మరోసారి క్రేజీ పెయిర్.. జతకట్టనున్న ప్రభాస్-అనుష్క.. సందీప్ వంగా ప్లాన్ మామూలుగా లేదుగాా!

Best Web Hosting Provider In India 2024

మరోసారి క్రేజీ పెయిర్.. జతకట్టనున్న ప్రభాస్-అనుష్క.. సందీప్ వంగా ప్లాన్ మామూలుగా లేదుగాా!

స్పిరిట్ మూవీపై టాలీవుడ్ లో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాస్టర్ ప్లాన్ వేశారని టాక్. ప్రభాస్ కు జోడీగా మరో హీరోయిన్ ప్లేస్ లో అనుష్కను తీసుకుంటున్నారనే బజ్ నెలకొంది.

స్పిరిట్ లో క్రేజీ పెయిర్ పై బజ్ (x)

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీపై క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ గా నిలిచిన ప్రభాస్-అనుష్క మరోసారి ఈ మూవీ కోసం జతకట్టనున్నారని టాక్. స్పిరిట్ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని సమాచారం. ఇందులో అనుష్క ఒకరినే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

పెద్ద ప్లానే

ప్రభాస్-అనుష్క ఇప్పటివరకూ నాలుగు సినిమాల్లో రొమాన్స్ చేశారు. బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో ఈ జోడీ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసింది. ప్రభాస్ కు అనుష్క పర్ ఫెక్ట్ మ్యాచ్ అని అభిమానులు అందరూ ఫీల్ అవుతున్నారు. ఆ మధ్యలో ప్రభాస్-అనుష్క పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జోరందుకుంది. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది.

ఇప్పుడు ప్రభాస్-అనుష్క జోడీకి ఉన్న క్రేజ్ ను యూజ్ చేసుకునేందుకు సందీప్ రెడ్డి వంగా పెద్ద ప్లానే చేశాడనే టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ మూవీలో కీ రోల్ ప్లే చేసే హీరోయిన్ పాత్రలో అనుష్కను తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దీపిక కూడా

మరోవైపు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తో దీపికా పదుకోణ్ కూడా యాక్ట్ చేస్తున్నారనే టాక్ కూడా వైరల్ గా మారింది. ప్రభాస్, దీపిక కలిసి కల్కిలో నటించిన సంగతి తెలిసిందే. ఇక త్రిష, నయనతార, కియారా అడ్వాణీ పేర్లను కూడా సందీప్ పరిశీలిస్తున్నాడనే టాక్ ఉంది. మరి వీళ్లలో సందీప్ ఎవరిని హీరోయిన్లుగా తీసుకుంటాడో వేచి చూడాలి.

త్వరలోనే షూటింగ్

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందని సమాచారం. వచ్చే నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ బ్రదర్ గా సంజయ్ దత్ యాక్ట్ చేస్తారని సమాచారం.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ మూవీకి ప్రోడ్యూసర్. భారీ బడ్జెట్ తో పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ప్రభాస్ నుంచి నెక్ట్స్ మూవీగా రాజాసాబ్ థియేటర్లకు వచ్చే అవకాశముంది. మారుతి ఈ మూవీ డైరెక్టర్. ఆ తర్వాత ఫౌజీ లైన్ లో ఉంది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024