




Best Web Hosting Provider In India 2024

సండే స్పెషల్ ఐటెం, మటన్ తవా లివర్ మసాలా రెసిపీ ఇదే!
సండే స్పెషల్‌గా ట్రై చేయాలనుకుంటున్నారా? నోరూరించే మటన్ లివర్ ఫ్రైని ఇంట్లోనే తయారుచేసుకోండి. స్మోకీ అరోమాతో పాటు చక్కటి టేస్ట్‌గా అనిపించే లివర్ ఫ్రైని ట్రై చేయండి. ఇదిగోండి. మీకోసం ప్రత్యేకంగా సులభంగా తయారయ్యే రెసిపీని తీసుకొచ్చాం. చూసేయండి.
మటన్ లివర్ రెసిపీ
మాంసాహార ప్రియులకు లివర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిని స్టార్టర్‌గా తినే వాళ్లు కొందరుంటే సరదాగా, ముచ్చట్లు చెప్పుకుంటూ తినే వారు ఇంకొందరు. మరి అంత రుచికరమైన లివర్‌ను తయారుచేయడానికి ఏమేం కావాలో.. మీకున్న తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. రెస్టారెంట్ స్టైల్‌లో రెడీ చేసుకుని ఎంజాయ్ చేయండి.
కావాల్సిన పదార్థాలు:
- మటన్ లివర్ – 1/2 కేజీ
- ఆవాల నూనె – 10 టేబుల్ స్పూన్లు
- కశ్మీరీ కారంపొడి – 3 టేబుల్ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1/4 టేబుల్ స్పూన్
- ఉప్పు – రుచికి తగినంత
- చాట్ మసాలా – 1/2 టీ స్పూన్
- గరమ్ మసాలా – ఒక టీ స్పూన్
- సొంటి పొడి – 1/4 టీ స్పూన్
- కారం పొడి – 2 టేబుల్ స్పూన్ల
- జీలకర్ర పొడి – 1 టీస్పూన్ (వేయించినది)
- బ్లాక్ సాల్ట్ – 1/2 టీస్పూన్
- కసూరీ మేతి – 2 టేబుల్ స్పూన్
- పెరుగు – 1/2 కేజీ
- కొత్తి మీర – 1/2 కప్పు
- నిమ్మరసం – అరచెక్క
తయారుచేసే విధానం:
- ముందుగా లివర్‌కు నరాలు లేకుండా చూసి కట్ చేయండి.
- ఆ తర్వాత లివర్ ముక్కలను పసుపులో వేసి బాగా కడుక్కోండి. కడిగిన లివర్‌ను పక్కకు పెట్టుకుని ఉంచుకోండి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాని మీద నూనె పోసి వేడి చేయండి.
- నూనె వేడెక్కిన తర్వాత అందులో కశ్మీరీ కారంపొడి కలపండి.
- వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మరో బౌల్లోకి తీసుకోండి. లేదంటే కారం మాడిపోయి చేదుగా అయిపోతుంది.
- ఇప్పుడు ఈ మిశ్రమంలో అల్లం – వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చాట్ మసాలా, గరమ్ మసాలా, సొంటి పొడి, కారం పొడి, వేయించిన జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, కసూరీ మేతిని కలుపుకుని పక్కకుపెట్టుకోండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని అందులో అరకిలో మటన్ లివర్ ముక్కలు వేయండి.
- చేతితో కలిపితే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది. అందుకే చెంచాతో బాగా కలిసేలా కలపండి.
- అలా కలిపిన మటన్ ముక్కలను గిన్నెపై మూతపెట్టి ఒక గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచుకోండి.
- ఆ గిన్నెలో వడకట్టిన పెరుగు అంటే నీరు పూర్తిగా తొలగించుకున్న పెరుగును వేసి కలుపుకోండి.
- ఇప్పుడు అట్లపెనం పెట్టి దాని మీద లివర్ ముక్కలు వేయించండి.
- స్టవ్‌ను హై ఫ్లేమ్ మీద ఉంచి పూర్తిగా అడుగు అంటుకోకుండా తిప్పుతూ ఉండండి.
- ముక్క మగ్గకుండానే మసాలా అడుగంటుతుందని అనిపిస్తుంటే, కొన్ని నీళ్లు పోయండి.
- కాస్త కస్తూరీ మేతీ, కొంచెం కొత్తి మీర, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి.
- దీనిని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే అదనపు రుచి యాడ్ అవుతుంది.
మటన్ లివర్ తినడం వల్ల బెనిఫిట్స్:
లివర్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, బి12, ఐరన్ అధికంగా ఉంటాయి. రక్తహీనత నివారణకు, కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి ఇది చాలా మంచిది. ప్రోటీన్ కూడా లివర్లో అధికంగా ఉంటుంది. అయితే మితంగా తీసుకోవడం ఆరోగ్యకరం.