





Best Web Hosting Provider In India 2024

రెట్రో మూవీ రివ్యూ.. కృష్ణుడి పాదాలతో పుట్టిన గ్యాంగ్‌స్టర్ లవ్ యాక్షన్ థ్రిల్లర్.. సూర్య, పూజా హెగ్డే హిట్ కొట్టారా?
తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడీ కట్టిన తొలి సినిమా రెట్రో. కోలీవుడ్ పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన రెట్రో ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి భారీ అంచనాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో నేటి రెట్రో రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: రెట్రో
నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం, బేబీ అవని, శ్వాసిక, కరుణాకరన్, సుజిత్ శంకర్ తదితరులు
కథ, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: షఫీక్ మహ్మద్ అలీ
నిర్మాతలు: సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్
విడుదల తేది: మే 1, 2025
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువా తర్వాత నటించిన సినిమా రెట్రో. ఆచార్య, కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, దేవా వంటి ఫ్లాప్స్ తర్వాత పూజా హెగ్డే చేసిన సినిమా రెట్రో. ఫ్లాప్‌లో ఉన్న సూర్య, పూజా హెగ్డె కలిసి జోడీ కట్టిన సినిమా రెట్రో. ఈ సినిమాకు తమిళ పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
ఎన్నో అంచనాలు నెలకొన్న రెట్రో మూవీ ఇవాళ (మే 1) వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉంది?, సూర్య, పూజా హెగ్డే కలిసి హిట్ కొట్టారా? లేదా? అనేది నేటి రెట్రో మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
పారి కన్నన్ (సూర్య) పెంచిన తండ్రి తిలక్ (జోజు జార్జ్) దగ్గర హింసాత్మకమైన గ్యాంగ్‌స్టర్. అయితే, రుక్మిణి (పూజా హెగ్డే)తో పారి కన్నన్ ప్రేమలో పడతాడు. రౌడీయిజం మానేసి రుక్మిణిని పెళ్లి చేసుకుంటానని పారి కన్నన్ ఆమెకు మాటిస్తాడు. కానీ, తనను పెంచిన తండ్రి తిలక్ చంపడానికి ప్రయత్నించే క్రమంలో మళ్లీ గ్యాంగ్‌స్టర్ అవుతాడు. దాంతో రుక్మిణితో పెళ్లి ఆగిపోతుంది. పారి జైలుకు వెళ్తాడు.
ఆ తర్వాత పారి, రుక్మిణి ప్రేమ ఏమైంది? పారిని తిలక్ ఎందుకు చంపాలనుకున్నాడు? అండమాన్ దీవిలో రుక్మిణి ఎందుకు ఉంది? పారి కన్నన్ అసలు తల్లిదండ్రులు ఎవరు? పారి ఉదరంపై కృష్ణుడి పాదాలు ఎందుకు ఉన్నాయి? జడముని ఎవరు? అతని రాక కోసం అండమాన్ దీవిని తన గుప్పిట్లో పెట్టుకున్న రాజ్ వేల్ (నాజర్) ఎందుకు ఎదురుచూస్తున్నాడు? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే రెట్రో మూవీని చూడాల్సిందే.
విశ్లేషణ:
రెట్రో మూవీ ఒక 70-80 కాలల మధ్య జరుగుతుంది. గ్యాంగ్‌స్టర్, లవ్ డ్రామాగా తెరకెక్కిన రెట్రోలో చాలా లేయర్స్ ఉన్నాయి. చూస్తే ప్రేమకోసం పోరాడే పారి కన్నన్ కథలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ, పారి కన్నన్ పుట్టుక, దాని రహస్యం వంటి అంశాలతో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే, అవన్నీ సెకండాఫ్‌లో వచ్చిన కాస్తా ల్యాగ్ కలిగిన ఫీలింగ్ కలుగుతుంది.
రెట్రో ఫస్టాఫ్ మాత్రం రేసీగా చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. పారి కన్నన్ క్యారెక్టరైజేషన్, రుక్మిణితో లవ్ ట్రాక్, పారి తిలక్ రిలేషన్‌షిప్ అంశాలతో బాగుంటుంది. రుక్మిణితో లవ్ ట్రాక్ ఇంకాస్తా ఫీల్ తెచ్చేలా ఉంటే బాగుండనిపించింది. తర్వాత పారిని తిలక్ చంపించేందుకు ప్రయత్నించడం, పారి జైలు పాలు అవడం, ఐదేళ్ల తర్వాత అక్కడి నుంచి పారిపోయి రుక్మిణి కోసం వెతకడం వంటివి బాగున్నా ఇదివరకు చూసిన స్టోరీలా అనిపిస్తుంది.
గెస్ చేసే ట్విస్ట్
అయితే, కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ మాత్రం బాగుంటుంది. రుక్మిణి కోసం సూర్య చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో తానేంటో తెలుసుకునే సీన్స్ బాగున్నాయి. కొంచెం బోరింగ్ ఫీల్ తెప్పిస్తాయి. కానీ, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. అయితే, ఈలోపే ఆ ట్విస్ట్‌ను ఆడియెన్స్ గెస్ చేసేలా ఉంటుంది. ఇక యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. స్క్విడ్ గేమ్ తరహాలో ఉండే ప్రాణాంతక గేమ్స్ ఆకట్టుకుంటాయి. సంతోష్ నారాయణ్ బీజీఎమ్, సంగీతం అయితే నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.
సినిమాటోగ్రఫీ, 70, 80స్ కాలం తరహాలో వరల్డ్ బిల్డింగ్, విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక సూర్య యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు. హింసాత్మక గ్యాంగ్‌స్టర్‌గా, భర్తగా రెండు వేరియేషన్స్‌తో అదరగొట్టాడు. అలాగే, బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. రుక్మిణి పాత్రకు సరిగ్గా న్యాయం చేసింది. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఆకట్టుకున్నారు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ బాగుంది. ఫైనల్‌గా చెప్పాలంటే సింపుల్ లవ్ స్టోరీలా కనిపించే రెట్రోలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సూర్య, పూజా హెగ్డే యాక్టింగ్, యాక్షన్ సీన్స్, డిఫరెంట్ వరల్డ్ బిల్డింగ్ కోసం రెట్రో మూవీపై లుక్కేయొచ్చు. మరి సూర్య, పూజా హెగ్డే కలిసి హిట్ కొట్టారా లేదా అనేది బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై, ఆడియెన్స్ రెస్పాన్స్‌పై ఆధారపడి ఉంది.
రేటింగ్: 2.5/5
సంబంధిత కథనం