బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్: కావ్య మాస్ డైలాగ్స్‌కు యామిని బెదుర్స్ -వెయిట‌ర్‌గా రుద్రాణి వేషం- క‌ళావ‌తితో రాజ్ రొమాన్స్‌

Best Web Hosting Provider In India 2024

బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్: కావ్య మాస్ డైలాగ్స్‌కు యామిని బెదుర్స్ -వెయిట‌ర్‌గా రుద్రాణి వేషం- క‌ళావ‌తితో రాజ్ రొమాన్స్‌

 

బ్ర‌హ్మ‌ముడి మే 6 ఎపిసోడ్‌లో రాజ్‌, కావ్య రూమ్‌లోకి సీక్రెట్‌గా ఎంట‌ర్ అవుతుంది యామిని. ఆ విష‌యం క‌నిపెట్టిన కావ్య‌…కావాల‌నే దొంగ దొంగ అని అరుస్తుంది. కావ్య అరుపుల‌కు భ‌య‌ప‌డిపోయిన యామిని బెడ్ చాటుకు వెళ్లి దాక్కుంటుంది.

 
బ్ర‌హ్మ‌ముడి మే 6 ఎపిసోడ్‌
 

మీకో విష‌యం చెప్పాల‌ని కావ్య‌తో అంటాడు రాజ్‌. అత‌డు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడుకావ‌చ్చున‌నుకొని కావ్య సంబ‌ర‌ప‌డుతుంది. అదేంటో కూడా నాకు తెలుసున‌ని మ‌న‌సులో అనుకుంటుంది. ప‌ర్లేదు చెప్పిండి అని కావ్య స‌మాధాన‌మిస్తుంది. అది అది అంటూ నాన్చి…నా రూమ్‌లో బ‌ట్ట‌లు ఉన్నాయి తెచ్చిపెడ‌తారా అని కావ్య‌ను అడుగుతాడు రాజ్‌. బ‌ట్ట‌ల కోస‌మా ఇంత బిల్డ‌ప్ అని కావ్య అంటుంది. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేనే తెచ్చుకుంటున్నాన‌ని రాజ్ అంటాడు. నేను తీసుకొస్తాన‌ని కావ్య అక్క‌డి నుంచి వెళుతుంది.

 

దొంగ‌గా ఎంట్రీ…

కావ్య చ‌నువు ఇస్తుంది, క‌సురుకుంటుంది, సిగ్గుప‌డుతుంది…దీని మీనింగ్ ఏంటో అని రాజ్ కూడా ఆనంద‌ప‌డ‌తాడు. కావ్య, రాజ్ ఉన్న రూమ్‌లోకి సీక్రెట్‌గా యామిని వ‌స్తుంది. యామిని రావ‌డం క‌నిపెడుతుంది కావ్య‌. కావాల‌నే ఆమెను ఓ ఆట ఆడుకోవాల‌ని దొంగ దొంగ అని అరుస్తుంది. ఆ అరుపుల‌కు భ‌య‌ప‌డి యామిని దాక్కుంటుంది. దాగుడుమూత‌ల దండ‌కోర్‌…అని బెడ్ చాటుకు ద‌క్కున్న యామినిని ప‌ట్టుకుంటుంది కావ్య‌.

రాజ్ ఎక్క‌డున్నాడు…

రాజ్ ఎక్క‌డున్నాడో చెప్ప‌మ‌ని కావ్య‌ను నిల‌దీస్తుంది యామిని. మా ఆయ‌న మా రూమ్‌లో స్థానం చేస్తున్నాడ‌ని కావ్య బ‌దులిస్తుంది. రాజ్ నీ రూమ్‌లో ఉండ‌టం ఏంటి అని యామిని కోపంగా అంటుంది. నా భ‌ర్త నా రూమ్‌లో ఉండ‌క ఇంక ఎక్క‌డ ఉంటార‌ని కావ్య స‌మాధాన‌మిస్తుంది.

రాజ్ వీపు రుద్దేటప్పుడు వెన‌క ఉన్నాను, త‌లంటేట‌ప్పుడు ప‌క్క‌న ఉన్నాన‌ని కావ్య అంటుంది. ఆమె మాట‌ల‌తో యామిని కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. రాజ్ బ‌ట్ట‌లు తీసుకెళ్ల‌లేద‌ని, నువ్వు ప‌క్క‌కు త‌ప్పుకుంటే బ‌ట్ట‌లు తీసుకెళ్లి రాజ్‌కు ఇస్తాన‌ని కావ్య అంటుంది.

