





Best Web Hosting Provider In India 2024

హృదయం లోపల సాంగ్ లిరిక్స్.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ నుంచి అనిరుధ్ అదిరిపోయే మెలోడీ.. మళ్లీ మళ్లీ వింటూనే ఉంటారు
విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ నుంచి హృదయం లోపల అనే సాంగ్ శుక్రవారం (మే 2) రిలీజైన విషయం తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట ఇన్స్టాంట్ హిట్ గా నిలిచింది. మరి ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.
కింగ్డమ్ (Kingdom) మూవీ నుంచి వచ్చిన హృదయం లోపల సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ సింగిల్ వినగానే ఆకట్టుకునేలా సాగింది. అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేయడంతోపాటు స్వయంగా పాడాడు. రానున్న రోజుల్లో ఈ సాంగ్ యూత్ ను బాగా అట్రాక్ట్ చేసేలా ఉంది.
హృదయం లోపల సాంగ్
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన మూవీ కింగ్డమ్. మే 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. టీజర్ తోనే మూవీపై అంచనాలు భారీగా పెరగగా.. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సింగిల్ హృదయం లోపల వాటిని మరో లెవెల్ కు తీసుకెళ్లింది.
ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశాడు. అతడే అనుమిత నదేశన్ తో కలిసి పాడాడు. ఈ పాటను కృష్ణకాంత్ రాశాడు. మరి ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ పాడటానికి ట్రై చేయండి.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ త్రయం చేతులు కలిపితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘హృదయం లోపల’ పాట ఉంది
హృదయం లోపల సాంగ్ లిరిక్స్
ఏదో ఏదో గమ్మత్తుల.. ఏంటీ కల.. ఏంటీ కల
ఏదో ఏదో అయ్యేంతలా.. ఉప్పొంగే అల.. ముంచేనిలా
ఏవైపు పోనే పోనీ వీలే లేని దారే ఇదా.. అయినా ఆగే పోదు కదా..
చెప్పలేని ఇష్టమిదా ఇష్టమిదా.. ఏంటి కథా
చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే
దూకేశా అందుట్లో ఏముంది నాతప్పే
తూటాలా వర్షాన.. పువ్వేదో పూసేనా
లోకంకే చాటేనా…
హృదయం లోపల.. కదనం జరిగెనా..
హృదయం లోపల.. కదనం జరిగెనా..
హృదయం లోపలా.. కదనం జరిగెనా..
ఏదో ఏదో గమ్మత్తులా.. ఏంటీ కల.. ఏంటీ కలా
ఏదో ఏదో అయ్యేంతలా.. ఉప్పొంగే అల.. ముంచేనిలా
ఏవైపు పోనే పోనీ వీలే లేని దారే ఇదా.. అయినా ఆగే పోదు కదా..
చెప్పలేని ఇష్టమిదా ఇష్టమిదా.. ఏంటి కథా
చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే
దూకేశా అందుట్లో ఏముంది నాతప్పే
తూటాలా వర్షాన.. పువ్వేదో పూసేనా
లోకంకే చాటేనా..
హృదయం లోపల.. కదనం జరిగేనా..
సంబంధిత కథనం