రెండేళ్లలో ‘దేవాదుల’ పనులు పూర్తి చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024

రెండేళ్లలో ‘దేవాదుల’ పనులు పూర్తి చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu

రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సకాలంలో ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అవసరమైన నిధులను కేటాయించి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.

దేవాదుల ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రులు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, రెండేళ్లలో ప్రాజెక్టు పనులు వంద శాతం కంప్లీట్ చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ కు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టును అందుబాటులోకి తీసుకు వస్తామని వెల్లడించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి పారుదల, పౌర సరఫరా శాఖలపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేశారు. అంతకుముందు హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట పంప్ హౌజ్ ను పరిశీలించారు. ఆ తర్వాత ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను విజిట్ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్పష్టమైన ప్రణాళికతో రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు దేవాదులతో రెండున్నర లక్షల వరకు ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని, ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

44 టీఎంసీ నీళ్లు…

సమ్మక్క సారక్క బ్యారేజ్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నది జలాలు 44 టీఎంసీలు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు చత్తీస్గడ్ ముఖ్యమంత్రితోను చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు సంవత్సరానికి 23 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేటాయించి పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ఐదు లక్షల ఎకరాలకు వచ్చే విధంగా సాగునీరు నిరంతర అందించేలా ముందుకెళుతున్నట్లు తెలిపారు.

84 శాతం జనాభాకు సన్న బియ్యం…

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. రాష్ట్రంలో 80 నుంచి 84 శాతం జనాభాకు సన్న బియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్న ప్రభుత్వం తమదని ధీమా వ్యక్తం చేశారు.

అర్హులందరికీ రేషన్ కార్డులు..

అధికారులు వెరిఫై చేసిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామనీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఎంత ఖర్చైనా సరే నిరుపేదలకు సన్న బియ్యం అన్నం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు అంశంపై సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను, ఆగివున్న పనులన్నింటిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి రైతన్నలకు సస్యశ్యామలంగా నిరందించడానికి కృషి చేస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రైతుల పండించిన ధాన్యాన్ని సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు.

భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులు ప్రభుత్వం చిత్తశుద్ధి చేస్తుందన్నారు. భద్రకాళి పురాతన చెరువని, 50 శాతం పూడికతీత పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. భద్రకాళి చెరువు హనుమకొండ, వరంగల్ జంట నగరాల అద్భుతమైన ట్యాంకు అని, బ్యాలెన్స్ వర్క్ ను షార్ట్ టెండర్లను పిలిచి పూర్తి చేస్తామన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందు పనులు పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

ములుగు జిల్లాకు నీళ్లివ్వాలి – మంత్రి సీతక్క

గోదావరి నది ములుగు జిల్లాలో ఉన్నా దేవాదుల నుంచి చుక్క నీళ్లు కూడా ములుగు జిల్లాకు అందడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో గిరిజన గ్రామాలు అధికంగా ఉన్న దృష్ట్యా ఆయా గ్రామాల పరిధిలో వాగులపై చెక్ డ్యామ్ లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సాగునీటి కాల్వల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

సమస్యలు చెప్పుకున్న ఎమ్మెల్యేలు

మంత్రుల రివ్యూ సందర్భంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సాగునీటి కాలువలు, చెరువులు, వాగులు, సాగునీటికి ఇబ్బందులు, తదితర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, కె ఆర్ నాగరాజు, సత్యనారాయణ రావు, మురళి నాయక్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమస్యలు వివరించారు.

ఉమ్మడి జిల్లాలోని సాగునీటిపారుదల శాఖకు సంబంధించి ఎమ్మెల్యేలు సూచించిన అంశాలపై ఈఎన్సీ అనిల్ కుమార్, అశోక్ కుమార్ వాటి పరిష్కారానికి తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్ ప్రావీణ్య, సత్య శారద, అద్వైత్ కుమార్ సింగ్ , దివాకర్ టిఎస్, రిజ్వాన్ భాషా షేక్, రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

HT Telugu Desk

టాపిక్

Telangana NewsWarangalUttam Kumar ReddyPonguleti Srinivas Reddy
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024