ఇంత వైలెంట్​గా ఉందేంటి! వస్తువులు వెనక్కి తీసుకోలేదని దుకాణదారుడిపై బాలిక దాడి..

Best Web Hosting Provider In India 2024


ఇంత వైలెంట్​గా ఉందేంటి! వస్తువులు వెనక్కి తీసుకోలేదని దుకాణదారుడిపై బాలిక దాడి..

Sharath Chitturi HT Telugu

ఉత్తర్​ ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 15ఏళ్ల బాలిక.. ఓ దుకాణదారుడిపై బ్లేడ్​తో దాడి చేసింది. కారణం? వాడేసిన వస్తువులను తిరిగిస్తుంటే, అతను వాటిని తీసుకోకపోవడం! అసలేం జరిగిందంటే..

వైరల్​ వీడియోలోని దృశ్యాలు..

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ దుకాణదారుడిపై ఓ 15ఏళ్ల బాలిక బ్లేడ్​తో దాడి చేసింది! అతని షాప్​లో కొన్న వస్తువులను వెనక్కి ఇచ్చేందుకు వెళితే, వాటిని తీసుకోవడం లేదన్న కోపంతో బాలిక ఈ దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాప్​లోని సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

ఇదీ జరిగింది..

యూపీ హాపూర్​ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది ఈ ఘటన. స్థానిక దుకాణం నుంచి బాలిక తరచూ వస్తువులు కొనుగోలు చేస్తుంది. అయితే, బాలిక చాలా కాలంగా వాడిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తోందని, ఎటువంటి ప్రతిఘటన లేకుండా అనేకమార్లు వాటిని వెనక్కి తీసుకున్నానని దుకాణదారుడు చెప్పాడు. అయితే బాలిక ప్రవర్తనతో విసిగిపోయిన అతను ఈసారి వాటిని వెనక్కి తీసుకునేందుకు నిరాకరించాడు.

ఆగ్రహించిన బాలిక మొదట బాధితుడిని దూషించింది. ఆ వెంటనే, క్షణాల్లో బ్లేడ్ తీసి దుకాణదారుడిపై దాడి చేసింది. అతని చేతులు, కడుపుకు తీవ్ర గాయాలయ్యాయి.

ఘటన జరిగిన సమయంలో దుకాణంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. అప్రమత్తమైన స్థానికులు దుకాణదారుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు దుకాణదారుడిపై దాడి చేసిన తర్వాత బాలిక పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు ఆమెను పట్టుకున్నారు.

ఈ విషయం బాధితుడి కుటుంబానికి తెలిసింది. వారు తొలుత ఆసుపత్రికి పరుగులు తీశారు. అనంతరం బాలికపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది తెలుస్తోంది.

అయితే గత కొంతకాలంగా బాలిక మానసిక స్థితి సరిగా లేదని, ప్రస్తుతం అందుకు చికిత్స పొందుతోందని స్థానికులు చెబుతున్నారు.

చిన్న విషయానికి ఓ బాలిక బ్లేడ్​తో దాడి చేసిందన్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నెట్టింట కూడా చాలా మంది ఈ వార్త చదువుతున్నారు. అందరు ఆశ్చర్యపోతున్నారు. బాలిక ప్రవర్తనకు షాక్​కి గురవవుతున్నారు. క్షణికావేశాన్ని నియంత్రించుకోలేక నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న చిన్న విషయాలకు చాలా మంది గొడవ పడుతున్నారు. కొట్టుకుంటున్నారు. అవసరమైతే ప్రాణాలు తీసేస్తున్నారు. వీటి వల్ల దేశంలో క్రైమ్​ రేట్​ పెరిగిపోతోంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link