జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం.. ఓటరు స్లిప్‌లోనూ పెద్ద మార్పు!

Best Web Hosting Provider In India 2024


జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం.. ఓటరు స్లిప్‌లోనూ పెద్ద మార్పు!

Anand Sai HT Telugu

జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అనుసంధానం చేయనుంది. దీనికోసం భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి సమాచారాన్ని తీసుకోనుంది.

కేంద్ర ఎన్నికల సంఘం

కొన్నిసార్లు ఓటింగ్ రోజున బూత్ గురించి సమాచారం పొందడంలో గందరగోళానికి గురవుతారు. లేదా బూత్ లోపల ఉన్న ఓటింగ్ గది సంఖ్య గురించి సమాచారం పొందలేకపోవచ్చు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఓటరు స్లిప్ వచ్చినప్పుడు అది మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది. సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ పెద్ద అక్షరాలతో అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఎలాంటి గందరగోళాన్ని ఎదుర్కోకుండా ఉండటానికి ఈ నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది.

జనన, మరణ రికార్డులతో అనుసంధానం

దీనితోపాటుగా జనన, మరణ రికార్డులతో ఓటర్లు జాబితాను అనుసంధానం చేయనున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత రిజిస్ట్రార్ జనరల్ నుండి మరణ ధృవీకరణ పత్రం తీసుకొని చనిపోయిన ఓటరు పేరును తొలగించడానికి ఎన్నికల సంఘం కొత్త ప్రక్రియను ప్రారంభించింది. ఇది మెుత్తం ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటుంది.

ఇప్పుడు ఓటరు పేరును మరణం తర్వాత సులభంగా తొలగించవచ్చు. భారత రిజిస్ట్రార్ జనరల్ నుండి ఎలక్ట్రానిక్ రూపంలో నేరుగా మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని మరణించిన ఓటరు పేరును తొలగించే ప్రక్రియను ఈసీ ప్రారంభించబోతోంది. దీనితో పాటు ఓటరు నిర్ధారణ స్లిప్‌ను ఓటరుకు అనుకూలంగా మార్చాలని అనుకుంటుంది.

ఓటరు మరణానికి సంబంధించిన సమాచారం త్వరగా ఎన్నికల సంఘానికి చేరేలా మరణ ధృవీకరణ పత్రం డేటాను నేరుగా ఎలక్ట్రానిక్‌గా తీసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా, ఓటరు మరణాన్ని బీఎల్‌ఓలు క్షేత్ర సందర్శనల ద్వారా ధృవీకరిస్తారు. దీని తరువాత ఓటరు జాబితాను అప్డేట్ అవుతుంది.

బీఎల్ఓలకు ఫొటో గుర్తింపు కార్డు

ఇప్పటివరకు మరణం సంభవించినప్పుడు ఫారం 7 నింపిన తర్వాత బీఎల్ఓ ఓటరు మరణాన్ని ధృవీకరించేవారు. దీనికి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు భారత రిజిస్ట్రార్ జనరల్ నుండి నేరుగా సమాచారం పొందిన తర్వాత మరణించిన ఓటరు పేరును ఓటరు జాబితా నుండి తొలగించే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించవచ్చు. ఓటరు సమాచార స్లిప్‌ను మరింత అనుకూలంగా మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్‌ను సులభంగా గుర్తించగలిగేలా ఓటు వేసే రోజున ఓటర్లకు ఇచ్చే స్లిప్‌లో సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ ప్రముఖంగా, పెద్దగా కనిపిస్తాయి. మొదటిసారిగా బీఎల్‌ఓలకు ఫోటో గుర్తింపు కార్డులను ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Anand Sai

eMail
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link