





Best Web Hosting Provider In India 2024

యానిమల్ సక్సెస్ క్రెడిట్ మొత్తం సందీప్ వంగాదే.. ప్రోడ్యూసర్ కామెంట్లు వైరల్
సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా ‘యానిమల్’. ఇలాంటి మూవీ తీస్తారా? ఈ హింస, అశ్లీలం ఏంటీ అనే విమర్శలూ వచ్చాయి. కానీ మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఫిల్మ్ క్రెడిట్ మాత్రం డైరెక్టర్ దే అంటూ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. అశ్లీలత, హింసతో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ క్రెడిట్ పై ప్రొడ్యూసర్ భూషన్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ ఈ ఫిల్మ్ విజయానికి సందీప్ రెడ్డి వంగానే కారణమన్నారు.
డైరెక్టరే కారణం
యానిమల్ విజయానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే కారణమని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ అన్నారు.యానిమల్ విజయానికి ఎవరికి క్రెడిట్ ఇస్తారనే ప్రశ్నకు భూషణ్ సమాధానమిస్తూ.. ‘‘ఈ సినిమాపై సందీప్ కాన్ఫిడెన్స్ మరో లెవల్ లో ఉంది కాబట్టి దర్శకుడికే ఎక్కువ క్రెడిట్ ఇస్తా. ఇది ఒక విభిన్నమైన చిత్రం. నటుడు ఇలాంటి ప్రదర్శన చేయడానికి చాలా ఆసక్తి కనబరిచాడు. ఇది ఇంతకుముందెప్పుడూ చేయనిది. కానీ సినిమా ఎంత బాగా వర్కవుట్ అవుతుందో ఎవరికీ తెలియదు. తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది’’ అని చెప్పారు.
”ఈ రోజు మీరు ఎక్కడ చెక్ చేసినా రాబోయే చిత్రం యానిమల్ పార్క్ గురించి చర్చిస్తున్నారు. పూర్తిగా దర్శకుడి నమ్మకం వల్లే ఇది సాధ్యమైంది. ఆ క్రెడిట్ పూర్తిగా సందీప్ కే ఇస్తాను. ఫస్ట్ కట్ చూడగానే ఇది చాలా నిడివి ఉన్న సినిమా అని చెప్పాను కానీ సందీప్ మాత్రం ‘సార్ నన్ను ఏమీ కట్ చేయమని అడగకండి. ఇది గొప్ప వ్యాపారం చేస్తుందని నాకు చాలా నమ్మకం ఉంది. రూ.50 కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తుంది’ అన్నాడు’’ అని భూషణ్ తెలిపారు.
క్లిప్ వైరల్
సందీప్ రెడ్డి వంగాకు క్రెడిట్ ఇస్తూ నిర్మాత భూషణ్ కుమార్ వ్యాఖ్యలు చేసిన వీడియో క్లిప్ రెడ్డిట్ లో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ కూడా భూషణ్ కుమార్ కామెంట్లతో ఏకీభవిస్తున్నారు.
“అవును.. కచ్చితంగా. షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు వంగ. రణబీర్ కంటే ముందు రెండుసార్లు తానేంటో నిరూపించుకున్నాడు’’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘మూవీ ప్యూర్ వంగా షో’ అని మరొకరు పేర్కొన్నారు.
బ్లాక్ బస్టర్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా యానిమల్ లో రణ్ బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మంధానా, తృప్తి దిమ్రీ కీలక పాత్రలు పోషించారు. తండ్రి ప్రేమను కోరుకునే కొడుకు.. తన నాన్నను చంపాలనుకునే వాళ్లను ఎలా అంతం చేశాడన్నదే కథ.
ఈ సినిమా ఇండియాలో రూ.63.8 కోట్ల బంపర్ ఓపెనింగ్స్ రాబట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యానిమల్ పార్క్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం