గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్: మ‌నోజ్‌కు ధ‌మ్కీ ఇచ్చిన మీనా – బాలు కాపురంలో చిచ్చు పెట్టిన శివ‌

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్: మ‌నోజ్‌కు ధ‌మ్కీ ఇచ్చిన మీనా – బాలు కాపురంలో చిచ్చు పెట్టిన శివ‌

 

గుండె నిండా గుడి గంట‌లు మే 6 ఎపిసోడ్‌లో శివ‌కు యాక్సిడెంట్ అయిన విష‌యం బాలుకు ఫోన్ చెబుతుంది మీనా. హాస్పిట‌ల్‌కు ర‌మ్మ‌ని అడుగుతుంది. తాను ట్రిప్‌లో ఉన్నాన‌ని, రాలేన‌ని కోపంగా బాలు బ‌దులిస్తాడు. బాలు మాట‌ల‌తో మీనా హార్ట‌వుతుంది.

 
గుండె నిండా గుడి గంట‌లు మే 6 ఎపిసోడ్‌
 

శివ‌ను పార్వ‌తి, సుమ‌తి హాస్పిట‌ల్ తీసుకొస్తారు. చేయి నొప్పి ఎక్కువ‌గా ఉండ‌టంతో భ‌రించ‌లేక‌పోతాడు శివ‌. దెబ్బ ఎలా త‌గిలింద‌ని డాక్ట‌ర్ అడిగితే బైక్‌పై నుంచి కింద‌ప‌డ్డాన‌ని అబ‌ద్దం చెబుతాడు. త‌న‌ను బాలు కొట్టిన సంగ‌తి దాచేస్తాడు. చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే త‌ప్ప ఇంత‌లా దెబ్బ త‌గ‌ల‌ద‌ని, ఒంటిపై గాయాలు ఏం క‌నిపించ‌డంలేదు…అస‌లు నీకు యాక్సిడెంట్ ఎక్క‌డ అయ్యింద‌ని శివ‌ను డాక్ట‌ర్ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు అడుగుతాడు. ఎదురుగా కారొచ్చింది…చూడ‌కుండా గుద్దేశాన‌ని శివ మ‌రో అబ‌ద్ధం చెబుతాడు.

 

మీనా కంగారు…

శివ‌కు యాక్సిడెంట్ అయిన సంగ‌తి తెలిసి కంగారుగా మీనా హాస్పిట‌ల్‌కు వ‌స్తుంది. శివ బాధ‌తో విల‌విల‌లాడ‌టం చూసి ఎమోష‌న‌ల్ అవుతుంది. ఎలా జ‌రిగింది అని శివ‌ను అడుగుతుంది. బైక్ స్కిడ్ అయ్యి కింద‌ప‌డ్డాన‌ని మీనాతో చెబుతాడు శివ‌. చిన్న దెబ్బ కాబ‌ట్టి స‌రిపోయింది…ఏదైనా పెద్దది అయ్యుంటే ఏం చేసేవాళ్లం, అమ్మ ఎంత ఇబ్బంది ప‌డేద‌ని మీనా అంటుంది.

బాలుపై శివ కోపం…

శివ‌కు యాక్సిడెంట్ అయిన విష‌యం బావ‌కు చెప్పావా అని మీనాను అడుగుతుంది సుమ‌తి. బాలు ట్రిప్‌కు వెళ్లాడ‌ని, ఈ విష‌యం చెబితే ఎక్క‌డున్నా వెంట‌నే ప‌రిగెత్తుకుంటూ వ‌స్తాడ‌ని మీనా అంటుంది.

అయినా బావ‌కు చెందుకు చెప్పాలి అని శివ కోపంగా అంటాడు. ఏం మాట్లాడుతున్నావ‌ని, బాలు…మీ అక్క భ‌ర్త అని, ఆయ‌న‌కు చెప్ప‌క‌పోతే ఇంకెవ‌రికి చెబుతామ‌ని పార్వ‌తి అంటుంది. ఒక్క‌సారి అమ్మ‌, సుమ‌తి గురించి ఆలోచించ‌మ‌ని, నువ్వు దూర‌మైతే వాళ్ల ప‌రిస్థితి ఏమిట‌ని శివ‌తో అంటుంది మీనా.

నిజం బ‌య‌ట‌పెట్టిన బాలు…

గుణ పెద్ద రౌడీ అని, వాడితో ఎందుకు పెట్టుకున్నార‌ని రాజేష్, బాలుతో మ‌రో డ్రైవ‌ర్ అంటాడు. బాలు…గుణ‌ను కొట్ట‌డం త‌ప్పు కాద‌ని, కానీ సొంత బావ‌మ‌రిది శివ‌ను కొట్టాడు క‌దా…అదే ఎక్క‌డికి దారితీస్తుందో తెలియ‌డం లేద‌ని రాజేష్ అంటాడు. శివ‌ను ఎందుకు అంత దారుణంగా కొట్టావ‌ని బాలును అడుగుతాడు రాజేష్‌.

 

మీనాకు తెలిస్తే మీ ఇద్ద‌రికి గొడ‌వ జ‌రుగుతుంద‌ని రాజేష్ అంటాడు. అస‌లు జ‌రిగింది తెలిస్తే మీనానే వాడిని కొట్టి చంపేస్తుంద‌ని బాలు అంటాడు. గుణ‌తో క‌లిసి ప్ర‌భావ‌తి ద‌గ్గ‌ర శివ డ‌బ్బులు కొట్టేసిన వీడియోను రాజేష్‌కు చూపిస్తాడు బాలు.

న‌మ్మ‌కం వ‌మ్ము చేయ‌కూడ‌ద‌నే…

గుణ‌నే రెచ్చ‌గొట్టి శివ‌తో ఈ ప‌నిచేయించి ఉంటాడ‌ని రాజేష్ అంటాడు. గుణ‌ను నాలుగు తంతే నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని అంటాడు. గుణ‌ను కొడితే ఈ విష‌యం ఇంట్లో తెలిసిపోతుంద‌ని, వ‌ద్ద‌ని బాలు అంటాడు. శివ గురించి వాళ్ల ఇంట్లో చెబుదామ‌ని వెళ్లాన‌ని, కానీ శివ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ బాగా చ‌దువుకుంటున్నాడ‌ని న‌మ్ముతుంద‌ని, వాళ్ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కూడ‌ద‌నే నిజం చెప్ప‌కుండా వ‌చ్చేశాన‌ని బాలు అంటాడు.

దొంగ‌త‌నాలు చేస్తున్నాడు…

అస‌లు శివ‌ కాలేజీకి కూడా వెళ్ల‌డం లేద‌ని తెలిసింద‌ని, ఆ కోపంలో ఉండ‌గానే నీతో గొడ‌వ‌ప‌డుతూ క‌నిపించాడ‌ని, అందుకే చిత‌క‌బాదాన‌ని రాజేష్‌తో అంటాడు బాలు.

గుణ‌తో క‌లిసి శివ దొంగ‌త‌నాలు చేస్తున్నాడ‌ని తెలిస్తే వాళ్ల ఇంట్లో వాళ్లు త‌ట్టుకోలేరు…మా అమ్మ‌కు తెలిస్తే మీనాను ఇంట్లో ఉండ‌నివ్వ‌దు. నాకేమో నిజం బ‌య‌ట‌పెట్ట‌క‌పోతే మ‌న‌శ్శాంతిగా ఉండ‌ద‌ని బాలు అంటాడు. ఆ వీడియోను డిలీట్ చేయ‌బోతాడు.

 

వీడియో ఉండాలి…

శివ ఎప్పుడైనా నిన్ను నిల‌దీస్తే ఈ వీడియో చూపించి దారిలో పెట్టొచ్చు. వాడిలో భ‌యం ఉండాలంటే ఈ వీడియో నీ ద‌గ్గ‌ర ఉండాలి. శివ‌ను నువ్వు కొట్టావ‌నే నిజం తెలిస్తే మీనాతో పాటు వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా నిన్ను త‌ప్పు ప‌డితే ఈ వీడియో చూపించొచ్చు అని రాజేష్ అంటాడు.

నేను రాను…

బాలు ట్రిప్‌కు బ‌య‌లుదేరుతాడు. మీనా అత‌డికి ఫోన్ చేస్తుంది. శివ చేతికి దెబ్బ త‌గిలింద‌ని, హాస్పిట‌ల్‌కు ర‌మ్మ‌ని అడుగుతుంది. నువ్వు ఉన్నావుగా…నేనేందుకు, ట్రిప్‌కు వెళుతున్నాన‌ని బాలు అంటాడు. నేను రా లేన‌ని చెబుతాడు. మా త‌మ్ముడి కంటే నీకు ట్రిప్ ముఖ్య‌మా అని మీనా అంటుంది. ట్రిప్ కు వెళ్ల‌క‌పోతే కారు ఈఎమ్ఐ ఎవ‌రు క‌డ‌తారు, లాంగ్ ట్రిప్ వెళితే డ‌బ్బులు ఎక్కువ వ‌స్తాయ‌ని కోపంగా బాలు బ‌దులిస్తాడు.

ప‌నే ముఖ్యం…

శివ ప‌రిస్థితి చూస్తుంటే భ‌య‌మేస్తుంద‌ని మీనా అంటుంది. వాడిని గాలికి వ‌దిలేశారు..రోజురోజుకు వెధ‌వ‌లా త‌యార‌వుతున్నాడ‌ని శివ గురించి బాలు కోపంగా అంటాడు.

