రెండు ఓటీటీల‌లో ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు హార‌ర్ కామెడీ మూవీ – యాభై మిలియ‌న్ల స్ట్రీమింగ్ వ్యూస్‌తో రికార్డ్‌

Best Web Hosting Provider In India 2024

రెండు ఓటీటీల‌లో ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు హార‌ర్ కామెడీ మూవీ – యాభై మిలియ‌న్ల స్ట్రీమింగ్ వ్యూస్‌తో రికార్డ్‌

Nelki Naresh HT Telugu

తెలుగు హార‌ర్ కామెడీ మూవీ టుక్ టుక్ ఓటీటీలో అద‌ర‌గొడుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ టాప్ టెన్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది. అమెజాన్ ప్రైమ్‌ లో టుక్ టుక్ మూవీ యాభై మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న‌ది.

టుక్ టుక్ ఓటీటీ

తెలుగు హార‌ర్ కామెడీ మూవీ టుక్ టుక్ ఓటీటీలో అద‌ర‌గొడుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రెండు ఓటీటీల‌లో ట్రెండింగ్ ఉంటుంది. టాన్ టెన్ మూవీస్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది. అమెజాన్ ప్రైమ్‌ లో టుక్ టుక్ మూవీ యాభై మిలియ‌న్ల‌కుపైగా స్ట్రీమింగ్ మిన‌ట్ వ్యూస్‌ను ద‌క్కించుకొని రికార్డ్‌ను క్రియేట్ చేసింది. రీసెంట్ టైమ్‌లో ఓటీటీలో హ‌య్యెస్ట్ వ్యూస్‌ను ద‌క్కించుకున్నచిన్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

హార‌ర్ కామెడీ మూవీ…

ఈ హార‌ర్ కామెడీ మూవీలో కోర్ట్ ఫేమ్ హ‌ర్ష్ రోష‌న్‌, కార్తీకేయ దేవ్‌, స్టీవెన్ మ‌ధు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శాన్వీ మేఘ‌న, నిహాల్ కోదాటి హీరోహీరోయిన్లుగా క‌నిపించారు. సుప్రీత్ సీ కృష్ణ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది మార్చిలో టుక్ టుక్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. హార‌ర్ ఎలిమెంట్స్‌కు స్త్రీ స్వేచ్ఛ‌కు సంబంధించిన ఓ మెసేజ్‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు.

టీనేజ్ కుర్రాళ్ల క‌ష్టాలు…

రాయ‌ల‌సీమ‌లోని ఓ ప‌ల్లెటూరికి చెందిన ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ల షార్ట్‌ఫిల్మ్‌లు తీసి డ‌బ్బులు సంపాదించాల‌ని క‌ల‌లు కంటారు. షార్ట్‌ఫిల్మ్స్ తీయ‌డానికి ఓ కెమెరా కొనాల‌ని ప్లాన్ చేస్తారు. ఆ డ‌బ్బుల కోసం వినాయ‌క విగ్ర‌హం ఏర్పాటు పేరుతో చందాలు వ‌సూలు చేస్తారు. దేవుడి ఊరేగింపుకు బండి అవ‌స‌రం కావ‌డంతో పాత కాలం నాటి స్కూట‌ర్‌ను ఆటోలా అందంగా రీ మోడ‌లింగ్ చేస్తారు.

ఆ బండి రాక‌తో ముగ్గురి స్నేహితుల జీవితమే మారిపోతుంది. ఏదైనా కోరిక‌లు కోరుకుంటే అవి నెర‌వేరుతాయో లేదో హ్యాండిల్ అటూ ఇటూ ఉపుతూ బండి చెబుతుంటుంది. ఆ బండిలో దేవుడు ఉన్నాడంటూ ప్ర‌చారం చేస్తూ ముగ్గురు స్నేహితులు బాగా డ‌బ్బు సంపాదిస్తారు. ఈ క్ర‌మంలోనే ఆ బండిలో ఉంది దేవుడు కాదు…ఓ ఆత్మ అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది.

బండిలోని ఆత్మ కార‌ణంగా ముగ్గురు స్నేహితులు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు? ఆ ఆత్మ‌కు శిల్ప (శాన్వీ మేఘ‌న‌) అనే అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి? శిల్ప గురించి ఆ ముగ్గురు కుర్రాళ్లు సాగించిన అన్వేష‌ణ‌లో ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి? శిల్ప ను ప్రేమించిన న‌వీన్ (నిహాల్ కోదాటి) ఏమ‌య్యాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

క్లీన్ కామెడీ మూవీ…

ఎలాంటి డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, అశ్లీల స‌న్నివేశాలు లేకుండా క్లీన్ కామెడీ మూవీగా ద‌ర్శ‌కుడు టుక్ టుక్ మూవీని తెర‌కెక్కించాడు. ఈ సినిమా ర‌న్ టైమ్ రెండు గంట‌ల ప‌ది నిమిషాలే కావ‌డం గ‌మ‌నార్హం.

త‌మిళంలో హిట్‌…

టుక్ టుక్ మూవీలో హీరోయిన్‌గా న‌టించిన శాన్వీ మేఘ‌న గ‌తంలో తెలుగులో పుష్ప‌క విమానం, బిలాల్‌పూర్ పోలీస్ స్టేష‌న్‌, ప్రేమ విమానంతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. కుడుంబ‌స్థాన్ మూవీతో ఇటీవ‌లే త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ‌న్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఈ ఏడాది త‌మిళంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024