




Best Web Hosting Provider In India 2024

హే రంగులే సాంగ్ లిరిక్స్.. అమరన్ మూవీలోని సూపర్ హిట్ మెలోడీ.. యూట్యూబ్‌లో పది కోట్ల వ్యూస్
హే రంగులే అంటూ వచ్చిన అమరన్ మూవీలోని సాంగ్ ఎంతలా యువతను ఊపేసిందో మనకు తెలుసు. శివకార్తికేయన్, సాయి పల్లవి మధ్య సాగే ఈ రొమాంటిక్ మెలోడీ మనసుకు హత్తుకునేలా ఉంది. మరి ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.
అమరన్.. గతేడాది దీపావళికి రిలీజై సంచలన విజయం సాధించిన తమిళ మూవీ. తెలుగులోనూ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలోని హే రంగులే అనే పాట కూడా అంతే ఆదరణ సంపాదించింది. యూట్యూబ్ లో పది కోట్ల వ్యూస్ సొంతం చేసుకోవడానికి దగ్గరవుతున్న ఈ పాట లిరిక్స్ ఇక్కడ మీకోసం ఇస్తున్నాం.
హే రంగులే సాంగ్ సూపర్ హిట్
అమరన్ మూవీలోని హే రంగులే లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికే సుమారు పది కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్ 7న ఈ పాట రిలీజైంది. అప్పటి నుంచీ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూనే ఉంది. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశాడు. ఇక అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు.
శివకార్తికేయన్, సాయి పల్లవిపై రూపొందించిన సూపర్ హిట్ రొమాంటిక్ మెలోడీ ఇది. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన అమరన్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
హే రంగులే సాంగ్ లిరిక్స్
హే రంగులే.. రంగులే
హే రంగులే.. రంగులే
నీ రాకతో లోకమే రంగులై పొంగెనే
వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకసం అందెనే
స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందనీ సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం
చరణం
సమయానికీ.. తెలిపేదెలా
మనవైపు రారాదనీ దూరమై పొమ్మని
చిరుగాలినీ.. చిరుగాలిని
నిలిపేదెలా.. నిలిపేదెలా
మన మధ్యలో చేరుకోవద్దనీ
పరిచయం అయినది
మరో సుందర ప్రపంచం నువుగా
మధువనం అయినది
మనస్సే చెలి చైత్రం జతగా
కలగనే వెన్నెల సమీపించెను నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా
హే రంగులే.. రంగులే
హే రంగులే.. రంగులే
నీ రాకతో లోకమే రంగులై పొంగెనే
హే వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకసం అందెనే
స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం
సంబంధిత కథనం