నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 6: శ్రీరాజ్‍ను కొట్టిన చంద్ర.. వరదరాజులుపై కత్తి ఎత్తిన విరాట్.. జగదీశ్వరి ఆగ్రహం
నిన్ను కోరి సీరియల్ నేటి (మే 6) ఎపిసోడ్‍లో శ్రీరాజ్‌పై చంద్రకళ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రఘురాంను చంపాలనుకున్న అతడిపై ఫైర్ అవుతుంది. ఎందుకు నింద వేస్తున్నావని కుటుంబ సభ్యులు అంటే.. అది నింద కూడా నిజమని చంద్ర ఏడుస్తూ చెబుతుంది. శ్రీరాజ్ కూడా ఇది నిందే అనడంతో చంద్రకళ కోపం కట్టలు తెంచుకుంటుంది. శ్రీరాజ్ చెంపపై కొట్టేస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. వరదరాజులు తనపై చేయి ఎత్తితే అడ్డుకుంటుంది చంద్ర.
నన్ను పావులా వాడుకున్నారు
పెదనాన్న గొప్ప అని నమ్మి రెండు కుటుంబాలను కలపాలని చూస్తే చెడగొట్టాలని చూస్తున్నారని చంద్రకళ ఏడుస్తుంది. నన్ను పావులా వాడుకున్నారని బాధపడుతుంది. అదంతా అబద్ధం, ఎవరో నూరిపోశారని శ్రీరాజ్ అంటాడు. ఆ విషయం నీకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టేసి చెప్పు అంటే.. పిచ్చా నీకు అని శ్రీరాజ్ అంటాడు. ఒట్టు వేయడు. నువ్వు తప్పు చేశావని చంద్ర అంటుంది. రఘురాం మామయ్యను వ్యాన్‍తో గుద్ది చంపాలని చూశారని శ్రీరాజ్ గురించి చంద్రకళ చెప్పేస్తుంది. వరదరాజులే చంపించాలని చూశాడని అంటుంది.
ఇదంతా నిజమా అని సౌజన్య అడిగితే.. నిజమే అని.. నాకు నా పరువు, పట్టుదలే ముఖ్యమని వరదరాజులు అంటాడు. నేను ఆ జగదీశ్వరితో కలవను.. ఆ కుటుంబమంటే పగే తప్ప ప్రేమ లేదు అని తేల్చిచెప్పేస్తాడు.
శ్రీరాజే వ్యాన్‍తో గుద్దాడు.. విరాట్‍కు చెప్పేసిన క్రాంతి
ఆసుపత్రిలో జగదీశ్వరి, విరాట్ బాధపడుతూ ఉంటారు. ఇంతలో క్రాంతి వస్తాడు. నాన్నది యాక్సిడెంట్ కాదు షాలినా.. ఆ శ్రీరాజే వ్యాన్‍తో గుద్ది చంపాలని ప్రయత్నించాడు అని చెబుతాడు. శ్రీరాజ్ బావ యాక్సిడెంట్ చేయడం ఏంటి అని విరాట్ షాక్ అవుతాడు. యాక్సిడెంట్ జరిగిన చోట ఓ షాప్ సీసీ టీవీ ఫుటేజ్ చూశానని, శ్రీరాజే నాన్న వ్యాన్‍తో గుద్దినట్టు తెలిసిందని క్రాంతి చెప్పేస్తాడు. దీంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా చంద్రకు తెలిసే ఉంటుందని కామాక్షి అనుమానంగా మాట్లాడుతుంది. చంద్ర వదిన అప్పటికే ఆ సీసీ టీవీ ఫుటేజీ చూసిందని విరాట్‍తో చెబుతాడు క్రాంతి. దీని అర్థమేంటి అని విరాట్‍ను అడుగుతాడు.
తరువాయి భాగంలో.. కత్తి ఎత్తిన విరాట్
వరదరాజులు ఇంటికి వెళతారు విరాట్, జగదీశ్వరి, కామాక్షి. రేయ్ వరదరాజులు.. నీచుడా బయటి రారా అంటూ ఆగ్రహం అరుస్తుంది జగదీశ్వరి. మా నాన్న చంపాలని చూస్తావ్ రా అని శ్రీరాజ్‍ను కొడతాడు విరాట్. కాలర్ పట్టుకొని చెంపలు వాయించేస్తాడు.ఇంతలో అక్కడే ఉన్న కత్తిని విరాట్ తీసుకొని వరదరాజులుపైనే ఎత్తుతాడు. తనకు పతిబిక్ష పెట్టాలని సౌజన్య వేడుకుంటుంది. దీంతో కత్తి కింద పడేస్తాడు విరాట్. అత్తయ్య ముఖం చూసి వదిలేస్తున్నానంటాడు. జగదీశ్వరి కూడా తెగదెంపులు చేసుకుంటానని చెప్పేస్తుంది.
Best Web Hosting Provider In India 2024