మా త‌మ్ముడి కంటే మీకు ప‌నే ముఖ్య‌మా అని బాలును నిల‌దీస్తుంది మీనా. నా త‌మ్ముడి కంటే కూడా నాకు ఈ ప‌నే ముఖ్య‌మ‌ని బ‌దులిస్తాడు.

 

ఫోన్ క‌ట్ చేసిన బాలు…

మీకు ఈ విష‌యం చెబితే వెంట‌నే వ‌దిలేస్తార‌ని అనుకున్నాన‌ని మీనా ఎమోష‌న‌ల్ అవుతూ బాలుతో అంటుంది. ఇంత ఈజీగా ఎలా తీసుకుంటున్నార‌ని చెబుతుంది. లేక‌పోతే నా ప‌నుల‌న్నీ మానుకొని మీ త‌మ్ముడికి ఎలా ఉంది, ఎక్క‌డున్నాడు, ఏం చేస్తున్నాడ‌ని వాడి చుట్టూ తిర‌గాలా అని బాలు కోపంగా అంటాడు. నువ్వే అక్క‌డే ఉన్నాన‌ని అంటున్నావుగా…జాగ్ర‌త్త‌గా చూసుకో అని ఫోన్ క‌ట్ చేస్తాడు.

బాలు మాట‌ల‌తో మీనా బాధ‌ప‌డుతుంది. శివ‌కు యాక్సిడెంట్ అయిన విష‌యం అల్లుడిగారికి చెప్పావా అని మీనాను అడుగుతుంది పార్వ‌తి. ట్రిప్ ఉంద‌టా, రాలేన‌ని అన్నార‌ని త‌ల్లికి బ‌దులిస్తుంది మీనా.

త‌ల్లి ఇంటికి వెళ్లిపోగానే…బావ నా గురించి ఏమైనా మాట్లాడాడా అని మీనాను అడుగుతాడు శివ‌. హాస్పిట‌ల్‌కు రాలేనందుకు బాలు చాలా ఫీల‌య్యాడ‌ని, వీలు చూసుకొని వ‌స్తాన‌ని అన్నాడ‌ని త‌మ్ముడితో మీనా అబ‌ద్ధం చెబుతుంది.

మ‌హారాణి ఇంకా రాలేదు…

మీనా బ‌య‌ట‌కు వెళ్లి చాలా స‌మ‌యం ఇంటికి రాక‌పోవ‌డంతో ప్ర‌భావ‌తి రుస‌రుస‌లాడుతుంది. ఈ మ‌హారాణి ఇంకా దిగ‌బ‌డ‌లేద‌ని, ఇంట్లో టీ పెట్టే దిక్కుకూడాలేద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. ఇంట్లో ఇంకో ఇద్ద‌రు కోడ‌ళ్లు ఉన్నారుగా…వాళ్ల‌ను టీ పెట్టించి ఇవ్వ‌మ‌ని చెప్పొచ్చుగా అని స‌త్యం అంటాడు. అప్పుడే అక్క‌డికి మ‌నోజ్‌, రోహిణి వ‌స్తారు. మ‌నోజ్‌కు టీ కావాలంటా…మీనా ఇంకా రాలేదా అని రోహిణి అంటుంది.

 

దొంగిలించిన బైక్‌…

అప్పుడే మీనా ఇంట్లో అడుగుపెడుతుంది. శివ‌కు ఎలా ఉంద‌ని మీనాను అడుగుతాడు స‌త్యం. బైక్ పై నుంచి కింద‌ప‌డ్డాడు, చేయి బాగా వాచింద‌ని, డాక్ట‌ర్లు రిపోర్ట్ చూస్తే కానీ ఫ్యాక్చ‌ర్స్ అయ్యింది లేనిది తెలియద‌ని మీనా అంటుంది. మీ త‌మ్ముడికి బైక్ లేదుగా అని మీనాతో అంటుంది ప్ర‌భావ‌తి. ఫ్రెండ్ బైక్ అని మీనా బ‌దులిస్తుంది. ఫ్రైండ్ బైకా, దొంగిలించిన బైకా అని మ‌నోజ్ త‌క్కువ చేసి మాట్లాడుతాడు. ఇంత‌కుముందు శివ దొంగేక‌దా…దొంగ‌త‌నం చేస్తూ పోలీసుల నుంచి పారిపోతూ ప‌ట్టుప‌డ్డాడు కావ‌చ్చు అని ప్ర‌భావ‌తి అంటుంది.

పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు…

మీకులా దొంగ‌త‌నం చేసిన వాళ్ల‌ను వెన‌కేసుకొచ్చేవాళ్లు మా ఇంట్లో ఎవ‌రు లేర‌ని, చీరి పోగులేస్తార‌ని మ‌నోజ్‌తో పాటు ప్ర‌భావ‌తికి ధీటుగా స‌మాధాన‌మిస్తుంది మీనా. తెలియ‌క ఒక‌సారి త‌ప్పు చేస్తే జీవితాంతం దొంగ‌ను చేస్తారా అని కోపంగా అంటుంది. ఇప్పుడు శివ చాలా మారిపోయాడ‌ని, పార్కుల్లోకెళ్లి ప‌డుకోకుండా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడ‌ని అంటుంది.

ల‌క్ష‌లు క‌ట్నం తెచ్చిందిగా…

హాస్పిట‌ల్ ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు ఏమైనా కావాల‌ని మీనాను అడుగుతాడు స‌త్యం. ఆ ఇవ్వండి ల‌క్ష‌లు క‌ట్నం తెచ్చింది క‌దా దోచిపెట్టండి అని ప్ర‌భావ‌తి కోపంగా భ‌ర్త‌పై విరుచుకుప‌డుతుంది. ఆ మాట కొస్తే ఏ కోడ‌లు తెచ్చింది నీకు క‌ట్నం అని మీనాను స‌పోర్ట్ చేసి మాట్లాడుతాడు స‌త్యం.

 

వాళ్ల త‌మ్ముడు పార్కుల్లో ప‌డుకోకుండా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడుగా…కోటీశ్వ‌రులు క‌దా వాళ్ల హాస్పిట‌ల్ బిల్లు వాళ్లే క‌ట్టుకుంటార‌ని మ‌నోజ్ అంటాడు. హాస్పిట‌ల్ బిల్ క‌ట్ట‌మ‌ని నా మొగుడినే అడ‌గ‌లేదు మీరెందుకు ఉలిక్కిప‌డుతున్నార‌ని మ‌నోజ్‌తో అంటుంది రోహిణి.

ఏదో కార‌ణం ఉంది…

బాలు ఇంట్లోనేక‌నిపించ‌డంతో మీరు ఇంట్లోనే ఉన్నారా? ట్రిప్ నుంచి రావ‌డం లేట‌వుతుంద‌ని అన్నార‌ని బాలును అడుగుతుంది మీనా. ఇక్క‌డికి వ‌చ్చే బ‌దులు హాస్పిట‌ల్‌కు వ‌స్తే స‌రిపోతుంద‌ని క‌దా అని బాలును నిల‌దీస్తుంది. మా త‌మ్ముడికి ఎలా ఉంద‌ని ఒక్క మాట కూడా అడ‌గ‌టం లేదు ఎందుకొని అంటుంది. వాడికి ఏమైంద‌ని డాక్ట‌ర్‌ను మీరు అడ‌గాలి…నేను అడిగితే మీకు ఏం తెలుస్తుంద‌ని బాలు కోపంగా బ‌దులిస్తాడు. అత్త‌గారింట్లో ఏం జ‌రిగిన ప‌రిగెత్తుకుంటూ వెళ‌తాడు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు. ఏదో కార‌ణం ఉంద‌ని మ‌నోజ్ అనుమాన‌ప‌డ‌తాడు.

ప్ర‌భావ‌తి అత్రుత‌…

శివ ఏం యుద్ధానికి వెళ్లి చేతులు విర‌గ్గొట్టుకొని రాలేద‌ని, వాడు చేసిన ప‌నికి అని బాలు కోపంగా అంటాడు. మాకు అదే కావాలి ఏం జ‌రిగిందో చెప్పు అని ప్ర‌భావ‌తి అత్రుత‌గా బాలును అడుగుతుంది. అస‌లు వాడు ఎక్క‌డ పార్ట్ టైమ్ చేస్తున్నాడో, ఎలాంటి వాళ్ల ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నాడో తెలుసుకోవాలిగా అని మీనాపై ఫైర్ అవుతాడు బాలు.

 

తాగేసి వ‌చ్చి బాలు కొట్టాడు…

శివ బైక్ మీది నుంచి ప‌డ‌లేద‌ని, ఎవ‌రో కొట్టార‌ని మీనాతో డాక్ట‌ర్ చెబుతాడు. నిన్ను ఎవ‌రో కొట్టారో చెప్ప‌మ‌ని శివ‌ను నిల‌దీస్తుంది మీనా. తాగేసి వ‌చ్చి బాలు న‌న్ను కొట్టాడ‌ని శివ అబ‌ద్ధం ఆడుతాడు. అదే నిజ‌మ‌ని న‌మ్మ‌ని మీనా…మా త‌మ్ముడిని ఎందుకు కొట్టార‌ని బాలును నిల‌దీస్తుంది. మా బ‌తుకుల‌తో ఆడుకుంటే ఆడిగే దిక్కు లేద‌నేగా…క‌ష్టం వ‌స్తే మా కుటుంబానికి అండ‌గా ఉంటార‌నే భ‌రోసా మొత్తం పోయింద‌ని మీనా క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024