




Best Web Hosting Provider In India 2024

ఏపీ ఐఎండీ రెయిన్ అలర్ట్ – ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన…!
ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రేపు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడొచ్చని పేర్కొంది.
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఎండ తీవ్రత ఉండగా… మరోవైపు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే శుక్రవారం(మే 2) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు…
విశాఖపట్నం,అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్ష సూచన నేపథ్యంలో…. ప్రజలు చెట్ల క్రింద నిలబడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రేపు ఉష్ణోగ్రతలు 41-42.5°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ ప్రకాశం జిల్లా దరిమడుగులో 42.4°C, వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో 42.1°C, అన్నమయ్య జిల్లా పూతనవారిపల్లె41.3°C,చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలని… లేదా గొడుగు ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలోనూ వర్షాలు – హెచ్చరికలు జారీ:
తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది. ఇవాళ మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడకక్కడ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు (మే 2) ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాజ్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాణయపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
టాపిక్