




Best Web Hosting Provider In India 2024

‘ఆ విషయంలో చంద్రబాబుని మించిన వారు లేరు’ – ప్రధాని మోదీ ప్రశంసలు
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో మాట్లాడిన ఆయన… ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు చేసే విషయంలో చంద్రబాబుని మించిన వారు లేరంటూ వ్యాఖ్యానించారు.
అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. ఐటీ విషయంలో చంద్రబాబు.. తనకంటే ముందు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఓ విషయాన్ని గుర్తు చేశారు.
టెక్నాలజీ గురించి తెలుసుకునేవాడిని – ప్రధాని మోదీ
“నేను గుజరాత్ సీఎంగా ఉండగా, నాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించాను. టెక్నాలజీ, ఐటీ విషయంలో నాడు చంద్రబాబు గారు చూపించిన చొరవ నిశితంగా తెలుసుకునే వాడిని. అప్పుడు తెలుసుకున్న విషయాలు ఈ రోజు మీ ముందు చేయగలుగుతున్నాను. అలాంటి అవకాశం నాకు లభించింది” అని ప్రధాని మోదీ చెప్పారు.
“నా అనుభవంతో చెప్తున్నా, ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు చేయలన్నా, వేగంగా చేయలన్నా, క్వాలిటీతో చేయలన్నా చంద్రబాబుని మించి వారు లేరు” అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
“అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున నేను ఏపీకి వస్తున్నాను.. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు నేను యోగా దినోత్సవం రోజున ఏపీలో పర్యటిస్తాను. వచ్చే 50 రోజులు ఏపీలో యోగాకు సంబంధించిన విస్తృత కార్యక్రమాలు జరగాలి” అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
సాగు నీరుకు ఇబ్బంది లేకుండా నదుల అనుసంధానం చేస్తున్నామని ప్రదాని మోదీ అన్నారు. “రైతులకు ఎలాంటి సమస్య ఉండకూడదనేది మా లక్ష్యం.. పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయి. శ్రీహరికోట నుంచి జరిగే ప్రయోగాలు దేశం మొత్తాన్ని గర్వపడేలా చేస్తాయి. మన ఆయుధాలే కాదు ఐకమత్యమే మన బలం” అని ప్రధాని మోదీ ప్రసంగించారు.
సంబంధిత కథనం
టాపిక్