




Best Web Hosting Provider In India 2024

‘అమరావతి నగరం కాదు.. ఒక శక్తి’ – ఆ కలను మనమే నిజం చేయాలి – ప్రధాని మోదీ
అమరావతి పునః ప్రారంభం పనుల్లో భాగంగా పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ…. అమరావితి ఒక నగరం కాదని… ఒక శక్తి వంటిదని వ్యాఖ్యానించారు. అమరావతి ద్వారా ఒక గొప్ప స్వప్నం సాకారం కాబోతుందని చెప్పారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం తర్వాత గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ… అక్కడ్నుంచి సభా వద్దకు చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పలువురు మంత్రులు స్వాగతం పలికారు.
అమరావతి పునఃప్రారంభ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. మొదట తొలుగులో తన స్పీచ్ ను ప్రారంభించిన దుర్గా భవానీ అమ్మవారిని గుర్తు చేశారు. “అమరావతి అనేది ఒక నగరం మాత్రమే కాదు. సుమారు రూ. 60 వేల కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేశాం. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు… భవిష్యత్ వికాసిత్ భారత్ కు బాటలు వేస్తాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అభినందనలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీ తెలిపారు.
అమరావతి ఒక శక్తి – ప్రధాని
“ఇంద్రలోకానికి అమరావతి రాజధాని. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు. అమరావతి ఒక శక్తి. అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండు కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్, బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం ఇది. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉంది. ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు.
మనమే చేయాలి – ప్రధాని మోదీ
“2014లో అమరావతికి శంకుస్థాపన జరిగింది. గడిచిన పదేళ్లలో కేంద్రం నుంచి మద్దతు లభించింది. ఇక్కడ హైకోర్టు, రాజ్ భవన్, సచివాలయం వంటి భవనాలు నిర్మితమయ్యాయి. ఎన్టీఆర్ గారు వికాసిత్ ఏపీ గురించి కల కన్నారు. ఎన్టీఆర్ గారి కలలను మనమే నిజం చేయాలి” అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ మాట్లాడారు.
“ఏఐ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, విద్యా రంగాల్లో అమరావతి ముందు ఉంటుంది. ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనం. రికార్డు స్పీడ్‌లో పనులు పూర్తి చేయడానికి కేంద్రం సహకరిస్తుంది. అమరావతిలో మౌలిక సదుపాయల కోసం కేంద్రం సహకరించింది. అమరావతికి ఉన్న ఆటంకాలు తొలగిపోయి ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాకు టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు.. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించాను. వేగం, క్వాలిటీతో పనులు జరగాలంటే చంద్రబాబు లాంటి వ్యక్తితో సాధ్యమవుతుంది” అని ప్రదాని మోదీ ప్రశంసించారు.
సంబంధిత కథనం
టాపిక్