు చేశాను. క్షమించమంటాడు విరాట్. మనలో మనకేంటీ సారీ. నేను మీకు కాబోయే భార్యనే కదా. అన్ని హక్కులు మీకు ఉన్నాయి అని చంద్రకళ అంటుంది. గొడవ జరిగింది మనసులో ఏం పెట్టుకోవద్దు అని చంద్రకళ అంటుంది.
మా అన్నయ్య చేసింది తప్పే అని విరాట్‌తో చంద్రకళ అంటుంది అలా మాట్లాడుకుంటూ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. అన్నీ అంటావ్ కానీ బావ అని మాత్రం అనవు అని విరాట్ అంటే.. బావ అని పిలుస్తుంది చంద్రకళ. దాంతో విరాట్ సంబరబడిపోతాడు. ఏయ్ ఏమన్నావ్ అని అడుగుతాడు. పిలవమన్నారుగా విరాట్ సర్ పిలిచాను అని చంద్రకళ అంటే.. ఏయ్ రాక్షసి ఎంతలా ఆడుకుంటున్నావే అని విరాట్ అంటాడు.
అగ్గి రాజేసినట్లు చేశా
పెళ్లి చేసుకుని ఒకటవ్వడం రెండు కుటుంబాల గురించి అలాగే తమ పెళ్లి గురించి ఆలోచించి కలిసి ఉండాలని విరాట్ చంద్రకళ అనుకుంటారు. మరోవైపు వరదరాజులు, శ్రీరాజు ఇద్దరూ గదిలో మాట్లాడుకుంటారు. మీరు చెప్పినట్టే ఆఫీసులో పెద్ద అగ్గి రాజేసిన్నట్టు చేశాను నాన్న, నా కాలర్ పట్టుకుంటే పట్టుకున్నాడు కానీ మనం ఊహించిన దాని కంటే ఎక్కువే గొడవ అయింది అని శ్రీరాజ్ అంటాడు.
రెండు కుటుంబాలు విడిపోవడానికి ఎక్కువ టైం లేదని వరదరాజులుతో శ్రీరాజ్ చెబుతాడు. ఇదంతా చంద్రకళ వింటుంది. పెద్దనాన్న ప్రేమతో రాలేదు పగతో వచ్చాడు, రెండు కుటుంబాలని విడగొట్టడానికి వచ్చాడు అని షాక్ అవుతుంది చంద్రకళ.
అఘాయిత్యానికి పాల్పడ్డాడా?
నేను రెండు కుటుంబాలు కలిసి వసుదైక కుటుంబం అవుతుందేమో అనుకున్నాను. కానీ, పెద్దనాన్న ఇంత ఆఘాయిత్యానికి పాల్పడ్డాడా, అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారా అని చంద్రకళ అనుకుంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.