ఏం చెబుతావు…

నువ్వు రాజ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డానికి వీలులేద‌ని యామిని గొడ‌వ‌ప‌డుతుంది. పోనీ నువ్వుతీసుకెళ‌తావా…రాజ్‌కు ఎలా క‌నిపిస్తావు…నువ్వు ఎక్క‌డికి ఎందుకువ‌చ్చావ‌ని రాజ్‌ అడిగితే ఏం చెబుతాడు. ఫాలో అయ్యాన‌ని చెబుతావా, వ‌ద్దు అంటున్న అనుమానంగా వెంట‌ప‌డుతున్నాన‌ని అంటావా అని యామినిని అడుగుతుంది కావ్య‌. తేలు కుట్టిన దొంగ‌లా దూరం నుంచి మా అన్యోన్య దాంప‌త్యం చూడ‌మ‌ని యామినితో అంటుంది కావ్య‌.

 

రాజ్ నీకు ప‌డిపోడు…

నీ బాత్‌రూమ్‌లో స్నానం చేసినంత మ‌త్రానా, బ‌ట్ట‌లు తీసుకెళ్లినంత మాత్రానా రాజ్ నీకు ప‌డిపోడు అని యామిని అంటుంది. మీ మ‌ధ్య అడ్డుగోడ‌లా ఎప్పుడు అడ్డు వ‌స్తూనే ఉంటాన‌ని యామిని చెబుతుంది. మా ఆయ‌న నా కోసం ఆ గోడ‌లు బ‌ద్ధ‌లు కొట్టుకొని వ‌స్తాడ‌ని కావ్య అంటుంది. క్లాస్ కావ్య నోట మాస్ డైలాగా…అంత నీ వ‌ల్లే యామిని అని అంటుంది కావ్య‌.

ముద్దా….వ‌ద్దు…

రాజ్‌కు బ‌ట్ట‌లు తీసుకొని త‌న రూమ్‌కు వెళుతుంది కావ్య‌. యామినిని ఏడిపించ‌డానికి రూమ్ డోర్ వేస్తుంది కావ్య‌. ఏంటండి అప్పుడే వ‌చ్చేశారు? అబ్బ చేయి వ‌ద‌లండి…మీరు ఎప్పుడు ఇంతే…ఏంటి ముద్దా…వ‌ద్దండి అంటూ కావ్య నాట‌కం ఆడుతుంది. వీళ్ల వ్య‌వ‌హారం అప్పుడే ముద్దు వ‌ర‌కు వెళ్లిపోయింద‌ని యామిని అసూయ‌తో ర‌గిలిపోతుంది. మీ కోసం ముద్దు ఇస్తున్నాన‌ని కావ్య అంటుంది.లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌క రూమ్ బ‌య‌ట యామ‌ని టెన్ష‌న్‌తో ఎదురుచూస్తూ ఉంటుంది.

గ‌త జ్ఞాప‌కాలు…

స్నానం చేసిన బ‌య‌ట‌కు వ‌చ్చిన రాజ్‌కు బెడ్‌పై కావ్య గీసిన డిజైన్స్ క‌నిపిస్తాడు. వాటిని చూసి రాజ్ ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. ఏవో జ్ఞాప‌కాలు అత‌డికి గుర్తొస్తాయి. ఈ డిజైన్స్ అని అంటాడు. రాజ్‌కు గ‌తం గుర్తొచ్చే ప్ర‌మాదం ఉంద‌ని భ‌య‌ప‌డిన యామిని రూమ్ లోప‌లికి వ‌స్తుంది.

 

నువ్వే ర‌మ్మ‌ని మెసేజ్ చేశావు…

నువ్వేంటి ఇక్క‌డ అని యామినిని అడుగుతాడు రాజ్‌. నువ్వే ర‌మ్మ‌ని మెసేజ్ చేశావ‌ని చూపిస్తుంది యామిని. నేనేప్పుడు చేశాను రాజ్ అంటాడు. రూమ్ బాయ్ ద్వారా రాజ్ ఫోన్ నుంచి త‌న ఫోన్‌కు యామినినే కావాల‌నే ఆ మెసేజ్ పంపించుకుంటుంది. స‌ర‌దాగా గ‌డుపుదామ‌నే న‌న్ను ర‌మ్మ‌న్నావా అని అంటుంది. పార్టీ అయ్యే వ‌ర‌కు నేను నీతోనే ఉంటాన‌ని రాజ్‌తో అంటుంది యామిని. రాజ్‌ను అక్క‌డి నుంచి తీసుకెళుతుంది.

స్వ‌ప్న టెన్ష‌న్‌…

స్వ‌ప్న కూతురిని ధాన్య‌ల‌క్ష్మి ఆడిస్తుంటుంది. రాహుల్‌, రుద్రాణి క‌నిపించ‌క‌పోవ‌డంతో స్వ‌ప్న కంగారు ప‌డుతుంది. ఏదో అర్జెంట్ ప‌ని ఉంద‌ని, పాప‌ను నాకు ఇచ్చి ఇద్ద‌రు బ‌య‌ట‌కు వెళ్లార‌ని స్వ‌ప్న‌తో అంటుంది ధాన్య‌ల‌క్ష్మి. రాజ్‌కు గ‌తం గుర్తుచేయ‌డానికి కావ్య వెళ్లింద‌ని, కావ్య ఎక్క‌డికి వెళ్లిందో తెలియ‌కూడ‌ద‌నే రాహుల్‌, రుద్రాణిల‌కు పాప‌ను ఇచ్చి ఆడించ‌మ‌ని చెప్పాన‌ని స్వ‌ప్న అంటుంది.

