ఆ డైలాగ్ తో కాంట్రవర్సీ.. కన్నప్ప టీమ్ హర్ట్.. సారీ చెప్పిన శ్రీ విష్ణు.. మూవీ నుంచి సీన్స్ కట్

Best Web Hosting Provider In India 2024

ఆ డైలాగ్ తో కాంట్రవర్సీ.. కన్నప్ప టీమ్ హర్ట్.. సారీ చెప్పిన శ్రీ విష్ణు.. మూవీ నుంచి సీన్స్ కట్

సింగిల్ మూవీతో మరోసారి ఫ్యాన్స్ ను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యారు శ్రీ విష్ణు. అయితే ఆయన లేటెస్ట్ మూవీలోని ఓ డైలాగ్ కాంట్రవర్సీకి దారితీసింది. శ్రీ విష్ణు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

 
శ్రీ విష్ణు

వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు హీరో శ్రీ విష్ణు. ‘సింగిల్’ మూవీతో ఫ్యాన్స్ ను మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ కామెడీ గా వస్తున్న ఈ మూవీ మే 9న రిలీజ్ కాబోతోంది. అయితే రిలీజ్ కు ముందు ఈ మూవీ విడుదల చేసిన ట్రైలర్ కాంట్రవర్సీకి కారణమైంది. హీరో శ్రీ విష్ణు తాజాగా సారీ చెప్పారు.

 

ఆ డైలాగ్ తో వివాదం

ఏప్రిల్ 28న సింగిల్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరో, రొమాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని మూవీస్, మీమ్స్ రిఫరెన్స్ తీసుకున్నారు. ఇందులో భాగంగానే ‘శివయ్యా’ అనే డైలాగ్ ను వాడుకున్నారు.

కన్నప్ప హర్ట్

‘కన్నప్ప’ మూవీలో హీరో మంచు విష్ణు ‘శివయ్యా’ అనే డైలాగ్ చెప్పారు. విష్ణు చెప్పిన ఈ డైలాగ్ పై విపరీతమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ డైలాగ్ ను సింగిల్ మూవీలో శ్రీ విష్ణు కామెడీగా వాడారు. దీనిపై మంచు విష్ణు, కన్నప్ప టీమ్ హర్ట్ అయింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీ విష్ణు సారీ చెప్పారు.

‘‘మా సింగిల్ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ట్రైలర్ లోని కొన్ని డైలాగ్స్ కు కన్నప్ప టీమ్ హర్ట్ అయిందని తెలిసింది. మేం కావాలని అలా చేయలేదు. అది తప్పుగా అర్థమైంది. వెంటనే మేం ఆ సంబంధిత సీన్స్ ను తొలగించాం. సినిమాలో కూడా అవి ఉండవు. సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్, వేరే హీరోల మూవీస్ లోని సీన్స్ ను రిఫరెన్స్ గా తీసుకున్నాం. ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే సారీ. ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం. ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు’’ అని వీడియోలో శ్రీ విష్ణు తెలిపారు.

 

ఇద్దరు భామలతో

సింగిల్ మూవీలో శ్రీ విష్ణు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. కేతిక శర్మ, ఇవానా ఇందులో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రెండింగ్ టాప్-2లో కొనసాగుతోంది. ఈ మూవీకి కార్తీక్ రాజు డైరెక్టర్. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. గీత ఆర్ట్స్ ప్రోడ్యూస్ చేసింది.

 

Best Web Hosting Provider In India 2024