




Best Web Hosting Provider In India 2024

సూపర్‌హిట్ ఫాంటసీ థ్రిల్లర్ సీరియల్ తెలుగులో రీ టెలికాస్ట్ – ఖుష్బూ లీడ్ రోల్ – కోలీవుడ్ డైరెక్టర్ కథతో..
తెలుగు ఫాంటసీ థ్రిల్లర్ సీరియల్ నందిని మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మే 12 నుంచి జెమిని టీవీలో ఈ సీరియల్ రీ టెలికాస్ట్ కాబోతోంది. నిత్యారామ్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సీరియల్‌లో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటించింది.
సూపర్ నాచురల్ ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన నందిని సీరియల్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నందిని సీరియల్‌ను రీ టెలికాస్ట్ చేయబోతున్నట్లు జెమిని టీవీ ప్రకటించింది. మే 12 నుంచి ఈ సీరియల్‌ను జెమిని టీవీలో చూడొచ్చు.
రీ టెలికాస్ట్ డేట్‌ను ప్రకటించిన జెమిని టీవీ టైమ్‌ను మాత్రం రివీల్ చేయలేదు. మధ్యాహ్నం స్లాట్‌లోనే ఈ సీరియల్ ప్రసారమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిత్యారామ్ లీడ్ రోల్…
నందిని సీరియల్ తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. ట్విస్ట్‌లు, టర్న్‌లతో బుల్లితెర అభిమానులను మెప్పించింది. నందిని సీరియల్‌లో నిత్యారామ్ లీడ్ రోల్‌లో నటించింది. రాహుల్ రవి, మాళవికా వేల్స్, రియాజ్ ఖాన్, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
ఈ ఫాంటసీ సీరియల్‌లో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించింది. నందిని సీరియల్‌కు కోలీవుడ్ అగ్ర దర్శకుడు సుందర్ సి కథను అందించారు. రాజ్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ సీరియల్‌ను ఖుష్బూతో కలిసి సుందర్ సి ప్రొడ్యూస్ చేయడం గమనార్హం.
నందిని కథ…
నందిని, గంగ కవల పిల్లలు. నందిని నాగకన్యగా పెరగ్గా…గంగ మామూలు మనిషిలాగే ఉంటుంది. గంగకు అరుణ్‌తో పెళ్లవుతుంది. అరుణ్ తండ్రి రాజశేఖర్, భైరవి అనే మంత్రగత్తెతో కలిసి నాగ దేవతకు చెందిన కాలచక్రాలను దొంగిలిస్తాడు. ఆ కాల చక్రాలను వారి నుంచి నందిని ఎలా సొంతం చేసుకున్నది? సోదరి అయిన గంగను నందిని ఎందుకు ద్వేషించింది?
గంగను అడ్డుపెట్టుకొని నందిని చంపాలనుకున్న భైరవి ప్రయత్నం ఫలించిందా? నందిని సాయం చేసిన రంగనాయకి ఎవరు? గంగ, నందినిల తల్లి పార్వతి జీవితం ఎలా విషాదంగా ముగిసింది? పార్వతి భర్త భూపతి తన వేషం, పేరు మార్చుకొని బతకడానికి కారణం ఏంటి? అన్నదే ఈ సీరియల్ కథ.
977 ఎపిసోడ్స్…
నందిని సీరియల్ 2017లో మొదలై 2020లో ముగిసింది. మొత్తం 977 ఏపిసోడ్స్‌తో మేకర్స్ ఈ సీరియల్‌ను ఎండ్ చేశారు. నందిని సీరియల్‌కు సీజన్ 2 కూడా వచ్చింది. నందిని 2 ను కన్నడ హీరో రమేష్ అరవింద్ నిర్మించారు.
సంబంధిత కథనం