రాజ్ గ‌తం మ‌ర్చిపోయిన విష‌యం మా అత్త‌తో పాటు రాహుల్‌కు తెలియ‌కూడ‌ద‌ని మీకూ కూడా చెప్పానుగా అని ధాన్య‌ల‌క్ష్మితో స్వ‌ప్న అంటుంది. ఆ విష‌యం మ‌ర్చిపోయాన‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. వెంట‌నే ఆ విష‌యం అప్పుకు చెబుతుంది స్వ‌ప్న‌.

వెయిట‌ర్స్ వేషం…

రాజ్‌, కావ్య ఉన్న రిసార్ట్‌కు వ‌స్తారు ధాన్య‌ల‌క్ష్మి, రాహుల్‌, లోప‌లికి వెళ్ల‌బోతుండ‌గా సెక్యూరిటీ అడ్డుకొని బ‌య‌ట‌కు గెంటేస్తాడు. వెయిట‌ర్స్‌గా వేషం మార్చుకొని లోప‌లికి వెళ‌దామ‌ని త‌ల్లికి స‌ల‌హా ఇస్తాడు రాహుల్‌. నేనేంటి నా స్టేట‌స్ ఏంటి…వెయిట‌ర్ వేషం వేయ‌డం ఏంటి అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు లోప‌లికి వెళ్ల‌క‌పోతే మ‌న స్టేట‌స్ మారిపోతుంద‌ని రాహుల్ అంటాడు. ఫ్యాన్సీ డ్రెస్ అనుకొని వెయిట‌ర్ వేషం వేస్తాన‌ని రుద్రాణి అంటుంది.

 

జెల‌సీగా ఫీల‌య్యేరోజు…

రాజ్‌కు ఎలాగైనా గ‌తం గుర్తుచేయాల‌ని కాలేజీలో రాజ్‌తో క‌లిసి చ‌దువుకున్న జూనియ‌ర్స్‌ను తీసుకొస్తారు ప్పు, క‌ళ్యాణ్. వాళ్లిద్ద‌రూ రాజ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వారిద్ద‌రు గ‌తంలో మ‌నం అంద‌రం ఫ్రెండ్స్ అని అంటారు.

మందేద్దామ‌ని అంటారు. వాళ్లిద్ద‌రికి రాజ్ క్లాస్ ఇచ్చి పారిపోయేలా చేస్తాడు. రాజ్‌, కావ్య లంచ్‌కు వెళ్ల‌బోతుండ‌గా…యామిని ఆపేస్తుంది. క‌ట్టుకున్న భ‌ర్త కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నావ‌ని, నిన్ను చూస్తే జాలేస్తుంద‌ని యామిని అంటుంది. న‌న్ను చూసి జెల‌సీగా ఫీల‌య్యే రోజు కూడా వ‌స్తుంద‌ని పంచ్ వేస్తుంది కావ్య‌.

నా మ‌న‌సులో ఏముందో తెలియ‌దా…

వేషాలు మార్చుకొని లోప‌లికి ఎంట‌ర్ అవుతారు రుద్రాణి, రాహుల్‌. రాజ్‌ను కావ్య రామ్ అని పిల‌వ‌డం చూస్తారు. యామినిని చూస్తారు.ఈ కొత్త క్యారెక్ట‌ర్ ఎవ‌రు అని డౌట్ ప‌డ‌తారు. రాజ్, కావ్య క‌లిసి లంచ్ చేస్తేంటారు. మ‌రో అమ్మాయి రాజ్‌కు భోజ‌నం తీసుకొస్తుంది. మ‌రో అమ్మాయి గ్లాస్ తీసుకొని రాజ్ వాటర్ తాగుతాడు.

మీరిద్ద‌రు ల‌వ‌ర్స్ అని తెలియద‌ని, అందుకే నేను తీసుకొచ్చిన భోజ‌నం కావ్య కింద ప‌డేసింద‌ని రాజ్‌తో ఆ అమ్మాయి అంటుంది. కావ్య మ‌న‌సులో ఏముందో వెంట‌నే తెలుసుకోవాల‌ని రాజ్ అనుకుంటాడు. కావ్య‌ను అడుగుతాడు. నా మ‌న‌సులో ఏముందో మీకు తెలియ‌దా అని కావ్య అంటుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

 

 

 

Best Web Hosting Provider In India 2024