బ్రహ్మముడి ప్రోమో: రాజ్‌గా మారిన తమ్ముడు కల్యాణ్- శ్వేత ఎంట్రీ- రామ్‌పై ఫ్రెండ్స్ రివేంజ్- కావ్యకు షాక్ ఇచ్చిన యామిని!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి ప్రోమో: రాజ్‌గా మారిన తమ్ముడు కల్యాణ్- శ్వేత ఎంట్రీ- రామ్‌పై ఫ్రెండ్స్ రివేంజ్- కావ్యకు షాక్ ఇచ్చిన యామిని!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్‌గా తమ్ముడు కల్యాణ్ మారుతాడు. రాజ్ గతంలో జరిగిన ముఖ్యమైన విషయాలను తనకు చెప్పి గతం గుర్తుకు వచ్చేలా ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రిసార్టులో సందీప్ వెడ్డింగ్ యానివర్సరీ కారణంతో రాజ్‌కు గతం గుర్తుకు తెచ్చెందుకు కల్యాణ్, కావ్య, అప్పు ప్లాన్ వేస్తారు. రాజ్‌కు గతం గుర్తు లేదన్న విషయం ఫ్రెండ్స్ అందరికి కల్యాణ్ చెబుతాడు. ఇంతలో మందు తాగుతూ వచ్చిన అర్జున్, కృష్ణ అలియాస్ టోనీ, వాకర్ రాజ్‌పై పదేళ్ల రివేంజ్ తీర్చుకుంటామని చెబుతారు.

రాజ్ గతం మర్చిపోవడం

కాలేజ్‌లో ప్రిన్సిపాల్ కంటే స్ట్రిక్ట్‌గా రాజ్ ఉండేవారని, ఏం చేయనిచ్చేవాడు కాదని, ఇప్పుడు వాడితో మందు తాగించి, సిగరెట్ స్మోక్ చేయించి దెబ్బకు గతం గుర్తుకు వచ్చేలా చేస్తామని తమ ప్లాన్ చెబుతారు అర్జున్, కృష్ణ. మరోవైపు కారులో రాజ్, కావ్య మాట్లాడుకుంటూ వస్తారు. ఫ్రెండ్స్ అందరం కలవడం చాలా సంతోషంగా ఉందని రాజ్ అంటాడు.

ఇక కల్యాణ్, అప్పు దగ్గరికి శ్వేత వస్తుంది. రాజ్‌ గతం మర్చిపోవడంపై శ్వేత బాధపడుతుంది. రాజ్ తనకు ఎంతో హెల్ప్ చేశాడని, భర్తతో విడిపోతున్న సమయంలో చాలా సపోర్ట్ చేశాడని శ్వేత అంటుంది. ఇప్పుడు విషయాన్నే అడ్డుగా పెట్టుకుని అన్నయ్యకు గతం గుర్తు చేయాలి అని కల్యాణ్ అంటాడు.

నువ్ నా ఫ్రెండ్ అని మా అన్నయ్యకు పరిచయం చేస్తాను. కానీ నా భార్యకు నువ్వంటే ఇష్టం లేదని, మనమధ్య ఏదో ఉందనుకుని అప్పు అనుమానిస్తుందని, నిజానికి మీ భర్తతో మీకున్న సమస్యను పరిష్కరిస్తున్నాను అని చెబుతాను. అది అన్నయ్య జీవితంలో జరిగింది కాబట్టి గుర్తుకు వచ్చే ఛాన్స్ ఉందని కల్యాణ్ అంటాడు. దాంతో శ్వేత ఒప్పుకుంటుంది.

నిక్ నేమ్ కూడా పొట్టినే

ఇంతలో రాజ్, కావ్య ఎంట్రీ ఇస్తారు. అక్కడున్న వాళ్లను కావ్య పరిచయం చేస్తుంది. కల్యాణ్‌ను ఇదివరకే రోడ్ మీద కలిసి గుర్తు చేసుకుంటాడు రాజ్. తర్వాత అప్పును పరిచయం చేస్తాడు కల్యాణ్. చాలా పొట్టిగా ఉందని రామ్ అంటే.. తన నిక్ నేమ్ కూడా పొట్టినే అన్నయ్య అని కల్యాణ్ అంటాడు. ఏమన్నావ్ అని రాజ్ షాకింగ్‌గా అడుగుతాడు. అంటే, మా అన్నయ్య కూడా మీలాగే ఉంటాడు. అందుకే ఫ్లోలో అన్నయ్య అనేశాను అని కల్యాణ్ చెబుతాడు.

దాంతో నిన్ను నా తమ్ముడే అనుకుంటాను రామ్ అంటాడు. దాంతో రాజ్‌ను ప్రేమగా హగ్ చేసుకుంటాడు కల్యాణ్.ఇక కల్యాణ్ అన్నయ్యను హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. ఇద్దరు అన్నదమ్ములు ఆప్యాయతగా కౌగిలించుకోవడం చూసి కావ్య చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత హాయ్ కల్యాణ్ అని శ్వేత ఎంట్రీ ఇస్తుంది. తను నా ఫ్రెండ్ శ్వేత అని ఇంట్రడ్యూస్ చేస్తాడు కల్యాణ్.

కానీ, అప్పు మాత్రం శ్వేతపై ద్వేషం ఉన్నట్లు నటిస్తుంది. ఎందుకు ఏమైంది అని రామ్ అడుగుతాడు. తను నా ఫ్రెండ్ అన్నయ్య. తను నాతో మాట్లాడటం అప్పుకు ఇష్టంలేదు అని కల్యాణ్ అంటే.. ఓన్లీ ఫ్రెండ్ కాదు.. గర్ల్ ఫ్రెండ్ అని అప్పు కోపంగా అంటుంది. తనకు తన హస్బండ్ నుంచి ప్రాబ్లమ్ ఉందని తెలిసి నేను హెల్ప్ చేశాను. ఒక ఫ్రెండ్‌గా అది నా రెస్పాన్సిబిలిటి కాదా అని కల్యాణ్ అంటాడు.

అడ్డుకున్న కావ్య

అది విన్న రామ్ నువ్ చెబుతుంటే నా లైఫ్‌లో ఈ స్టోరీ.. జరిగినట్లుందే అని ఆలోచిస్తుంటాడు. అలా రాజ్ గతం గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. రాజ్ ఓవర్‌గా ఒత్తిడి తెచ్చుకోవడంతో కావ్య ఆపేస్తుంది. తర్వాత అర్జున్, కృష్ణ ఎంట్రీ ఇస్తారు. రాజ్‌పై రివేంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక మరోవైపు కావ్య రిసార్టు అడ్రస్ రుద్రాణి, రాహుల్ తెలుసుకుంటారు.

కానీ, రావడానికి పాప అడ్డుగా ఉందని ధాన్యలక్ష్మీ చేతిలో పెట్టేందుకు ట్రై చేస్తారు. ఇక మరోవైపు రాజ్ గతం గుర్తుకు తేవడానికి ట్రై చేస్తావా. నీ సంగతి చెబుతా అనుకున్న యామిని కావ్యకు పెద్ద షాక్ ఇస్తుంది. తను కూడా రిసార్టుకు వచ్చి రాజ్‌కు గతం గుర్తుకు తెచ్చేందుకు ఓవర్‌గా ట్రై చేసి బ్రెయిన్‌పై ఒత్తిడి తీసుకొస్తుంది. దాంతో కావ్య అయోమయం అవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024