




Best Web Hosting Provider In India 2024

నేరుగా ఓటీటీలోకి తెలుగు మూవీ – అక్కినేని హీరోకు జోడీగా కాజల్ – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!
సుమంత్ హీరోగా నటించిన తెలుగు మూవీ అనగనగా థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ టీవీ విన్ ఓటీటీలో మే 15 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీలో కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
సుమంత్ హీరోగా నటించిన తెలుగు మూవీ అనగనగా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అనగనగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను శనివారం ఓ వీడియో ద్వారా ఈటీవీ విన్ అనౌన్స్‌చేసింది. మే 15న విడుదలకాబోతున్నట్లు ప్రకటించింది.
స్నేహం, ప్రేమ…ఓ చిన్న జ్ఞాపకం…
ఈ వీడియోలో సుమంత్ బుక్ చదువుతుండగా…అతడి కొడుకు ప్రశ్నలతో విసిగించడం కనిపించింది. ప్రతి కథ అనగనగాతో ఎందుకు మొదలవుతుంది. కనీసం ఈ ప్రశ్నకైనా సమాధానం చెప్పమని సుమంత్‌ను అతడి కొడుకు అడిగాడు. ఒక మంచి కథ…స్నేహం, ప్రేమ, లేదా ఓ చిన్న జ్ఞాపకాన్ని గుర్తుచేస్తుందని సుమంత్ సమాధానం ఇచ్చినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.
అయితే మన కథ కూడా చెప్పొచ్చుగా అని చిన్నారి అడగ్గా…సుమంత్ సరే అని బదులివ్వడం ఈ వీడియోలో ఆసక్తిని పంచుతుంది. సుమంత్… అనగనగా అని అనగానే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చూపించారు. మే 15 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.
టీచర్ పాత్రలో…
విద్యా వ్యవస్థకు సంబంధించిన మంచి మెసేజ్‌తో అనగనగా మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ మూవీలో ఇందులో సుమంత్ టీచర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. వ్యాస్ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.
కాజల్ చౌదరి…
అనగనగా మూవీకి సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనగనగా మూవీలో కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మిస్ యూనివర్స్ బీహార్ 2024గా కాజల్ చౌదరి ఇటీవలే ఎంపికైంది. సుమంత్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో సుమంత్, కాజల్ చౌదరితో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ విహార్ష్ , అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.
మళ్లీరావాతో కమ్ బ్యాక్…
కెరీర్ ఆరంభం నుంచి సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా హీరోగా డిఫరెంట్ మూవీస్ చేస్తోన్నాడు సుమంత్. కెరీర్ ఆరంభంలో గోదావరి, గోల్కొండ హైస్కూల్, సత్యం వంటి సినిమాలతో సక్సెస్‌లను అందుకున్నాడు సుమంత్. ఆ తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్న సుమంత్ మళ్లీ రావాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. కొన్నాళ్లుగా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తోన్నాడు సుమంత్. దుల్కర్ సల్మాన్ సీతారామంలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేశాడు. ధనుష్ సార్ సినిమాలో గెస్ట్‌గా కనిపించాడు.
డివోషనల్ థ్రిల్లర్…
ప్రస్తుతం సుమంత్ మహేంద్రగిరి వారాహి పేరుతో ఓ డివోషనల్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్