రూ.500 కోట్ల రూపాయల విలువైన పెళ్లి నెక్లెస్‌తో మళ్లీ దర్శనమిచ్చిన అంబానీ చిన్న కోడలు రాధికా మర్చెంట్

Best Web Hosting Provider In India 2024

రూ.500 కోట్ల రూపాయల విలువైన పెళ్లి నెక్లెస్‌తో మళ్లీ దర్శనమిచ్చిన అంబానీ చిన్న కోడలు రాధికా మర్చెంట్

Haritha Chappa HT Telugu

రాధికా మర్చంట్ లేత రంగు లెహంగాలో, తన వెడ్డింగ్ నెక్లెస్ లో దర్శనమిచ్చింది. ఆమె మెడలో ఉన్న డైమండ్ జువెలరీ, మచ్చలేని అందం ఆమె ఇంకెంతో ఆకర్షణీయంగా కనిపించే చేస్తున్నాయి. ముకేష్ అంబానీ చిన్నకోడలు వేసుకున్న రాణి హారం ఖరీదు అయిదు వందల కోట్ల రూపాయలు.

రాధిక మర్చెంట్ (Instagram)

రాధికా మర్చంట్ తన లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్ లో గ్లామర్ తో అదరగొడుతోంది. అంబానీల ఛోటీ బాహు తన బోల్డ్, ఓవర్ ది టాప్ స్టైల్స్, అందమైన యాక్సెసరీలతో ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అంబానీల అప్‌డేట్స్ పంచుకోవడానికి ప్రసిద్ధి చెందిన ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీలో రాధిక రాయల్ ప్రిన్సెస్ లా కనిపించే కొన్ని అద్భుతమైన చిత్రాలను పోస్టు చేసింది.

రాధికా మర్చంట్ గ్లామర్ ఎథ్నిక్ లుక్

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కోడలు రాధికా మర్చెంట్. అందాల ముద్దుగుమ్మ. ఈమె పెళ్లికి వేసుకున్న నెక్లెస్ గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. ఆమె ధరించిన రాణి హారం ధర దాదాపు అయిదు వందల కోట్లు ఉంటుందని అంచనా. మళ్లీ రాణి హారాన్ని ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది రాధికా.

స్కూప్ నెక్ లైన్, క్రాప్డ్ హెమ్ లైన్ తో కూడిన లేత ఆకుపచ్చ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రాధిక అద్భుతంగా కనిపిస్తోంది. ఆ బ్లౌజ్ పై క్లిష్టమైన గోల్డెన్ సీక్విన్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది.

ఆమె బ్లౌజ్ ను మెరిసే లెహంగా స్కర్ట్ తో జత చేశారు. ఈ కాంబినేషన్ అదిరిపోయింది. వెడల్పాటి వెండి అంచులతో సరిపోయే ఆర్గాంజా దుపట్టాను అందంగా కప్పి, భుజానికి ఒక వైపు బిగించి… గ్రేస్, అధునాతనత కలిపిన పరిపూర్ణమైన ఫినిషింగ్ టచ్ ను ఇచ్చింది.

ఆమె డ్రెస్సు కన్నా రాధికా ధరించిన రాణి హారంపైకే మగువల మనసు వెళ్లిపోతుంది. అంబానీల ఇంట్లో ప్రతి ఒక్కరికీ కోట్ల ఖరీదైన నగలు ఉన్నాయి. అదే వారసత్వంగా రాధికా కూడా కోట్ల విలువైన నగలను ధరిస్తోంది.

ఖరీదైన ఆభరణాలు లేకుండా ఏ అంబానీ కోడలు లుక్ పూర్తి కాదు. రాధిక తన వివాహం రోజున ధరించిన అద్భుతమైన ఆకుపచ్చ ఎమరాల్డ్ తో, స్టేట్ మెంట్ పెండెంట్ తో కూడిన అతి విలువైన స్టెప్ డైమండ్ నెక్లెస్ ను ధరించింది. ఆమె భుజాల మీద అందంగా మెరిసిన జుమ్కా చెవిపోగులు అందాన్ని రెట్టింపు చేశాయి. గాజులు ఆమె మణికట్టును అలంకరించగా, ఆమె వేలిపై వజ్రపు ఉంగరం మెరిసింది.

న్యూడ్ ఐషాడో, ఐలైనర్, మస్కారా పూత పూసిన కనురెప్పలు, కోహ్ల్ రిమ్డ్ కళ్లు, ఎర్రబడిన బుగ్గలు, ప్రకాశవంతమైన హైలైటర్, నిగనిగలాడే పింక్ లిప్ స్టిక్ షేడ్ తో ఆమె మేకప్ లుక్ ఆకట్టుకుంటోంది. మిడిల్ పార్ట్ జడ హెయిర్ స్టయిల్ లో తన అందచందాలతో అద్బుతంగా కనిపిస్తోంది.

రాధిక మర్చంట్ గురించి

2024 జూలైలో, వీరేన్, శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్ అనంత్ అంబానీని వివాహం చేసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన వీరి వివాహ వేడుకకు అంతర్జాతీయ సెలబ్రిటీలు, హాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/
Source / Credits

Best Web Hosting Provider In India 2024