పూజా హెగ్డేకు మళ్లీ నిరాశే.. వరుసగా ఏడోది.. ఆ చిత్రంపైనే గంపెడాశలు!

Best Web Hosting Provider In India 2024

పూజా హెగ్డేకు మళ్లీ నిరాశే.. వరుసగా ఏడోది.. ఆ చిత్రంపైనే గంపెడాశలు!

పూజా హెగ్డేకు వరుసగా ప్లాఫ్‍లు ఎదురవుతున్నాయి. ఆశలు పెట్టుకున్న చిత్రాలు బోర్లాపడుతున్నాయి. తాజా రెట్రో కూడా ఈ బ్యూటీకి పరాజయాన్ని ఇచ్చింది. వరుసగా పూజాకు ఏడో ప్లాఫ్ ఎదురైంది.

పూజా హెగ్డేకు మళ్లీ నిరాశే.. వరుసగా ఏడోది.. ఆ చిత్రంపైనే గంపెడాశలు!

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు మూడేళ్లుగా కాలం కలిసి రావడం లేదు. వరుసగా ప్లాఫ్‍లు ఎదురవుతున్నాయి. డిజాస్టర్లే పలుకరిస్తున్నాయి. ఎన్నో అంచనాలతో వస్తున్న చిత్రాలు తీవ్రంగా నిరాశను మిగులుస్తున్నాయి. తాజాగా సూర్యతో కలిసి పూజా నటించిన రెట్రో కూడా ప్లాఫ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ బుట్టబొమ్మకు ఇది వరుసగా ఏడో ప్లాఫ్‍గా ఉంది.

రాధేశ్యామ్ నుంచి..

పూజా హెగ్డే ప్లాఫ్‍ల పరంపర 2022లో ‘రాధేశ్యామ్‍’తో మొదలైంది. ప్రభాస్‍కు జోడీగా ఆ చిత్రంలో పూజా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఆ మూవీ నిరాశపరిచింది. అదే ఏడాది ‘ఆచార్య’ రూపంలో పూజాగా మరో డిజాస్టర్ ఎదురైంది. ఆ తర్వాత తమిళం, హిందీకే ఈ భామ పరిమితమయ్యారు. అదే ఏడాది దళపతి విజయ్‍ సరసన పూజా హెగ్డే నటించిన తమిళ మూవీ ‘బీస్ట్’ కూడా డిజాస్టర్ అయింది. పూజా చేసిన హిందీ సినిమా ‘సర్కస్’ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

సల్మాన్ ఖాన్‍తో కలిసి పూజా హెగ్డే నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రం 2023లో వచ్చింది. ఈ సినిమా కమర్షియల్‍గా దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. 2024లో పూజా చేసిన ఏ మూవీ విడుదల కాలేదు.

రెట్రోతో.. వరుసగా ఏడో ప్లాఫ్

2025లోనూ పూజా హెగ్డే అదృష్టం మారలేదు. షాహిద్ కపూర్ సరసన ఈ బ్యూటి చేసిన దేవా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది. తాజాగా సూర్యకు జోడీగా పూజా నటించిన రెట్రో చిత్రం ఈ గురువారం (మే 1) విడుదలైంది. ఈ సినిమాలో డీగ్లామరస్ పాత్ర చేశారు ఈ బ్యూటీ. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎక్కువగా నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో రెండో రోజు కలెక్షన్లలో చాలా డ్రాప్ కనిపించింది. ఈ మూవీ ట్రెండ్ చేస్తుంటే బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పేలా లేదు. దీంతో పూజా హెగ్డేకు వరుసగా ఏడో ప్లాప్ ఎదురైంది.

జన నాయగన్‍పైనే..

వరుణ్ ధావన్‍తో ప్రస్తుతం బాలీవుడ్‍లో ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ సినిమాలో నటిస్తున్నారు పూజా హెగ్డే. అయితే, దళపతి విజయ్‍తో చేస్తున్న ‘జయ నాయగన్’ చిత్రంపైనే ఈ అమ్మడి ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీనే విజయ్‍కు చివరిది కావడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ ఉంది. ఈ తమిళ పొలిటికల్ యాక్షన్ మూవీకి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. 2026 జనవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది. జన నాయగన్ చిత్రంతో మళ్లీ హిట్ బాటపట్టాలని పూజా గంపెడాశతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈమె లైనప్‍లో కాంచన 4 కూడా ఉంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024